Bigg Boss: తల్లిని కోరిక నెరవేర్చిన టేస్టీ తేజ.. ఈ సీజన్ లో ఎన్ని లక్షలు సంపాదించడంటే?

Tasty Teja Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తిగా సాగుతున్న సంగతి తెలిసిందే. 13 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం 9 మంది మిగిలారు. అందులో ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఉండగా.. ఎలిమినేషన్స్ షాకింగ్ ట్వీస్ట్ చోటు చేసుకుంది. ఎవరు ఊహించని విధంగా శనివారం నాడు.. టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. టేస్టీ తేజ. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన తేజ.. ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ తరుణంలో టెస్టీ తేజ్ రెమ్యూనరేషన్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. దీంతో టాప్ 5 లో ఎవరు నిలుస్తారో? టైటిల్ రేసులో ఎవరు నిలుస్తారో? అనేది ఉత్కంఠ గా మారింది. ఈ నేపథ్యంలో 13 వారం హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ను నిర్వహించారు. ఈ టాస్క్ కంటెస్టెంట్ల భవితవ్యాన్ని మార్చేసింది. అప్పటివరకు తాము టైటిల్ విన్నర్స్ అని విర్రవీగినా కంటెస్టెంట్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అప్పటివరకు జీరోలుగా ఉన్న కంటెస్టెంట్లు టాప్ 5 పై రేసులో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Bigg Boss Telugu 8 Tasty Teja Eliminated Tasty Teja Remuneration details Full Story Here

వాస్తవానికి టికెట్ టు ఫినాలే సీజన్ సరూప అనే మార్చేసిందని చెప్పవచ్చు. ముక్కు అవినాష్ ఈ అవకాశాన్ని పొంది ఈ సీజన్ టాప్ ఫైవ్ తొలి కంటెస్టెంట్ గా నిలిచారు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ నుండి సేఫ్ అయ్యాడు. వాస్తవానికి 12 వారమే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వార్తలు తెగ వినిపించాయి. కానీ, ఆ వారం సింగిల్ ఎలిమినేషన్ జరిపి యష్మి గౌడ ను మాత్రమే ఎలిమినేట్ చేశారు. దీంతో 13 వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ అనివార్యమయ్యింది.

ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో మెగా చీప్ రోహిణి తప్ప మిగతా కంటెస్టెంట్ లందరూ నామినేషన్ లో నిలిచారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ కీలకంగా మారింది. ఇందులో నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణలు టాప్ 4 పొజిషన్లో నిలువగా.. విష్ణు ప్రియ యావరేజ్ ఓటింగ్ తో మిడిల్ లో ఉంది. ఓటింగ్లో తక్కువ ఓట్లు వచ్చి డేంజర్ జోన్ లో పృద్వి రాజు శెట్టి, ముక్కు అవినాష్, టేస్టీ తేజ వరుసగా నిలిచారు. దీంతో ఓటింగ్ ప్రకారం లిస్ట్ కంటెస్టెంట్ గా ఉన్న టేస్టీ తేజ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి టేస్టీ తేజ తరువాత ముక్కు అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. కానీ, అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ ఫస్ట్ విన్నర్ గా నిలవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ నుండి తప్పించుకున్నాడు. దీంతో ఆ తర్వాత పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్ శెట్టి రేపు నామినేట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.

Bigg Boss Telugu 8 Tasty Teja Eliminated Tasty Teja Remuneration details Full Story Here

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో పాల్గొన్నందుకు టెస్టీ తేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్‌లో అక్టోబర్ 6 న వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ. దాదాపు 8 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తేజ కామెడీ టైమింగ్ తో నవ్వుల పూవులు పూయించారు. అయితే.. బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొన్నందుకు టేస్టీ తేజ వారానికి రూ. 4 లక్ష రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే.. టేస్టీ తేజ రెండు నెలల్లో రూ.30 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

టెస్ట్ తేజ అంతముందుకు ఏడవ సీజన్లో కూడా పాల్గొన్నాడు . ఆ సీజన్లో 9 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ ప్రేక్షకులను అలరించారు. ఆ సమయంలో 9 వారాలపాటు ఉన్న టేస్టీ తేజ దాదాపు 13 లక్షల 50వేల రూపాయలను తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ 7 లో కంటే బిగ్ బాస్ 8 లోనే రెట్టింపు మొత్తాన్ని గెలుచుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో పేరిట తేజ గట్టిగానే వసూలు చేసినట్లు నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X