Bigg Boss Telugu 8 Grand Finale: బయటికి రా చూసుకుందాం.. కింగ్ నాగ్ ముందే అవినాష్ కు మణికంఠ వార్నింగ్..
Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్ బాస్ సీజన్ 8 రియాల్టీ షో గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ ప్రారంభమైంది. లిమిట్ లెస్ ట్విస్టులు.. లిమిట్ లెస్ సర్ప్రైజ్ లు.. లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ తో సాగిన బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు ఛీప్ గెస్టుగా రామ్ చరణ్ వచ్చారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు 'దేవర' టైటిల్ సాంగ్ పై మాస్ స్టెప్పులు వేస్తూ కింగ్ నాగార్జున గ్రాండ్ గా ఏంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలో అవినాష్ కు మణికంఠ వార్నింగ్ ఇచ్చారు? ఇంతకీ ఏం జరిగిందంటే?
బిగ్‌బాస్ 8వ సీజన్ 100 రోజులకు పైగా బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సీజన్ టాప్-5లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి టైటిల్ విజేతకు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వబోతున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.ఈసారి విజేతగా నిలిచిన వాళ్లకు హీరో రామ్ చరణ్ ట్రోఫీ బహుకరించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయితే .. వారి విన్నింగ్ స్పీచ్ ఇస్తారో.. అపోనేట్ కంటెస్టెంట్ యాక్ట్ చేసి చూపించాలంటూ నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇస్తారు.

ఈ టాస్క్ లో ఫస్ట్ అవినాష్ .. ప్రేరణ టైటిల్ విన్నర్ అయితే తన విన్నింగ్ స్పీచ్ ఎలా ఉంటుందో.. తన మాటల్లో చెప్పాడు. ప్రేరణ అవభావాలతో సహా ఎక్స్ ప్రెస్ చేస్తూ అవినాష్ జీవించేస్తాడు. ప్రేరణ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ను ఇమిటేట్ చేస్తూ నవ్వుల పువ్వులు పూయించాడు. ప్రేరణ భర్త శ్రీపాద కూడా పడి పడి నవ్వుకున్నాడు. యాజ్ టీజ్ గా ప్రేరణ లాగా చేశాడంటూ ముక్కు అవినాష్ పర్ఫామెన్స్ కు 10/10 మార్కులు ఇచ్చేశాడు.
ఆ తర్వాత బిగ్ బాస్ ఎక్స్ హౌస్ మెంట్ స్ లలో మణికంఠ విన్నర్ అయితే.. విన్నింగ్ స్పీచ్ ఎలా ఇస్తాడో? ఒకసారి చేసి చూపించమని నాగార్జున కోరుతాడు. దీంతో ముక్కు అవినాష్ రెచ్చిపోతాడు. మణికంఠ లాగా.. అఖిల బ్రహ్మాండ కోటి.. అంటూ మణికంఠలా పాట పాడుతాడు. 'నాకు తెలుసు నేను విన్నర్ అవుతానని, ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలుసు నేను విన్నర్ అవుతానని, ఈరోజు శాస్త్రి బామ్ వల్లనే.. నేను విన్నర్ అయ్యాను. అది లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాన్ని కాదు. ఈరోజు నేను విన్నర్ కావడానికి కారణం గోల్డెన్ రూమ్. నేను విన్ అయ్యాను బ్రో. ప్రియా నేను విన్ అయ్యాను. అంటూ మణికంఠ ను ఇమిటేట్ చేస్తాడు.

దీంతో మణికంఠ సీరియస్ గా చూస్తూ.. 'కమ్ అవుట్ సైడ్. దేక్ లేంగే.. బయటికి రా చూసుకుందాం ..' అంటూ నాగార్జున ముందు ఫన్నీగా అవినాష్ కు మణికంఠ వార్నింగ్ ఇస్తాడు. వాస్తవానికి.. మణికంఠ మాట్లాడింది అర్థం కాక ఏం దేకుతావ్ అంటూ మరో పని చేసి.. షో లో నవ్వుల పూలు పూయిస్తాడు. పక్కనున్న సీత ఈ పర్ఫామెన్స్ కు తాను 10 అవుట్ ఆఫ్ టెన్ ఇస్తానంటూ అరుస్తుంది. ఇలా ఫన్నీగా సాగుతోంది. ఇలా ఒక్కొక్క కంటెస్టెంట్ ఇతర కంటెస్టెంట్స్ లాగా నటిస్తూ.. బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.


Click it and Unblock the Notifications











