10 వారాలు కంటెస్టెంట్‌గా.. కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్‌బాస్‌ ఆఫర్‌కు వేణుస్వామి నో

ఇండియాలో టాప్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకోవాలని ఎంతో మంది కల. సోషల్ మీడియా యుగంలో ఎవరికి వారు సొంతంగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు బిగ్‌బాస్‌లో అవకాశం దక్కించుకున్న వారంతా సోషల్ మీడియాతో ఫేమస్ అయినవారే. అయితే పలువురు సెలబ్రిటీల పేర్లు బిగ్‌బాస్ సీజన్ ముందు వినిపిస్తాయి. కానీ వీరిలో తుదిజాబితాలో చోటు దక్కించుకునేవారు కొందరే. బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చినప్పటికీ పలు కారణాలతో రిజెక్ట్ చేసేవారు ఎందరో. ఇలాంటి వారిలో జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఒకరు.

గత కొన్నాళ్లుగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ ప్రారంభమయ్యే సమయానికి వేణుస్వామి పేరు తెగ వినిపిస్తోంది. బిగ్‌బాస్ తెలుగు 8లో వేణుస్వామి పేరు తెరపైకి రాగా... చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఏకంగా తెలంగాణ మహిళా కమీషన్ వరకు వెళ్లడం, నెటిజన్ల ట్రోలింగ్‌తో వేణుస్వామి.. బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 9లోనూ తనకు అవకాశం వచ్చిందని, అయితే ఆఫర్ తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకొచ్చి బిగ్‌బాస్ డీల్, డిసెంబర్ 31వ తేదీ సెలబ్రేషన్స్ గురించి వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu 9 Astrologer Venu Swamy Reveals Why He Rejected Bigg Boss Offer

అన్నిచోట్లా ఓర్వలేని వాళ్లే
జనవరి 1న నేను మందు తాగను, డిసెంబర్ 31న తాగుతాను. నేను బయటికి పోను, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత నేనొక కాంట్రవర్సీ పర్సన్‌ని. నాకు పబ్ అంటే ఇష్టం.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఓపెన్ అయిన నాలుగు పబ్‌లు నా క్లయింట్స్‌వే. నేను కామాఖ్యకు పోతే.. అక్కడ ఓర్వలేని ఒక పంతులు వచ్చి ఏదో చిన్న గొడవ పెట్టుకుని గుడిలో నుంచి వెళ్లిపోయాడు అని ప్రచారం చేశారు. అసలు గుడిలో నుంచి ఒకరిని వెళ్లగొట్టే రైట్స్ ఎవరికీ లేవు. కనీస ఇంగీత జ్ఞానం లేకుండా థంబ్‌నైల్ పెట్టి వైరల్ చేశారు. ఇలాంటి కాంట్రవర్సీలు ఎందుకని నేను హోటల్‌కు పోను, పబ్‌కు పోను, ఎక్కడికి పోను. నేను మందు తాగుతానని పబ్లిక్‌గా చెబుతున్నప్పటికీ, ఇటీవల ఓ పబ్‌కి పోయి పెగ్ వేశా. ఎవరో కొందరు నన్ను ఫోటోలు, వీడియోలు తీసి పోస్ట్‌ చేశారు. ఇంతలో ఒకావిడ వచ్చి వాటిని చూపించింది. ఇందులో తప్పేముంది? పబ్‌కి వచ్చింది భజన చేయడానికా? అని అడిగా అని వేణుస్వామి చెప్పారు.

