Bigg Boss Telugu 8: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ 5 కంటెస్టెంట్ అవుట్.. ఆ లవ్ స్టోరీకి బ్రేక్ ?
Bigg Boss Telugu 8: బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న రియాల్టీ షో. ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ట్విస్టులు, మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కంటెంట్ ఇవ్వడంతో బిగ్ బాస్ లవర్స్ నుండి కూడా ఎంతగానో రెస్పాన్స్ వస్తుంది. మరో మూడు వారాల్లో ఈ సీజన్ ముగియనుండడంతో ఈ షోపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. అయితే బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది.
బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. గత 12 వారాలుగా ఈ సీజన్ గేమ్స్, టాస్కులు,లవ్ ట్రాక్స్, రోమాన్స్, కొట్లాటలు, గొడవలు, కాంట్రవర్సీలతో బీబీ ప్రేక్షకులను అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ అందించింది. 12వ వారం చివరి దశకు చేరుకోవడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే.. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా భిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఊహించని విధంగా టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. ఇప్పటివరకు నామినేషన్ నుండి తప్పించుకున్న కన్నడ బ్యాచ్ నుండి ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హౌస్ లో గౌతమ్ కృష్ణ నబీల్, నిఖిల్, పృద్వి, టేస్టీ తేజ, ప్రేరణ కుంభం, జబర్దస్త్ ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, యష్మీ గౌడ ఇలా మొత్తం పదిమంది కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. అయితే 12 వారం నామినేషన్ లో ఏకంగా ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నిలిచారు.
వారిలో నిఖిల్,ప్రేరణ, పృథ్వి, నబీల్, యశ్మీలు నామినేషన్ లో నిలిచారు. వీరిని గెలిపించడం కోసం మంగళవారం నుండి శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఓటింగ్ జరిగింది.
ఈ ఓటింగ్ ను చూస్తే.. ప్రేరణ మొదటి స్థానంలో నిలవగా.. నబీల్ రెండవ స్థానంలో, నిఖిల్ మూడో స్థానంలో నిలిచారు. ఇక పృథ్వి, యశ్మీ లు చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఓటింగ్ ప్రక్రియ ను చూస్తే ఈవారం బిగ్ బాస్ బ్యూటీ యశ్మీ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందని ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరుగుతే..శనివారం యశ్మీని, ఆదివారం పృధ్విరాజ్ శెట్టి హౌస్ నుండి వెళ్లిపోయి అవకాశముంది. మొత్తానికి యశ్మీ గౌడ ఎలిమినేట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ బ్యూటీ యశ్మీ.. టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచారు. మొదటి నుంచి తన గేమ్ తో ఇతరులకు గట్టి పోటీనిచ్చింది. కానీ అనుకోకుండా తన గేమ్ ను తానే డ్యామేజ్ చేసుకుంది. నిఖిల్ తో చనువుగా మూవ్ అవుతూ తన క్యారెక్టర్ ను తానే బ్లెమ్ చేసుకుంది. దీంతో తనపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఫ్యామిలీ వీక్ లో తన తండ్రి కూడా ఆమెకు చెప్పాడు. గేమ్ పై మాత్రమే ఫోకస్ పెట్టు.. అనవసరంగా ఇతరులతో కలిసి గ్రూప్ గేమ్ ఆడకు అని హెచ్చరించాడు కూడా. కానీ, జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇలా ఇండివిజువల్ గా గేమ్ ఆడకుండా గ్రూప్ గేమ్ ఆడి తన గేమ్ ను తానే నష్టపరుచుకుంది యశ్మీ.
ఇప్పటికే యష్మీ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ అమ్మడు ఎలిమినేట్ అయితే మిగిలేది 9 మంది కంటెస్టెంట్ లే. వీరిలో అయిదుగురు మాత్రమే ఫైనల్ కి వెళ్తారు. ఇక మూడవ వారాల సమయం మాత్రమే ఉంది. ఒక వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది . సీజన్ 7 లో ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనల్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే సీజన్ 8 కాబట్టి 8 మందిని ఫైనల్ కు తీసుకువెళ్తారా అని టాక్ కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. ముందే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సీజన్ కాబట్టి ఏ నిమిషం ఏం జరుగుతుందో వేచి చూడాలి. బిగ్ బాస్ టీం ఎలా ప్లాన్ చేశారో మరి.


Click it and Unblock the Notifications











