Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫుల్ లిస్ట్ లీక్.. షోలోకి టాలీవుడ్ సీనియర్ హీరో
ఎవరూ ఊహించని కాన్సెప్టుతో వచ్చినా చాలా తక్కువ సమయంలోనే భారీ స్పందనను అందుకుని సూపర్ సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పటికే చాలా సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఎనిమిదో దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఇంతకీ వాళ్లెవరు? ఎలాంటి సెలెబ్రిటీలు హౌస్‌లోకి అడుగు పెడుతున్నారు? అనే వివరాలను మీరే చూసేయండి మరి!
రికార్డు రేటింగ్‌తో కంప్లీట్
చాలా భాషల్లో ముందే వచ్చినా ఎనిమిదేళ్ల క్రితమే బిగ్ బాస్ షో తెలుగులోకి పరిచయం అయింది. మొదటి సీజన్‌తోనే సెన్సేషన్ అయిన ఇది.. అప్పటి నుంచి వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పటి వరకూ ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను నిర్వహకులు పూర్తి చేశారు. వీటికి రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. దీంతో ఇది దేశంలోనే నెంబర్ వన్ అయింది.

ఎనిమిదో సీజన్ ముందే
రెగ్యూలర్ సీజన్ల మాదిరిగానే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను కూడా ప్రతి ఏడాది ప్రసారం చేయాలని ప్లాన్ చేశారు. కానీ, దీన్ని ఒక్క సీజన్‌కే పరిమితం చేశారు. దీంతో రెండో దాన్ని ఈ ఏడాది తీసుకు వస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీన్ని మొదలుపెట్టలేదు. పైగా ఎనిమిదో సీజన్‌ను మరింత ముందుగానే తీసుకు రావాలని నిర్వహకులు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోసారి కొత్త కాన్సెప్టు
తెలుగులో బిగ్ బాస్ షో వచ్చిన సీజన్లను ఒకే రకమైన కంటెంట్‌తో తీసుకు వచ్చారు. ఫలితంగా ఆరో సీజన్‌లో రేటింగ్ దారుణంగా పడిపోయింది. దీంతో ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చి విజయవంతం చేసేశారు. ఇదే ఊపులో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం మరో కొత్త కాన్సెప్టును పరిచయం చేయబోతున్నట్లు తెలిసింది. దీంతో దీనిపై అంచనాలు పెరుగుతున్నాయి.
అవి స్టార్ట్.. కంటెస్టెంట్లు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను ఆగస్టు చివరి వారం నుంచే స్టార్ట్ చేయబోతున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. ఇందులో భాగంగానే నిర్వహకులు కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ వర్క్‌ను నిర్వహకులు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిసింది. అదే సమయంలో కంటెస్టెంట్ల ఎంపికను సైతం బిగ్ బాస్ టీమ్ ఇప్పటికే షురూ చేసినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
బుల్లితెర వాళ్లే ఎక్కువ
భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి బుల్లితెర సెలెబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం.. సీరియల్ నటి తేజస్విని, యాంకర్ వింద్యా, విష్ణుప్రియ భీమనేని, శ్వేతా నాయుడు, అంజలి, బుల్లితెర స్టార్ ఇంద్రనీల్ వర్మ, కమెడియన్ సద్దాం, సీరియల్ హీరో శివ కుమార్‌లు ఉన్నట్లు తాజాగా తెలిసింది.
సీనియర్ హీరో కూడా
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి టాలీవుడ్ సీనియర్ హీరో వినోద్ కుమార్ ఎంట్రీ ఇస్తున్నారట. ఆయనతో పాటు మై విలేజ్ షో అనిల్, తెలుగు హీరోయిన్ కుషిత కల్లాపు, సుప్రిత, యూట్యూబర్ శీతల్ గౌతమ్, సీనియర్ నటి సన, మోడల్ ఊర్మిళ చౌహాన్, యూట్యూబర్ యువ సామ్రాట్, కమెడియన్ బబ్లూ వస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











