Bigg Boss Telugu 8 Elimination: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్. కిర్రాక్ సీత, శేఖర్ భాషా ఎవరంటే?

తెలుగులో బిగ్‌బాస్ షో 8వ సీజన్‌లో రెండోవారం ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. ఈ వారం అందరూ టాప్ కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నందున ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఉత్కంఠగా మారింది. అయితే రెండోవారం టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న కంటెస్టెంట్‌కు అతి తక్కువ ఓట్లు పోలైనట్టు తాజా సమాచారం. ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారు అనే వివరాల్లోకి వెళితే..

ముందుగా చెప్పినట్టుగానే తొలివారమే ట్విస్టులు, టర్నులతో బిగ్‌బాస్ కొనసాగుతున్నది. ఎవరూ ఊహించని విధంగా ఇంటి నుంచి తొలివారం బేబక్కను బయటకు పంపిచారు. ఈ సీజన్ నుంచి తొలి కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ కావడం కొందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే రెండోవారం కూడా అదే జరగబోతున్నది అనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Bigg Boss Telugu 8 Week 2 Elimination Is Shekhar Basha Eliminated from House

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో రెండోవారం 8 మంది నామినేట్ అయ్యారు. విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ, మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, శేఖర్ భాషా తదితరులు నామినేషన్‌లోకి వచ్చి ఎలిమినేషన్ ముప్పు ఉందనే విషయం తాజా ఓటింగ్ లైన్లు ముగిసిన తర్వాత బయటకు వచ్చిన విషయం.

అయితే ఓటింగ్ లైన్స్ ముగిసిన తర్వాత వచ్చిన డేటా ప్రకారం.. విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్, పృథ్వీ నలుగురు టాప్ ఓటింగ్‌తో ముందున్నారు. ఆ తర్వాత నైనిక, ఆదిత్య ఓం బెటర్ ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లోక్ వచ్చారు. అయితే డేంజర్ జోన్‌లో మాత్రం శేఖర్ భాషా, కిర్రాక్ సీత ఉన్నారు. వీరిద్దరు దాదాపు ఒకే రేంజ్‌లో ఓట్లు సంపాదించుకొన్నారు. దాంతో ఎవరు అవుట్ అవుతారనే విషయంలో కన్‌ఫ్యూజ్ ఏర్పడింది.

అయితే ఓటింగ్‌లో చివరిస్థానంలో ఉన్న సీత, భాషాల ఎలిమినేషన్‌ను నిర్ణయించే మిస్డ్ కాల్ డేటా మాత్రమే అనే విషయం బయటకు వచ్చింది. అయితే సోషల్ మీడియాలో స్ట్రాంగ్‌గా ఉన్న కిర్రాక్ సీత సేఫ్ అయ్యారని, చివరికి శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారనే విషయం బయటకు వచ్చింది.

తాజాగా శేఖర్ భాషాకు కొడుకు పుట్టిన విషయాన్ని శనివారం ఎపిసోడ్‌లో వెల్లడించారు. ఆ వార్త వినగానే ఆయన ఆనందంతో కంటతడి పెట్టారు. ఆయన ఎలిమినేట్ అయినా తాను ఓ రకంగా సంతోషమే. ఎందుకంటే పుట్టిన కొడుకును చూసుకోవడానికి వెళ్తున్నానే ఫీలింగ్ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X