Bigg Boss Telugu 8 Grand Finale: గంగవ్వ ఎలిమినేట్ కు కారణం టేస్టి తేజనేనా?.. ఫినాలేలో ఆ స్టాంగ్ కంటెస్టెంట్స్
Bigg BossTelugu 8: లిమిట్ లెస్ ట్విస్టులు.. లిమిట్ లెస్ సర్ప్రైజ్ లు.. లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ తో సాగిన బిగ్ బాస్ సీజన్ 8 రియాల్టీ షో గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ ప్రారంభమైంది. ఎన్నో రూమర్స్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా రామ్ చరణ్ రాబోతున్నారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు దేవర టైటిల్ సాంగ్ పై మాస్ స్టెప్పులు వేస్తూ కింగ్ నాగార్జున గ్రాండ్ గా ఇచ్చారు. హోస్ట్ నాగార్జునతోపాటు ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఓ మాజీ కంటెస్టెంట్ మాత్రం కనిపించలేదు? ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు?
హోస్ట్ నాగార్జునతోపాటు ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత.. తమ ఎక్స్పీరియన్స్ ను చెప్పుకొచ్చారు. అలాగే.. ఈ సీజన్లో ఎవరు రన్నర్? ఎవరు విన్నర్? అనేది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎలిమినేట్ అయిన వరుస క్రమం బట్టి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సీజన్ నుండి తొలుత ఎలిమినేట్ అయిన బేబక్క మాట్లాడుతూ .. తన క్రేజ్ అండ్ పాపులారిటీ పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. చిన్నపిల్లలు కూడా తనని గుర్తుపట్టి.. బేబక్క అంటూ తెలుస్తున్నారని, చిన్నోళ్లకు పెద్దోళ్లకి అందరికీ తాను అక్కయ్య గా మారానని బాధపడింది.

అనంతరం అభయ్ మాట్లాడుతూ తన కెరీర్ మొత్తం మారిందని, వరస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారని, తాను కూడా ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈసారి గౌతమ్ విన్నర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ తర్వాత సోనియా ఆకుల మాట్లాడుతూ.. ఈ సీజన్ తర్వాత తాను ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందని, తాను మాట్లాడవద్దని నిర్ణయించుకున్నానని చెప్పింది. ట్రోల్స్ కూడా ఎక్కువ అయ్యే అని, కానీ మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా ముందుకు దూసుకు వెళ్తున్నానని చెప్పింది. ఈసారి టైటిల్ విన్నర్ గా నిఖిల్ గాని, గౌతమ్ లో ఎవరో ఒకరు విన్నర్ కావచ్చు అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఆ తర్వాత కిర్రాక్ సీత మాట్లాడుతూ.. తనకు మంచి గుర్తింపు వచ్చిందని బిగ్ బాస్ షోకు థాంక్స్ చెప్పింది. తనని ఆంటీస్ అందరు బాగా ఆడావ్ అంటూ నోరు జారింది. నిఖిల్ గాని, నబిల్ గాని ఎవరో ఒకరు టైటిల్ తో బయటికి వస్తారని తన అభిప్రాయాన్ని ఇచ్చింది. అనంతరం బిగ్ బాస్ మణికంఠ మాట్లాడుతూ.. ప్రస్తుతం అంతా బాగుందని, తన భార్యను ప్రియా కూతురు చాలా బాగున్నారని, ఇంట్లో కూడా తనకు రెస్పాన్స్ బాగుందని హ్యాపీగా ఫీలయ్యారు. ఈసారి కచ్చితంగా గౌతమ్ టైటిల్ విన్నర్ అవుతాడని, రోజు రోజు గేమ్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు.
గంగవ్వ మాట్లాడుతూ.. తనకు ఎక్కలేని క్రేజ్ వచ్చిందని, రోజు తన ఇంటికి కార్లు, బండ్లు వస్తున్నాయని, వాస్తవానికి గ్రాండ్ ఫైనల్ లో తాను ఉండే దానిని, కానీ, తేజ తనకు పోహా వండి పెట్టాడని, ఆ పోహా వండి పెట్టడం వల్లే తాను తొందరగా అవుతూ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిందంటూ సెటైరికల్ పంచ్ వేసింది గంగవ్వ. దీంతో సోలో నవ్వుల పువ్వులు పూసాయి.

ఆ తర్వాత బిగ్బాస్ మొగలే యశ్మీ గౌడ మాట్లాడుతూ.. తన క్రేజ్ మొత్తం మారిపోయిందని, బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత రోజు.. ఆఫ్టర్ సిక్స్ పార్టీ ఎక్కువ అవుతున్నాయని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో టేస్టీ తేజ మాట్లాడుతూ అక్కడ కూడా గ్రూప్ గేమ్ లాడుతున్నారని, తమను పిలవడం లేదంటూ తేజ బాధపడ్డారు. ఆ తర్వాత టేస్టీ తేజ తన అభిప్రాయం చెబుతూ.. ఈసారి గౌతమ్ విన్నరవుతారని, సీజన్ 7 తో తనకల నెరవేరిందని, సీజన్ 8 తో తన అమ్మ కలగా కూడా నెరవేరిందని, కానీ, ఇంకో కల ఉందని తనకు మీ షర్టు కావాలని నాగార్జునను అడుగుతాడు.
దీంతో నాగార్జున దిమ్మ తిరిగిపోయేలా ఆన్సర్ ఇస్తూ.. ముందు అమ్మాయిని సెట్ చేసుకో తానే స్పెషల్‌గా డ్రెస్ డిజైన్ చేసుకుని వచ్చానని మాట ఇస్తాడు నాగార్జున. అయితే.. ఈ ఎపిసోడ్లో అందరూ కనిపించిన బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెంట్, కళామతల్లి విష్ణు ప్రియ మాత్రం కనిపించలేదు. తను రాకపోవడానికి కారణాలు ఏంటి అంటూ బిగ్ బాస్ లవర్స్ కంగారుపడుతున్నారు. విష్ణు ప్రియ రాకపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హరితేజ, నైనికలు కూడా ఈ గ్రాండ్ ఫినాలే కు రాలేదు.


Click it and Unblock the Notifications











