Bigg Boss Telugu 8: షాకింగ్ ఎలిమినేటెడ్.. కళామతల్లికి దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్..

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. మరో వారం రోజులలో సీజన్ 8 ముగియనుంది. ఈ తరుణంలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విజేత ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎవరూ ఊహించని విధంగా 14 వారంలో డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎలిమినేషన్ లో శనివారం బిగ్ బాస్ శివంగి రోహిణి ఎలిమినేట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్లో బిగ్ బాస్ కళామతల్లి విష్ణు ప్రియ ఎలిమినేట్ అయితున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ అమ్మడు బిగ్ బాస్ 8లో ఎంత సంపాదించిందనేది హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు ఏ సీజన్లో చూడని విధంగా.. సీజన్ 8 కొనసాగుతోంది. దిమ్మతిరిగే ట్రస్టులు మలుపులు మామూలుగా లేవు. గ్రాండ్ ఫినాలే ముందు జరగబోతున్న ఈ ఎలిమినేషన్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అయితే హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్ లో ఆల్రెడీ ముక్కు అవినాష్ టికెట్ టు వినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. మిగిలింది ఆరుగురు. వీరిలో శనివారం ఎపిసోడ్లో ఊహించని విధంగా రోహిణి ఎలిమినేట్ కాగా మిగిలింది. విష్ణు ప్రియ, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్.. వీరందరూ నామినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 8 Vishnupriya Eliminated Remuneration details Full Story Here

వీరిలో అత్యధికంగా నిఖిల్, గౌతమ్ నువ్వా నేనా అంటూ ఓటింగ్ లో పోటీ పడుతున్నారు. వీరిద్దరూ దాదాపు 70% ఓటింగ్ నీ షేర్ చేసుకున్నారు. అంటే వీరు ఎలాంటి టఫ్ ఫైట్ ఇస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. ఏం మిగిలింది 30%.. ఇందులో విష్ణు ప్రియ, ప్రేరణ, నబీల్ పోటీ పడుతున్నారు. అయితే.. వీరి ముగ్గురు పరిస్థితి డేంజర్ జోన్కు దగ్గరలో ఉన్నట్లే తెలుస్తుంది. అయితే విష్ణు ప్రియకు మాత్రం చాలా తక్కువ ఓట్లు పోలనట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం ఎపిసోడ్లో విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యిందట. దీంతో బిగ్ బాస్ లో విష్ణు ప్రియ ప్రస్థానం ముగిసినట్లు అర్థమవుతుంది.

బిగ్ బాస్ సీజన్ 8 తో విష్ణుప్రియకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. పృధ్విరాజ్ శెట్టితో విష్ణు ప్రియ చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ లవర్స్ కి ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించారు. మొత్తానికి విష్ణు ప్రియ అండ్ పృద్వి బిగ్ బాస్ 8 లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇది కంటెంట్ కోసమేనని, నిజంగా వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, ఇతర కంటెస్టెంట్లు చేస్తున్న వ్యాఖ్యలతో అర్థం అవుతుంది. ఏదేమైనా బిగ్ బాస్ హౌస్ లోలో వీరి రచ్చ మాత్రం మామూలుగా లేదు. 13వ వారం ఎలిమినేషన్ లో పృద్వి ఎలిమినేట్ కాగా.. 14వ వారం ఎలిమినేషన్ లో విష్ణు ప్రియ హౌస్ నుండి బయటకు వచ్చేసింది.

Bigg Boss Telugu 8 Vishnupriya Eliminated Remuneration details Full Story Here

విజయవంతంగా బిగ్బాస్ జర్నీని పూర్తి చేసుకున్న కళామతల్లి విష్ణు ప్రియ.. బిగ్ బాస్ నుండి ఎంత రెమినేషన్ తీసుకున్నది అనేది చర్చనీయంగా మారింది. బిగ్ బాస్ ఇన్పుట్స్ ప్రకారం.. విష్ణు ప్రియ వారానికి నాలుగు లక్షలు చొప్పున రెమ్యూనరేషన్ పొందినట్లు తెలుస్తోంది. అంటే.. 14 వారాలకు గాను రూ. 56 లక్షల రెమ్యూనరేషన్ పొందినట్లు సమాచారం. దాదాపు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పొందిన రెమ్యూనరేషన్ పొందినట్లు తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ టైటిల్ గెలవకుండా.. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కానీ, ఈ సీజన్‌లో లేడీ విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ విష్ణు ప్రియ చేతులారా పోగొట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X