Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో ఛాన్స్? ఇండియన్ ఆర్మీలో జాబ్‌పై తేల్చేసిన సోల్జర్ కళ్యాణ్
మరికొద్దిగంటల్లో బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ కానుంది. వరుసగా 7వ సారి హోస్ట్‌గా అలరించేందుకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సిద్ధమయ్యారు. తన స్టైలీష్ ప్రెజెన్స్‌తో ఆయన బిగ్‌బాస్‌కి బ్రాండ్‌గా మారారు. టాస్క్‌లు, మైండ్ గేమ్స్, భావోద్వేగాలతో ప్రేక్షకులకు కావాల్సినంత మజా అందించేందుకు బిగ్‌బాస్ సిద్ధమైంది. అయితే ఇప్పుడు అందరి చూపు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించే. ఈ సెలబ్రెటీల కంటే కామన్‌మెన్ కేటగిరీలో కంటెస్టెంట్స్‌గా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నదే సస్పెన్స్‌గా మారింది.
కామన్‌మెన్‌ల నుంచి భారీగా దరఖాస్తులు
బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు కామన్‌మెన్‌కు అవకాశం ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వేలల్లో వచ్చిన అప్లికేషన్స్‌ను అనేక వడపోతల తర్వాత 40 మందిని బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు సెలెక్ట్ చేశారు. వీరిలో నుంచి టాప్ 15ను సెలెక్ట్ చేసే బాధ్యతను హీరోలు నవదీప్, అభిజిత్, హీరోయిన్ బిందు మాధవి చేతుల్లో పెట్టారు బిగ్‌బాస్. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో సాగిన ఈ కార్యక్రమంలో 15 మందిని ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలు, వీరిలో నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేయగా, ప్రస్తుతం 13 మంది మిగిలారు.

హోరాహోరీగా అగ్నిపరీక్ష
ఈ 13 మందిలో నుంచి ఎవరు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టబోతున్నారనే సస్పెన్స్‌గా మారింది. ప్రజల నుంచి వచ్చిన ఓటింగ్ ఆధారంగా బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ రోజున అగ్నిపరీక్ష విజేతలను ప్రకటిస్తారని యాంకర్ శ్రీముఖి.. అగ్నిపరీక్ష చివరి ఎపిసోడ్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అగ్నిపరీక్ష విజేతలు వీరేనంటూ కొందరి పేర్లు తెరమీదకి వస్తున్నాయి. అలాగే బిగ్‌బాస్ లాంచింగ్ ప్రోమోలోనూ కొందరు కనిపించారు. వీరిలో సోల్జర్ కళ్యాణ్ కూడా ఒకరు.
జవాన్‌గా ఉంటూ బిగ్‌బాస్‌లోకి
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో అద్భుతంగా ఆడటంతో పాటు అందరినీ ఆకట్టుకున్నారు సోల్జర్ కళ్యాణ్. ఇతని పూర్తి పేరు పవన్ కళ్యాణ్ పడాల. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన ఇతను ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా భారతదేశానికి సేవ చేస్తున్నాడు. మూడేళ్లుగా సోల్జర్‌గా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ఫిజికల్ గేమ్స్‌తో పాటు మైండ్ గేమ్‌లోనూ ఇరగదీసి టాప్ 15లో ఛాన్స్ దక్కించుకున్నాడు. చివరి వరకు అదే స్పిరిట్‌తో ఆడిన సోల్జర్ కళ్యాణ్.. టాప్ 13లో నిలిచాడు. అగ్నిపరీక్షలో పాల్గొన్న వారందరూ సెలబ్రెటీలుగా మారిపోవడంతో వారి ఇంటర్వ్యూల కోసం మీడియా సంస్థలు ఎగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఉద్యోగం, బిగ్‌బాస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సోల్జర్ కళ్యాణ్.. ఈ వివరాల్లోకి వెళితే.
ఆర్మీ ఉద్యోగానని వదిలేస్తారా?
బిగ్‌బాస్‌లో ఛాన్స్ వస్తే ఆర్మీ ఉద్యోగాన్ని వదిలిపెడతారా? అని యాంకర్ అడగ్గా.. బిగ్‌బాస్‌లో ఛాన్స్ వస్తే జాబ్‌ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ జరిగేది 3 నెలలే కాబట్టి.. నో ప్రాబ్లమ్. మాకు శాలరీ కట్ చేసుకుని లీవ్ ఇస్తారని దాంతో బిగ్‌బాస్‌కి అటెండ్ అవుతా. బిగ్‌బాస్ షో ముగిసిన తర్వాత నేను వెళ్లిపోవచ్చునని కళ్యాణ్ తెలిపారు. ఇండస్ట్రీలో ఆఫర్స్ కనుక వస్తే అప్పుడేం చేస్తారని యాంకర్ అడగ్గా.. ఇండస్ట్రీలో ఆఫర్స్ వస్తే 10 రోజులు, 15 రోజులు.. ఒకేసారి 2 నెలల షూటింగ్ అయినా నేను మేనేజ్ చేసుకోగలను. కానీ 3 నెలలకు మించి నాకు సెలవు దొరకదు .. ప్రకాశ్‌రాజ్ గారిలా, జగపతి బాబు గారిలా సంవత్సరమంతా ఒకటే షూట్ ఉంది అంటే అప్పుడు నేనేం చేయలేను. అలాంటి పరిస్ధితి వస్తే నేను ఖచ్చితంగా రిజైన్ చేసేస్తాని కళ్యాణ్ తేల్చేశారు.


Click it and Unblock the Notifications











