Bigg Boss Telugu 8: బిగ్ బాస్ నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్.. అసలైందే రెడీ చేసేశారుగా!
బుల్లితెరపైకి అసలు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షోనే బిగ్ బాస్. రియాలిటీ కాన్సెప్టుతో నడిచే ఇది.. ఎన్నో ట్విస్టులతో సాగుతూ సత్తా చాటుతోంది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఇది ఏడింటిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఎనిమిదో సీజన్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ గురించి ఓ అదిరిపోయే సర్‌ప్రైజింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరుగుతుందో మీరే చూసేయండి మరి!
తెలుగు షో సెన్సేషన్
భారతదేశంలో ఉన్న చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతోంది. అయితే, అన్నింటి కంటే తెలుగులోనే ఇది ఎక్కువగా రెస్పాన్స్‌ను అందుకుని సత్తా చాటుతోంది. ఇలా ఇప్పటికే చాలా సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అదే సమయంలో ఎన్నో వివాదాలను తెచ్చింది. అంతేకాదు, చాలా రికార్డులను సైతం నమోదు చేసింది. ఫలితంగా ఈ తెలుగు షో సెన్సేషన్ అయిపోయింది.

ఏడో సీజన్ రికార్డు కొట్టి
గతంలో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్ సూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ టీమ్ గత ఏడాది ఏడో దానిని మొదలు పెట్టింది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఎన్నో ట్విస్టులతో సాగిన ఏడో సీజన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇక, ఈ షోకు టాప్ రేటింగ్ లభించింది.
ఓటీటీ సీజన్‌పై డౌట్
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ రికార్డు స్థాయి రేటింగ్‌తో కంప్లీట్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకెండ్ సీజన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని టాక్ వచ్చింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేశారని చెప్పారు. అయితే, దీనిపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
8వ సీజన్ ముందుగా
బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్‌ను నిర్వహకులు ఆపేశారని, దానికి బదులుగా ఎనిమిదో సీజన్‌ను కాస్త ముందుగానే మొదలు పెట్టేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మార్చి నుంచే పనులు మొదలుపెట్టారని తెలుస్తోంది. కానీ, దీనిపై కూడా ఎలాంటి న్యూస్ రాలేదు. మొత్తానికి దీన్ని ఎలాగైనా వీలైనంత ముందుగానే ప్రారంభించబోతున్నారని సమాచారం.
కొత్త సీజన్ అప్పుడేనా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై హైప్ భారీగానే పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని నిర్వహకులు భావిస్తున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌ను ఆగస్టు మొదటి వారం నుంచే స్టార్ట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది.
దిమ్మతిరిగే సర్‌ప్రైజ్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ముందుగానే రాబోతుందన్న విషయం తెలియడంతో పాటు తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సీజన్‌కు సంబంధించిన అఫీషియల్ లోగోను జూలై రెండో వారంలో విడుదల చేయబోతున్నారట. ఈ వీడియోను ఎవరూ ఊహించని రీతిలో డిజైన్ చేస్తున్నట్లు కూడా సమాచారం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











