ఎట్టకేలకు ఓ ఇంటివాడైన బిగ్ బాస్ విన్నర్.. కొత్త కలలు అంటూ ఎమోషనల్ పోస్టు..
బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్ మలియక్కళ్ (Nikhil Maliyakkal) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమాన్ని చొరగొన్నాడు. నిఖిల్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, ఓటీటీ సినిమాలతో తన కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలాంటి నిఖిల్ తాజాగా తన జీవితంలో కీలక మైలురాయిని చేరుకున్నాడు. తమ అభిమానులకు ఓ శుభవార్త తెలియజేశాడు. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఎంటీ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్.. ఇప్పుడు సొంతింటి కలను నిజం చేసుకున్నాడు. తన అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. తాజాగా తన కొత్త ఇంటి గృహప్రవేశ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'సొంత ఇంటి కల నెరవేరింది..కొత్త బాధ్యతలు.. ఇక కొత్త కలలు' అని పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రుల పేర్లపై ఇల్లు నిర్మించాలన్న తన కలను నెరవేర్చుకున్నందుకు నిఖిల్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన నిఖిల్, కన్నడ సీరియల్ 'మనయే మంత్రాలయ'తో కెరీర్ ప్రారంభించాడు. తెలుగులో 'గోరింటాకు' సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత 'కలిసివుంటే కలదు సుఖం', 'స్రవంతి', 'ఊర్వశివో రాక్షసివో' వంటి డైలీ సిరీయల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మరింత దగ్గరయ్యారు. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొన్న నిఖిల్, తన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుని విజేతగా నిలిచాడు. ఒక వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, 'ప్రైజ్ మనీతో అప్పులు తీర్చుకుని తల్లిదండ్రుల పేర్లపై ఇల్లు కట్టించాలి' అన్నాడు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు.
ఇటీవల నిఖిల్ .. విక్రం ఆన్ డ్యూటీ క్రైమ్ థ్రిల్లర్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్‌లో నిఖిల్ 'విక్రం వాసు'అనే అసాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సిరీస్ లో నిఖిల్‌తో పాటు ఆశు రెడ్డి, గాయత్రి చాగంటి, రఘు, ఆర్య, సమీర్ తదితరులు నటిస్తున్నారు. ప్రవీణ కడియాల, అనిల్ కడియాలలు నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు హర్ష శ్రీ, శివరామ్ కె, వేదవ్యాస్ ఆకుల రచనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సిరీస్ మార్చి 6 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణ పోలీస్ కథలకంటే భిన్నంగా, మానసిక ఉద్వేగాలు, నైతిక సందిగ్ధతలు, హై-స్టేక్స్ యాక్షన్‌తో 'విక్రం ఆన్ డ్యూటీ' క్రైమ్ డ్రామా అభిమానులకు కొత్త అనుభూతి ఇవ్వబోతుందని మేకర్స్ ప్రకటించారు.
ఇక నిఖిల్ వ్యక్తిగత జీవితం చూస్తే.. గోరింటాకు సీరియల్ లో తన సహనటి కావ్యశ్రీతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిపించినా.. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారని టాక్.. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి సారించిన నిఖిల్, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో నిఖిల్ పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. మాట నిలబెట్టుకున్న విజేత, తల్లిదండ్రుల కల నెరవేర్చిన నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. ఫైనల్ గా నిఖిల్ అటు పర్సనల్ లైఫ్ , ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.


Click it and Unblock the Notifications











