Bigg Boss 8 Telugu: మరో షాకింగ్ ఎలిమినేట్..3 వారాలకు మెహబూబ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే?
Bigg Boss 8 Telugu: బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ చూడని, ఎవరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ తొలి నాలుగు వారం కాస్త నెమ్మదిగా సాగినా.. వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ బాస్ షో పై హైప్స్ పెరిగాయి. అలాగే.. గత సీజన్లో చూడని కంటెంట్ ఇస్తుండటంతో ఈ సీజన్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. అలాగే.. స్టార్ మా లో హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తున్న ప్రోగ్రామ్ గా బిగ్ బాస్ నిలిచింది. ఎనిమిదో వారం కూడా ఎవరూ ఊహించని విధంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ఇంతకీ మూడు వారాలు హౌస్ లో కొనసాగినందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఓ లూక్కేయండి.
బిగ్ బాస్ షో సండే ఫన్ డే ఎపిసోడ్ లో సెలెబ్రేటిల సందడి చేశారు. దీపావళి సందర్బంగా మూవీ ప్రమోషన్స్ కోసం సినిమాల టీమ్స్ బిగ్ బాస్ హౌస్ లో వచ్చేశారు. ఈ దీపావళి స్సెషల్ ఎపిసోడ్ మూడున్నర గంటల పాటు సాగింది. ఇందులో దీపావళి సందర్భంగా విడుదలవుతున్న సినిమాల ప్రమోషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా.. శనివారం రోజు.. కంగువా మూవీ ప్రమోషన్ లో భాగం సూర్య రాగా.. ఆదివారం ఎపిసోడ్ లో క, లక్క భాస్కర్, అమరన్ టీంలు సందడి చేశాయి. వీరు కాకుండా అనసూయ డ్యాన్స్ పర్ఫామెన్స్, సమీరా భరద్వాజ్ పాటలు, హైపర్ ఆది స్పెషల్ సెగ్మెంట్ లతో దుమ్ము రేపారు. బిగ్ బాస్ ఆడియన్స్ కు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించారు.

ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే.. తొలివారం ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో శేఖర్ భాషా, మూడోవారం అభియ్ నవీన్, నాలుగోవారం సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారం ఎవరూ ఊహించని విధంగా మీడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి.. హీరో ఆదిత్య ఓం ను ఎలిమినేట్ చేశారు. అదే వారం చివరిలో నైనికా ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇక ఆరోవారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. ఏడో వారం ఎవరూ ఊహించని విధంగా మణికంఠ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. తాజాగా ఎనిమిదో వారం వైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇచ్చిన మెహబుబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యారు.
8వ వారం ఎలిమినేషన్లు మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో.. ఓజి క్లాన్ నుండి నిఖిల్, పృద్వి, విష్ణు ప్రియ, ప్రేరణ ఉండగా.. మహబూబ్ నయని పావని ఎలిమినేషన్ లో నిలిచారు. అయితే.. ఈ వారం నాని పావని ఎలిమినేట్ అవుతుందని చాలామంది భావించారు. చాలామంది బిగ్ బాస్ రివ్యూస్ కూడా నయని పావని ఈ వారం డేంజర్ జోన్ లో ఉందని, ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయని, కచ్చితంగా 8వ వారం నయని పావని ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా నాగార్జున నయనిని సేవ్ చేసి, మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో నిరాశగా బయటకు వచ్చాడు మెహబూబ్.
ఎలిమినేషన్ అనంతరం మెహబూబ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ మీద మెహబూబ్ మాట్లాడుతూ.. గత సీజన్ లో కూడా దీపావళి సమయంలోనే ఎలిమినేట్ అయ్యాననీ, ఇప్పుడు కూడా అదే పండగ వేళ ఎలిమినేట్ అయ్యాననీ ఫీల్ అయ్యారు. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడంలేదు. తాను ప్రతి టాస్క్‌లోనూ బెస్ట్ ఇచ్చాననీ, కానీ, దురదృష్టవశాత్తూ బయటకు వచ్చానంటూ ఎమోషనల్ అయ్యారు మెహబూబ్.
ఇదెలా ఉంటే.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ మూడు వారాలు హౌస్ లో కొనసాగినందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో అనేది ఆసక్తిగా మారింది. అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్ దాదాపు 21 రోజలు హౌస్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 8 కోసం మెహబూబ్ దిల్ సే వారానికి రూ 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే, ఈ లెక్కన 3 వారాలకు మెహబూబ్ దిల్ సే రూ. 15 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం.


Click it and Unblock the Notifications











