ఎట్టకేలకు కన్నడ కంచుకోట బద్దలు..బిగ్ బాస్ బ్యూటీ ఎలిమినేట్..యష్మీ రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?

Yashmi Gowda Remuneration: బిగ్ బాస్.. బిగ్ బాస్.. బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న రియాల్టీ షో. గతంలో ఎప్పుడు చూడని కంటెంట్ ఇవ్వడంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సీజన్లో ఎవరు ఊహించని ట్విస్టులు, మలుపులు చోటు చేసుకోవడంతో ఈ షో పై మరింత క్యూరియసిటీ పెరిగింది. మరో మూడు వారాల్లో ఈ సీజన్ ముగియనున్నడంతో టైటిట్ ఎవరు గెలుచుకుంటారనే చర్చ జరుగుతోంది. అయితే.. టాప్ 5 కంటెస్టెంట్ల్ ఉంటుందని భావించిన యష్మిగౌడ సడెన్ గా ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయింది. ఈ తరుణంలో యష్మి ఎలిమినేషన్ కారణాలేంటీ? ఇంతకీ బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు ఈ అమ్మడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నదనేది ? చర్చనీయంగా మారింది.

బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ బీబీ బాస్ లవర్స్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ అందిస్తూ సక్సెస్ పుల్ గా కొనసాగుతోంది. అయితే.. 12వ వారం ఎవరు ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది. టాప్ 5 లో ఉంటుందని భావించిన స్టాంగ్ కంటెస్టెంట్ యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యారు. 12 వారం నామినేషన్ లో ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నిలిచారు. అందులో నిఖిల్, ప్రేరణ, పృథ్వి, నబీల్, యశ్మీలు నామినేషన్ లో ఉన్నారు. ప్రేరణ మొదటి స్థానంలో నిలవగా.. నబీల్ రెండవ స్థానంలో నిఖిల్ మూడో స్థానంలో నిలిచారు ఇక పృథ్వి, యష్మిలు డెంజర్ జోన్ లో నిలిచారు. చివరకు యష్మి పేరును బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Bigg Boss Telugu 8 Yashmi Gowda Eliminated from BB House Yashmi Gowda Remuneration details Full Story Here

అనంతరం వేదికపైకి వచ్చిన యష్మి తన జర్నీని చూసి ఎమోషనల్ అయింది. తర్వాత యష్మి మాట్లాడుతూ.. ఈ వారం ఏం జరిగిందో ? ఎలా జరిగాయో అందరికీ తెలుసని, ఈ ట్విస్ట్‌ ఎవరూ ఊహించలేదని చెప్పింది. తన తండ్రి సూచన మేరకు గత కొన్ని రోజులుగా అవకాశం దొరికిన ప్రతి చోటా 100 పర్సెంటెజ్ కష్టపడినట్లు చెప్పింది. హౌస్ నుండి వెళ్లేముందు ఓకే ఆడాలంటూ నాగార్జున స్నేహితులెవరు? శత్రువులెవరు? టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో తన ఫ్రెండ్స్ గా.. ప్రేరణ, నిఖిల్, పృద్వి, విష్ణు ప్రియ ఫోటోలను పిక్ చేస్తుంది. ఆ తర్వాత ఎనిమీస్ గా అవినాష్, గౌతమ్, రోహిణి ఫోటోలను పెడుతుంది.

బిగ్ బాస్ బ్యూటీ యష్మి.. టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ అనుకోకుండా తన గేమ్ ను తానే డ్యామేజ్ చేసుకుంది. నిఖిల్ తో చనువుగా మూవ్ అవుతూ తన క్యారెక్టర్ ను నెగిటివ్ గా పోట్రెట్ చేసుకుంది. దీంతో తనపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది.ఈ విషయాన్ని ఫ్యామిలీ వీక్ లో తన తండ్రి కూడా ఆమెకు చెప్పాడు. ఇతరులతో కలిసి గ్రూప్ గేమ్ ఆడకు అని హెచ్చరించాడు కూడా. కానీ జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఫైనల్ గా ఎలిమినేట్ అయింది యష్మి గౌడ.

ఇదెలా ఉంటే.. యష్మీ గౌడ రెమ్యూనరేషన్ టాప్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడు బిగ్ బాస్ లో ఎన్ని లక్షలు సంపాదించిందనే చర్చ ప్రారంభమైంది. యష్మీ బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనేందుకు భారీగానే రెమ్యూనరేషన్ అందుకుందని తెలుస్తుంది. ఒక్కో వారానికి 2 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ 8 తెలుగులోకి తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన యష్మీ గౌడ 12 వారాలు బిగ్ బాస్ హౌజ్‌లో ఉంది. ఈ లెక్కన చూస్తే.. 12 వారాలకు యష్మీ గౌడ రూ.24 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. మరోవైపు.. యష్మీ గౌడ వారానికి రూ. 2,50,000 తీసుకున్నట్టు టాక్ వస్తుంది. అలా అయితే.. దాదాపు 30 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X