Bigg Boss Telugu 8 : నా ఫ్యామిలీని లాగొద్దు .. దీని వెనుక వాడే, ట్రోలింగ్‌పై నిఖిల్ షాకింగ్ కామెంట్స్
దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్‌బాస్ తెలుగు 8కి ఎండ్ కార్డ్ పడింది. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో బుల్లితెర నటుడు , కర్ణాటకకు చెందిన నిఖిల్ మలియక్కల్ ఈ సీజన్ విజేతగా నిలిచారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోటీలో గౌతమ్‌ను ఓడించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్‌బాస్ తెలుగు 8 ట్రోఫీని సగర్వంగా అందుకున్నాడు నిఖిల్.
సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నాటి నుంచి 15 వారాల పాటు నిఖిల్ నిలకడగానే ఆడాడు. ఓజీ టీమ్‌కు చీఫ్‌గా అద్భుతంగా నడిపించాడు. తను గెలవడం కోసం అమ్మాయిల ఎమోషన్స్‌ను అడ్డుపెట్టుకున్నాడంటూ స్వయంగా లేడీ కంటెస్టెంట్స్ ఆరోపించినా , లవ్ గేమ్ ఆడాడంటూ విమర్శలు వచ్చినా నిలబడ్డాడు. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి చివరి వరకు ఓ ఫైటర్ లాగానే పోరాడి తెలుగు బిగ్‌బాస్ టైటిల్‌ను సాధించాడు.

ఇక బిగ్‌బాస్ విజేతగా ప్రైజ్ మనీ కింద రూ. 55 లక్షలు అందుకుని తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇంత మొత్తం అందుకున్న వ్యక్తిగా నిలిచాడు నిఖిల్. అలాగే మారుతి డిజైర్ కారును కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు దాదాపు 15 వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు గాను వారానికి రూ. 2.25 లక్షల చొప్పున మొత్తంగా రూ.33,75,000 లక్షల రెమ్యునరేషన్ దక్కించుకున్నాడు. మొత్తానికి తెలుగు బిగ్‌బాస్‌లో పాల్గొన్నందుకు గాను రూ. 88 లక్షల నగదు, ఓ కారును నిఖిల్ సొంతం చేసుకున్నాడు.
అయితే తెలుగు బిగ్‌బాస్‌కు ఓ కన్నడ వ్యక్తిని విజేతగా చేయడం ఏంటంటూ నిఖిల్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. కన్నడ బ్యాచ్ అంతా ఓ గ్రూప్‌లా ఆడి తెలుగువాళ్లని తొక్కేశారని , బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా వాళ్లని నామినేషన్స్‌లో కాపాడుకుంటూ వచ్చారని తెలుగు ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తెలుగు , కన్నడ అనే ఫీలింగ్స్ అనేవి తనకు లేవని.. ఎక్కడికి వెళ్లినా తనను నిఖిల్ అనే పిలుస్తారని కుండబద్ధలు కొట్టాడు.
ఇక బిగ్‌బాస్ సీజన్ ముగిసి, విజేతగా బయటికి వచ్చాక తెలుగు మీడియాకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నిఖిల్. ఈ క్రమంలో తెలుగు ఛానెల్‌తో మాట్లాడుతూ.. తనపై బయట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందన్నాడు. ఫినాలే రోజున తాను ట్రోఫీ ఎత్తగానే తమ్ముడు, అమ్మ బాగా ఎమోషనల్ అయ్యారని నిఖిల్ పేర్కొన్నారు. హౌస్ నుంచి బయటికొచ్చాక తనపై ఏం జరిగిందో తెలుసుకున్నానని ఆయన తెలిపారు.
దీని వెనుక ఎవరున్నారో తనకు బాగా తెలుసని .. వాడు దీనిని ఆపేయ్యాలని వార్నింగ్ ఇచ్చాడు. తనపై ఏమైనా చేసుకోండి, ఎంతైనా రాసుకోండి కానీ ఫ్యామిలీని, ఇష్టమైన వాళ్లని లాగొద్దని.. తాను యాక్షన్ లోకి దిగితే తట్టుకోలేరని నిఖిల్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిఖిల్‌పై జరుగుతున్న ట్రోలింగ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనేది చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











