మా వీడియో బయటపెట్టకండి.. బయట ఇజ్జత్ పోతది.. టెన్షన్‌లో అఖిల్, సోహెల్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 12వ ఇళ్లంతా భూతాల బంగ్లాగా మారింది. హారర్ సీన్లతో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ దడ పుట్టించే ప్రయత్నం చేశాడు. 81వ రోజున ఇంటి సభ్యులకు హారర్ సినిమా చూపిస్తూ భయబ్రాంతులకు గురి చేశాడు. ఇంటిలో కంటెస్టెంట్లను ఎలా భయపెట్టారంటే..

హౌస్‌లో దెయ్యం.. హౌస్‌మేట్స్‌లో ఎవరికి భయం

హౌస్‌లో దెయ్యం.. హౌస్‌మేట్స్‌లో ఎవరికి భయం

బిగ్‌బాస్ ఇంటిలో 81వ రోజున హౌస్‌లో దెయ్యం.. హౌస్‌మేట్స్‌లో ఎవరికి భయం అనే గేమ్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ కోసం పెట్టిన ఈ టాస్క్‌లో రకరకాల గేమ్స్ ఇంటి సభ్యులతో ఆడించారు. 80వ రోజున ఆరంభించిన ఈ షో 81వ రోజున కూడా సాగింది.

భయంతో అరియానా బిక్కు బిక్కుమంటూ

భయంతో అరియానా బిక్కు బిక్కుమంటూ

నవంబర్ 26వ ప్రసారమయ్యే షోకు సంబంధించిన ప్రోమో ప్రకారం.. ఇంటి సభ్యులకు 12వ అంతస్థు అనే సినిమాను చూపించారు. ఈ సినిమాలో ఓ దెయ్యం క్యారెక్టర్ అరియానాను బయపెట్టేందుకు ప్రయత్నించింది. అరియానా ప్రతీ విషయంలో భయపెడుతూ అవినాష్‌ను హత్తుకుపోయింది.

ఇంటి సభ్యులపై సోహెల్ సెటైర్లు

ఇంటి సభ్యులపై సోహెల్ సెటైర్లు

ఇక అరియానాను భయపెడుతూంటే సోహెల్ మాత్రం మజా చేశాడు. అరియానా భయపడటం చూసి సోహెల్ డ్యాన్సులు చేశాడు. ఏమైంది డర్రా అంటూ ఇంటి సభ్యులపై సోహెల్ సెటైర్లు వేశాడు. ఇలా ఇంటి సభ్యులను ఆటపట్టిస్తున్న సోహెల్, అఖిల్‌కు దెయ్యం చుక్కలు చూపించింది.

దెయ్యాలతో ఆటాడుకొన్నాం అంటూ అఖిల్

దెయ్యాలతో ఆటాడుకొన్నాం అంటూ అఖిల్

ఇలా దెయ్యం ఎపిసోడ్ ఓ వైపు సాగుతుంటే. మోనాల్‌తో అఖిల్ మాట్లాడుతూ.. అప్పట్లో బయట నిజం దెయ్యాలతో ఆడుకొన్నాం తెలుసా అంటూ సోహెల్‌తో చీకటి గదిలోకి వెళ్లాడు. నీవు ఎంత భయపెట్టినా నేను భయపడను. కావాలంటే రెండు తొడలు కొట్టి సవాల్ విసురుతాను అంటూ సోహెల్ సవాల్ విసిరాడు. అయితే బిగ్‌బాస్ ఇచ్చిన దెయ్యం ఎఫెక్ట్‌లకు ఇద్దరు గజగజ వణికిపోయారు.

 అఖిల్, సోహెల్ గజగజ వణుకుతూ..

అఖిల్, సోహెల్ గజగజ వణుకుతూ..

డెవిల్ డెన్‌లో సోహెల్, అఖిల్ వణికిపోయి కేకలు పెడుతుంటే.. బయట ఇంటి సభ్యులు హడావిడి చేశారు. కింద మీద పడి అఖిల్, సోహెల్ గజగజ వణికిపోయారు. ఆ గది నుంచి ఎప్పుడు బయటపడుదామా అనే విధంగా తటాలు పడ్డారు. అయితే మోనాల్ మాత్రం కథ వేరే ఉంటది.. కథ వేరే ఉంటుంది అంటూ సోహెల్‌ను ఎద్దేవా చేస్తూ డ్యాన్సులు చేసింది.

Recommended Video

Divi Vadthya Pic Goes Viral In Social Media
వీడియో బయటపెట్టకండి అంటూ

వీడియో బయటపెట్టకండి అంటూ

అలా సోహెల్, అఖిల్ ఇంటిలో నానా తంటాలు పడి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వారిద్దరు పొరపాటున కూడా ఈ వీడియోల బయటకు చూపించకండి. ఎందుకంటే బయట మా ఇజ్జత్ పోతుంది. చూడటానికి ఇలా ఉంటాం కానీ.. అంటూ కెమెరాలో మాట్లాడుతూ బిగ్‌బాస్‌కు చెప్పడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X