Bigg Boss Telugu 8 Contestants list..బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ లిస్ట్ లీక్..ఎవరెవరు షోలోకి వస్తున్నారంటే?
ఎన్ని వివాదాలు రేగినా.. ఎన్ని గొడవలు జరిగినా.. సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నా.. చివరికి కోర్టు మెట్లెక్కినా బిగ్‌బాస్ రియాలిటీ షోకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. ప్రతి భారతీయ భాషలోనూ బిగ్‌బాస్ సక్సెస్ అయ్యింది. ప్రతి సీజన్‌కు రేటింగ్‌ను పెంచుకుంటూ.. కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న వారికి స్టార్‌డమ్‌ను, వారి కెరీర్‌కు మాంచి బూస్టప్‌ను అందిస్తోంది. తెలుగులో ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
గత సీజన్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. అమర్‌దీప్ చౌదరి, శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, శోభాశెట్టి, గౌతం, అశ్విని, భోలే, టేస్టీ తేజ, ఆట సందీప్, పూజా మూర్తి, నయని, శుభాశ్రీ, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్‌లు పాల్గొన్నారు. 105 రోజులకు పైగా నడిచిన ఈ సీజన్ విజేతగా సామాన్యుడు, అందులోనూ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అయితే బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చోటు చేసుకున్న అల్లర్లు దుమారం కావడమే కాదు ఏకంగా పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసేవరకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో నెక్ట్స్ సీజన్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ రకరకాల పేర్లు తెరమీదకి వస్తున్నాయి. షో స్టార్ట్ అయ్యే వరకు ఈ ప్రచారానికి తెరపడదన్నది తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సీజన్ కూడా కొంచెం త్వరగా ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. నిజానికి జూన్ లేదా జూలై నెలలో బిగ్‌బాస్ 8 ప్రారంభించాలని అనుకున్నా ఎన్నికల సీజన్, ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఉండటంతో వెనక్కి తగ్గారట. జూలై చివరి వారం లేదా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో ఈ ఏడాది సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతేకాదు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కి సెట్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో పాటు హోస్ట్ నాగార్జునతో ప్రోమో షూట్ కూడా ముగిసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తక్కువ మంది కంటెస్టెంట్స్‌నే హౌస్‌లోకి పంపవచ్చని .. ముఖ్యంగా సోషల్ మీడియా స్టార్లు కుమారి ఆంటీ, బర్రెలక్క , ఫార్మర్ నేత్ర, అనిల్, నా అన్వేషణ అన్వేష్, బ్యాంకాక్ పిల్ల, ప్రసాద్ టెక్, జబర్దస్త్ వర్ష, కెవ్వు కార్తీక్, కిరాక్ ఆర్పీ, హీరో సుధాకర్, వర్షిణి, ఉదయభాను, చమ్మక్ చంద్ర, హీరోయిన్ శాన్వి, సనా, అనిల్ గిలా, రాజ్ తరుణ్ , అంజలి పావని, కమెడియన్ సద్దాం తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో కొందరిని గత సీజన్ కోసం నిర్వాహకులు సంప్రదించగా.. పలు కారణాలతో వారు అంగీకరించలేదు. ఈసారి మాత్రం గట్టిగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సమయం ఉంది కాబట్టి కంటెస్టెంట్స్‌గా చాలా మంది పేర్లే తెరపైకి వస్తాయి. అంతేకాదు.. బిగ్‌బాస్ 8లో గత సీజన్స్‌లో పాల్గొన్న పాత కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా స్టార్ మాలో టెలికాస్ట్ అవుతూ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా కనిపించనున్నారు, వారి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయోనని బిగ్‌బాస్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