వాళ్లని చెప్పుతో కొట్టాలి
వేణుస్వామికి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే జాతకాల ద్వారా కాదట. నేను పబ్‌కి వెళ్లి కూర్చొంటే విడాకులు తీసుకునేవాళ్లు వచ్చి మాట్లాడుకుంటే అది విని చెబుతానట. అలా చెప్పేవాళ్లని చెప్పుతో కొట్టాలి. అంటే నన్ను విమర్శించడానికి వీళ్లు ఎంతకి దిగజారిపోయారంటే వాళ్లని చూసి నవ్వాలో? ఏడవాలో తెలియని పరిస్ధితి. చివరికి ముఖం తిప్పుకుని వెళ్లాల్సి వస్తోంది. ఎక్కడికి పోయినా నాకు ప్రాబ్లమే. ఇంట్లో హ్యాపీగా నచ్చిన ఫుడ్ తెప్పించుకుని, జంధ్యాల గారి కామెడీ సినిమాలు పెట్టుకుని ఎంజాయ్ చేసి రాత్రి 11.30 కల్లా పడుకుంటా. ఇది ఓన్లీ డిసెంబర్ 31 రాత్రి మాత్రమే. మళ్లీ జనవరి 1న 1.30కి పడుకుంటా. జనవరి 1 నూతన సంవత్సర శుభాకాంక్షలు నాకొద్దు... మళ్లీ నేను ఉగాదికి అందరికీ నేనే చెబుతానని వేణుస్వామి తెలిపారు.

వేరే దేశంలోనే ఆనందం
మనం కారు కొనుక్కుంటే, ఐ ఫోన్ కొనుక్కుంటే నిద్రపోని మనుషులు ఉన్నారు. కలియుగంలో, తెలుగు రాష్ట్రాలలో ఉన్నంత చెండాలం, అసూయలు ప్రపంచంలో ఎక్కడా లేదు. దేశ కాల మాన పరిస్ధితులకు తగ్గట్లుగా మనం నడుచుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రైవేట్ లైఫ్ అంటేనే నాకిష్టం.. ఒకవేళ నేనే ఎంజాయ్ చేయాలనుకుంటే వేరే దేశానికి పోయినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తా. అది కూడా తెలుగువాళ్లు, ఇండియన్స్ లేని ప్రాంతాలకే వెళ్తా. నాకు అభిమానులు భయంకరంగా ఉన్నారు. వేణుస్వామి ఈ ఏడాది ఫలితాలు బాగా చెప్పాడంటే ఎవరూ చూడరు.. వేణుస్వామిని పబ్‌లో నుంచి గెంటేశారంటే మిలియన్ల కొద్దీ వ్యూస్. జనాలు ఏం కోరుకుంటున్నారు.. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అని వేణుస్వామి తెలిపారు.

బిగ్‌బాస్‌కు నో చెప్పా
వారం వారం ఎంటర్‌టైన్‌ చేయడానికి జనానికి కొత్తవాళ్లు కావాలి. అలేఖ్య పికిల్స్, దువ్వాడ శ్రీనివాస్.. ఈ వారం వేణుస్వామి. ఒక సైకో ప్రవృత్తి జనాల్లోకి వచ్చింది. ఎవరైనా నాశం కావాలి.. అల్లు అర్జున్ జైలుకు పోతే మనకి ఆనందం. పొద్దున్న లేస్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు.. పుష్ప 300 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. ఆయనకి పేరొస్తుంది.. మీకు అర్ధం కావడం లేదు. జనాలు చేసే పనుల వల్ల బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దొరుకుతున్నారు. ఈ సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవార్డులు ఇవ్వాలి.. ప్రతి సంవత్సరం బిగ్‌బాస్‌కి కంటెస్టెంట్స్‌ని ఇస్తున్నందుకు. పది మందిలో 8 మందిని ఇలాగే పంపుతున్నారు. నువ్వొక వ్యక్తిని టార్గెట్ చేసేందుకు చేసే ప్రయత్నం.. ఆ వ్యక్తిని సూపర్‌స్టార్‌ని చేస్తుంది. నన్ను కూడా బిగ్‌బాస్‌కి అడిగారు.. నెల రోజులు ఉండమన్నారు, 10 వారాలు ఉండమన్నారు, మీకెంత రెమ్యునరేషన్ కావాలి అందరికంటే హయ్యెస్ట్ ఇస్తామన్నారు. నేను బిగ్‌బాస్‌కి సూట్ కానని చెప్పి రిజెక్ట్ చేశానని వేణుస్వామి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X