Bigg Boss Telugu 8 బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.. ఈ సారి హోస్ట్ ఎవరంటే? దిమ్మతిరిగే స్కెచ్!

బుల్లితెర భారీ పాపులర్ షోగా రికార్డులు తిరగరాస్తోంది బిగ్ బాస్. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ షో సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. సీజన్లు గడుస్తున్నా కొద్దీ ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నా కూడా బిగ్ బాస్ హవా మాత్రం మాత్రం తగ్గడం లేదు. పక్కింట్లో లొల్లి జరిగితే చూసి ఎంటర్‌టైన్ అవుతాం అనే జనం ఈ షోకి నీరాజనం పలుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ బయటకొచ్చాయి.

బిగ్ బాస్.. ఆ లెక్కే వేరు:బిగ్ బాస్ ఇదో చెత్త షో.. ఈ షోతో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. ఈ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం? పిచ్చి చేష్టలతో యువతను పెడదారి పట్టించడం తప్ప. ఇలాంటి ఫీలింగ్స్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, జనాల నుంచి వింటూనే ఉన్నాం. అయినప్పటికీ టీఆర్పీ పరంగా బిగ్ బాస్ దూసుకుపోతోంది. ప్రతి సీజన్ కొత్తగా ప్లాన్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది బిగ్ బాస్ టీం.

Bigg Boss Telugu 8 Season Date finalied Here is the Host Probable Contestants list

బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ హవా:తొలుత హిందీలో గ్రాండ్ సక్సెస్ కావడంతో క్రమంగా అన్ని భాషలకు విస్తరించి బిగ్ బాస్ షో రన్ చేస్తున్నారు. 2017లో బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్ ప్రారంభం కాగా.. ఈ సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. తొలి సీజన్ తోనే తెలుగు ఆడియన్స్ మనసు దోచేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2కి నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు.

నాగార్జున ఎంట్రీతో వేరే లెవెల్:బిగ్ బాస్ సీజన్ 3 వచ్చేసరికి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున రంగంలోకి దిగారు. అప్పటినుంచి ప్రతి సీజన్ కూడా భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ 7 వరకు నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. ఈ సీజన్ పూర్తయ్యాక పల్లి ప్రశాంత్ అరెస్ట్, అతని ఇష్యూస్ హాట్ టాపిక్ కావడం చూశాం.

సీజన్ 8 డిఫరెంట్ ప్లాన్:ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 8 మరింత డిఫరెంట్‌గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. గేమ్స్, టాస్క్స్, ఎలిమినేషన్స్ ప్రేక్షకులకు మరపురాని అనుభూతి పంచేలా రూపొందిస్తున్నారట. మొత్తం 40 మంది కంటిస్టెంట్లతో ఈ ఏడాది షో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారట. గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాగా.. ఈ సారి సీజన్ 8 మాత్రం కాస్త ముందుగానే ప్రసారం చేయబోతున్నారట. ఈ మేరకు కొందరు టీవీ సీరియల్స్ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఫోలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారనేది తాజా సమాచారం.

Bigg Boss Telugu 8 Season Date finalied Here is the Host Probable Contestants list

హోస్ట్ ఎవరు? స్టార్ట్ ఎప్పుడు?:ఈ ఏడాది జూన్ నెలలోనే బిగ్ బాస్ సీజన్ 8 షురూ చేయనున్నారని తెలిసింది. గతంలో సీజన్ 1, 2, 3 కూడా జూన్, జులై నెలల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సీజన్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు షిఫ్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ జూన్ నెలలోనే సీజన్ 8 షురూ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్‌కి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారట. గత సీజన్స్ అన్నింటితో పోల్చితే ఈ సీజన్ మరింత డిఫరెంట్‌గా ప్లాన్ చేశారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X