Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 8 ఎప్పుడు? ఈసారి ఓటీటీ వెర్షన్‌లో షాకింగ్ ట్విస్ట్!
ఎక్కడో హాలీవుడ్లో పుట్టిన బిగ్ బాస్.. మన భారతదేశానికి వచ్చింది. అలా హిందీ బిగ్ బాస్ నుంచి రీజినల్ లాంగ్వేజస్ కు చేరింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 7వ సీజన్ నడుస్తుంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతుంది. మరో వారం రోజుల్లో ఈ షోకి ఎండ్ కార్డ్ పడనుంది. అయితే బిగ్ బాస్ తెలుగు 7కు మంచి ఆదరణ రావడంతో బిగ్ బాస్ 8ను త్వరలోనే ప్రారంభించాలని మేకర్స్ అనుకుంటున్నారు. అయితే ఈసారి ఓటీటీ వెర్షన్లో ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ తెలుగు 7 ఒకటి. అయితే ఈ షో ముగింపు దశకు చేరుకుంది. ఇంకా ఒక వారంలోనే ఈ షో విజేత ఎవరనేది తెలియనుంది. బిగ్ బాస్ సీజన్ 7ను మొదటి నుంచి ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో.. డిసెంబర్ 17న ముగియనుంది. ఆ రోజు ఆదివారం రాత్రి 6 గంటలకు గ్రాండ్ ఫినాలే జరగనుందని తెలుస్తోంది. ఇక ఈషోలో విజేత ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

మొత్తం 19మంది కంటెస్టెంట్స్ ఈసారి సీజన్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇంట్రెస్టుగాసాగుతోంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కానుందని సమాచారం. ఇక ఈ వారం ఆమె ఎలిమినేట్ అయితే.. మిడ్ వీక్ లో ఒకరు కానున్నారని తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ తెలుగు 7 మిడ్ వీక్ ఎలిమినేషన్ జోన్లో యావర్ అండ్ అర్జున్ అంబటి ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వగా.. ఫినాలేకి టాప్ 5 కంటెస్టెంట్స్ వెళ్తారు. అందులో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక టాప్ 4లో ఉండగా.. యావర్ లేదా అర్జున్ అంబటి టాప్ 5లోకి వస్తారు. ఇక విజేత రేసులో మాత్రం పల్లవి ప్రశాంత్ లేదా శివాజీ ఉన్నారు. వీరిలో ఒకరు విజేతగా.. మరొకరు రన్నర్ గా నిలుస్తారని తెలుస్తోంది.
వారం రోజుల్లో ఈ షో ముగియనుండగా.. దీని తర్వాత ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే బిగ్ బాస్ తెలుగు 7కి మంచి ఆదరణ రావడంతో.. త్వరగానే బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభించాలని మేకర్స్ అనుకుంటున్నారని సమాచారం. ఈ షోను వచ్చే ఏడాది జూన్ నుంచే ప్రారంభించాలని భావిస్తున్నారట. అయితే దీనిపై చర్చలు ఇంకా సాగుతున్నాయని.. బిగ్ బాస్ వర్గాల సమాచారం.
మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ పై కూడా చర్చలు సాగుతున్నాయి. ఇదివరకే బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ నడిపించగా.. అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మరి ఈసారి ఓటీటీ వర్షన్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నారట. అయితే ఓటీటీ వర్షన్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరో వారంలో బిగ్ బాస్ తెలుగు 7 ముగియనుంది.


Click it and Unblock the Notifications











