Bigg Boss Telugu 8 Reload Live: గ్రాండ్‌గా బిగ్‌బాస్ తెలుగు 8 వైల్డ్ కార్డులు.. ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ట్విస్టులు, టర్నులతో కొనసాగుతున్నది. 5వ వారం ముగింపులో బిగ్‌బాస్ ట్విస్టులు ఇస్తూ సరికొత్తగా భారీగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఇంటిలో 9 మంది కంటెస్టెంట్లు ఉండగా.. మరో 8 మందిని ఇంటిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌తోపాటు.. వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా ఎవరెవరూ వస్తున్నారనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో 5వ వారం ముగింపులో నైనిక ఎలిమినేట్ కాగా.. మిడ్ వీక్‌లో ఆదిత్య ఓం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇద్దరి ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం ఇంటిలోకి మరో 8 మందిని ఇంటిలోకి వైల్డ్ కార్డుల ద్వారా ఇంటిలోకి పంపించనున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. గంగవ్వ, హరితేజ, ముక్కు అవినాష్, నయని పావని, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, మెహబూబ్ ఉన్నారు.

ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీగా
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తొలి కంటెస్టెంట్‌గా టెలివిజన్ యాంకర్, యాక్టర్ హరితేజ ఇంటిలోకి ప్రవేశించారు. అయితే గత సీజన్‌లో ఆస్వాదించిన క్షణాలను గుర్తు చేసుకొన్నారు. ప్రస్తుతం సీజన్‌లో నబీల్ కత్తి.. కిర్రాక్ సీత, మణికంఠ సుత్తి అని అన్నారు. తనకు యష్వి రూపంలో మంచి పోటీ ఉండవచ్చు అని చెప్పారు.
సెకండ్ వైల్డ్ కార్డు ఎంట్రీగా
ఈ సీజన్‌లో రెండో వైల్డ్ కార్డు ఎంట్రీగా టేస్టీ తేజ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సారి కప్పు కొట్టు బిగిల్ అంటూ తల్లి ఆశ్వీర్వాదం ఇవ్వగా.. ఈ సారి కప్పు కొట్టడం ఖాయం అంటూ టేస్టీ తేజ ఎంట్రీ ఇచ్చారు. బయటకు వెళ్లిన తర్వాత అందరూ ఇష్టపడుతున్నారు. అందుకే నేను టెడ్డీ బేర్ డిజైన్‌తో సూట్ వేసుకొన్నారు. నా జీవితంలో మిరాకిల్ అంటూ కామెంట్ చేశారు.
మూడో వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా
ఇంటిలోకి నయని పావని ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 7వలోకి అడుగుపెట్టిన ఈ భామ తొలివారమే ఎలిమినేట్ అయింది. దాంతో తన ప్రతిభను నిరూపించుకోలేకపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరోసారి ఛాన్స్ దక్కించుకొన్నది. నయనికి శివాజీ విషెస్ చెప్పారు. నబీల్ కత్తి అని.. మణికంఠ, కిర్రాక్ సీత సుత్తి అని చెప్పింది. ఈసారి నేనేంటో నిరూపించుకొంటాను అని నయని పావని చెప్పింది.
బిగ్‌బాస్ తెలుగు రీలోడ్‌లో 4వ వైల్డ్ కార్డు ఎంట్రీగా
బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో రాణించిన మెహబూబ్ మరోసారి ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈయనకు సోహైల్ విషెస్ తెలియజేశారు. తనకు బిగ్ బాస్ తర్వాత మంచిగా గుర్తింపు వచ్చింది. ఈ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నాను. మూడు దేశాల్లో భారీగా పాటలు షూట్ చేశానని తెలిపారు.
5వ వైల్డ్ కార్డు ఎంట్రీగా
బిగ్‌బాస్ తెలుగు 8 రిలోడ్ ఈవెంట్‌లో 8 మంది వైల్డ్ కార్డులను ఫరిచయం చేశారు హెస్ట్ నాగార్జున అక్కినేని. నాలుగో వైల్డ్ కార్డు ఎంట్రీగా టెలివిజన్ యాంకర్, యాక్టర్ రోహిణి ఇంటిలోకి అడుగుపెట్టారు. సీజన్ 3లో సగమే పూర్తయింది. ఈ సగం 8 సీజన్‌తో పూర్తి చేస్తాను. నేనెప్పుడూ సెకండ్ ఛాన్స్‌ను నమ్ముతాను. ఈ రెండో అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొంటాను అని రోహిణి అన్నారు. అలా ఇంటిలోకి అడుగపెట్టారు.
6వ వైల్డ్ కార్డు ఎంట్రీగా
ఇంటిలోకి వైల్డ్ కార్డు రూపంలో ఆరో వ్యక్తిగా గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 7లో అశ్వత్తామ 2.0 అంటూ అలజడి రేపిన ఈయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యారు.
7వ కంటెస్టెంట్‌గా
గతంలో సీజన్ 4లో రాణించిన జబర్దస్త్ అవినాష్ మరోసారి అడుగుపెట్టారు. శ్రీముఖి ఆయనకు విషెస్ తెలియజేశారు. ఇంట్లో కత్తి అంటే నబీల్.. సుత్తి అంటే యష్మీ అంటూ కామెంట్ చేశాడు. ఇక ముగ్గురిని ఇమినేట్ చేసి నవ్వించి ఇంట్లోకి అడుగుపెట్టాడు.
8వ వ్యక్తిగా గంగవ్వ
బిగ్‌బాస్ తెలుగు 8 రీలోడ్ ఈవెంట్‌లో మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ మరోసారి ఇంట్లోకి అడుగుపెట్టారు. బిగ్‌బాస్ నుంచి 5వ వారం సెల్ఫ్ ఎలిమినేట్ అయిన ఈ అమ్మ... 8వ సీజన్‌లో 5వ వారంలో ఇంట్లోకి అడుగపెట్టారు. తనకు ఈ షో ఎంతో ఇచ్చింది. నాకు ఇల్లు ఇచ్చింది. నా పిల్లలకు చదువు చెప్పించే అవకాశం కల్పించిందని ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











