Bigg Boss Telugu 8 Nominations: 2వ వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఎవరెవరంటే.. విష్ణుప్రియకు షాక్!
బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షోలో రెండోవారం నామినేషన్స్ భారీ గొడవలు, వాగ్వాదాల మధ్య ముగిసాయి. ఎప్పటిలానే కంటెస్టెంట్లు తమ కారణాలు చెప్పి నామినేషన్స్ వేశారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య తీవ్ర అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అయితే ఎవరికి వారు తమ వాదనలు సమర్ధించుకొని ఇంటిలో ఉండటానికి అర్హత లేదంటూ ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ వేశారు. ఈ వారం ఎలిమినేషన్‌కు అవకాశం ఉన్న కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో తొలివారం ఎలిమినేషన్ ముగిసిన తర్వాత ఇంటిలో రెండోవారం నామినేషన్స్ ప్రారంభించారు. తొలివారం ఇంటి నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తొలివారమే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడం ఆమె ఫ్యాన్ప్‌కు షాక్ తగిలినట్టు అయింది.

రెండోవారం నామినేషన్స్ సందర్భంగా ప్రేరణ, కిర్రాక్ సీత, విష్ణుప్రియ, సోనియా ఆకుల మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. ఇంటిలో జరిగిన సంఘటనల ఆధారంగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఎవరికి వారు డిఫెండ్ చేసుకోవడం కనిపించింది. ఇక ఆదిత్య, మణికంఠపై ఇతర కంటెస్టెంట్లు భారీగా ఆరోపణలు చేయడం కనిపించింది.
అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న పేర్లను ప్రకటించారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నైనిక ఉన్నారంటూ ఆయన చెప్పారు. ఈ వారం మొత్తం 8 మంది సభ్యులు ఎలిమినేషన్ ప్రక్రియకు ఎంపికయ్యారు.
అయితే ఇంటిలో అతిపెద్ద క్లాన్ ఉన్న యష్మి గౌడకు ఓ స్పెషల్ పవర్ ఇస్తూ ఇంటి సభ్యులకు షాకిచ్చాడు. నామినేట్ అయిన వారిలో ఒకరిని సేఫ్ చేసి.. నామినేట్ కాని వారిలో మరొకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ అధికారాన్ని ఉపయోగించి ఒకరిని సేఫ్ చేసి.. మరొకరిని నామినేట్ చేయమని అడిగాడు. దాంతో ఎనిమిది మందిలో నుంచి ప్రేరణ బయటకు వచ్చి.. విష్ణుప్రియ ఆ జాబితాలో చేరింది.
దాంతో నామినేట్ అయిన ప్రేరణను సేఫ్ చేయాలని అనుకొంటున్నాను. అలాగే విష్ణుప్రియను నామినేట్ చేయడాలని అనుకొంటున్నానని యష్మి గౌడ తన నిర్ణయాన్ని వెల్లడించింది. దాంతో విష్ణు ప్రియ షాక్ అయింది. అయితే తనపై చేసిన కొన్ని ఆరోపణలను విష్ణు ప్రియ సమర్ధించుకొని అలా నామినేషన్స్‌లోకి వెళ్లింది.


Click it and Unblock the Notifications











