గలీజ్‌గా.. మాటలు జాగ్రత్తగా: రాహుల్‌కు శ్రీముఖి వార్నింగ్.. గయ్యాళి అంటూ
Recommended Video
తెలుగు బిగ్‌బాస్ 85వ రోజు ఇంటి సభ్యుల మధ్య టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ చిచ్చుపెట్టింది. వరుణ్ సందేశ్ దంపతులు, శివజ్యోతికి జరిగిన మాటల యుద్ధం తర్వాత రాహుల్, శ్రీముఖి ఒకరిని మరొకరు రఫ్ ఆడించేసుకొన్నారు. మాటకు మాటతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటిలో టాప్ స్థానాల కోసం ఎలాంటి గొడవలు జరిగాయింటే..

2వ స్థానం గురించి లొల్లి
టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్‌లో శ్రీముఖి, రాహుల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. రాహుల్‌కు లభించిన 2వ స్థానంపై శ్రీముఖి కన్నేసింది. రాహుల్ నీకంటే బెటర్ అని శ్రీముఖి అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో నీవు గొప్పగా ఆడిన టాస్క్ ఏమిటో చెప్పు అని శ్రీముఖి అంటే.. నీవు గొప్పగా ఏం చేశావో ముందు చెప్పుకో అంటూ రాహుల్ గట్టిగా జవాబిచ్చాడు.

నేను బాగా ఆడలేదా
అసలు టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ గురించి అర్ధం చేసుకొన్నావా? నీకు కాన్సెప్ట్ అర్థం కాలేదనుకొంటా అని శ్రీముఖి అంటూ.. అవన్నీ అవసరం లేదు అంటూ రాహుల్ అన్నాడు. పాయింట్‌పై చర్చ జరుగకుండా ఎలా అలా అంటావు. నేను ఏ టాస్క్ బాగా ఆడలేదో చెప్పో అంటూ ప్రశ్నించింది. పలుసార్లు నన్ను బాగా ఆడావంటూ చెప్పలేదా అంటూ ప్రశ్నలు వేసింది.

గయ్యాళిగా బిహేవ్ చేయకు
టాస్కులు ఎవరు బాగా ఆడారనే విషయంపై జరిగిన చర్చలో శ్రీముఖి, రాహుల్ మధ్య భారీగా వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఈ సందర్భంగా దేడ్ హుషారీ చేయకు అంటూ శ్రీముఖి అంటే.. రాహుల్ ఫైర్ అయ్యాడు. గయ్యాలిగా బిహేవ్ చేయకు అంటే మాటలు జాగ్రత్తగా రానివ్వు అంటూ వార్నింగ్ ఇచ్చింది. మీ ఇంట్లో వాళ్లను ఎవరైనా ఏమైనా అంటూ ఊరుకొంటావా? నేను కూడా అంతే అని జవాబిచ్చింది.

గలీజ్‌గా మాట్లాడినా..
నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడటం అలవాటు... టాస్కులు ఏమి ఆడావన్నది సమస్య కాదు. ఇంట్లో ఎంత మంచిగా ఉన్నావన్నదే చూస్తారు. నీవు ఎంత గలీజ్‌గా మాట్లాడినా.. నా ఫ్రెండ్‌గా నీకు రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పటికి రాహుల్ సిప్లిగంజ్ అని మాత్రమే పిలుస్తాను. నాకు నోరు ఉంది కదా నేను ఎప్పుడూ మాట్లాడలేదు అని శ్రీముఖి ఫైర్ అయింది.

వితికకు కౌంటర్
వితికతో ఎవరు బెటర్ అనే విషయంపై ఆర్గ్యూమెంట్ జరిగింది. టాస్కుల్లో నీవు బాగా ఫెర్ఫార్మ్ చేశావు అని ఒప్పుకొంటాను. కానీ నీ కంటే నేను బెటర్ అని చెబుతాను అని శ్రీముఖికి వితిక కౌంటర్ ఇచ్చింది. దాంతో మూడో స్థానంపై శ్రీముఖి, వితికకు జరిగిన చర్చలో ఆధిపత్య పోరాటం కనిపించింది. ఇలా టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ ఇంటి సభ్యుల్లో చిచ్చుపెట్టింది.


Click it and Unblock the Notifications











