Bigg Boss Telugu 8 Winner Prize Money: విన్నర్ ప్రైజ్ మనీ లీక్ చేసిన నాగ్.. బిగ్ బాస్ హిస్టరీలో హైయ్యేస్ట్..
Bigg Boss Telugu 8 Winner Prize Money: లిమిట్ లెస్ ట్విస్టులతో.. లిమిట్ లెస్ సర్ప్రైజ్ లతో.. లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ లతో.. సాగిన బిగ్ బాస్ సీజన్ 8 రియాల్టీ షో.. గ్రాండ్ ఫినాలేకు చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త కంటెంట్తో సాగిన ఈ షో బుల్లితెర పై టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లింది. నేటితో ఈ సీజన్ కు ఎండ్ కార్డ్ పడుతోంది. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ఇంతకీ ఈ షో కి వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరు? అలాగే బిగ్ బాస్ విన్నర్ ప్రైస్ మనీ ఎంత అనేది సర్వత్ర ఉత్కంఠ గా మారింది. తాజాగా బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ప్రైజ్ మనీని రిలీవ్ చేశాడు. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 8 ప్రైజ్ మనీ ఎన్ని లక్షల అంటే?
బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ అనే ట్యాగ్ తో ప్రారంభమైంది. ఈ సీజన్ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ షోలో తొలుత 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. ఆ తర్వాత ఎనిమిది మంది కంటెస్టెంట్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ప్రతి కంటెంట్ తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. బిగ్ బాస్ లవర్స్ ను మెప్పించారు.ఇలా దాదాపు 105 రోజులు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 ప్రయాణం నేటీతో ముగియనున్నది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న అట్టహాసంగా జరగబోతుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. చివరికి ఐదురుగు కంటెస్టెంట్లు మాత్రమే గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. అయితే టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబిల్, అవినాష్ లు నిలిచారు. టైటిల్ ను కైవసం చేసుకోవడానికి హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఫినాలేలో ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు.
ఆ సమయంలో బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రైజ్ మనీ రివీల్ చేశారు. ఈ సీజన్ టైటిల్ విన్నర్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటారని ప్రకటించారు. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మొత్తం అని నాగార్జున తెలిపారు. గత సీజన్లో టైటిల్ విన్నర్ కు రూ. 50 లక్షలు అందించగా.. ఈ సారి ప్రైజ్ మనీ కాస్త పెరిగిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సీజన్ టైటిల్ విన్నర్ కుమారుతి కార్ కూడా దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఆ సంస్ధ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే..
బిగ్ బాస్ 8 ఫైనల్స్ ప్రోమోలో కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర విచ్చేశారు. అలాగే.. డాకు మహారాజ్ టీమ్ కూడా బిగ్ బాస్ లో సందడి చేసింది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హౌజ్‌లోకి వెళ్లి కంటెస్టెంట్లతో సరదగా గడిపింది. ఇదెలా ఉంటే..ఈ సీజన్ కు చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ తేజ వస్తున్నారని ప్రచారం. అలాగే.. బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ గా గౌతమ్ నిలుస్తారని, రన్నర్ గా నిఖిల్ నిలుస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే..ఈ విషయం క్లారిటీ రావాలంటే మాత్రం బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే వరకు వేచి ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications











