Bigg Boss Telugu 9: కామన్‌మెన్‌కు గేట్లు తెరిచిన బిగ్‌బాస్ .. హౌస్‌లో కంటెస్టెంట్ కావాలనుందా?
ఇండియాలో టాప్ షోగా వెలుగొందుతున్న బిగ్‌బాస్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. వివాదాలు, గొడవలు, అశ్లీలం అంటూ పలువురు విమర్శించినా బిగ్‌బాస్‌కు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. హిందీ సహా పలు భారతీయ భాషల్లో బిగ్‌బాస్ మంచి రేటింగ్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం అన్ని భాషల్లో బిగ్‌బాస్ సందడి మొదలైంది. తెలుగులోనూ త్వరలో 9వ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రోమోతో హింట్ ఇచ్చేసింది స్టార్ మా. తాజాగా బిగ్‌బాస్‌లో పాల్గొనాలని అనుకునే సామాన్యులకు నిర్వాహకులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..
ముందుగానే బిగ్‌బాస్ తెలుగు 9
బిగ్‌బాస్ తెలుగు ఇప్పటి వరకు 8 సీజన్లను పూర్తి చేసుకోగా.. కొన్ని సీజన్లు హిందీని మించి టీఆర్పీని సొంతం చేసుకుని మార్కెట్ వర్గాలకే షాకిచ్చింది. గత సీజన్‌లో కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ విజేతగా నిలవగా.. గౌతమ్ కృష్ణ రన్నరప్ ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. ఆ సీజన్ ముగిసిందో లేదో వెంటనే బిగ్‌బాస్ తెలుగు 9 ఎప్పుడు మొదలవబోతోందనే చర్చ ఆన్‌లైన్‌లో మొదలైంది. సీజన్‌ను కాస్త ముందుగా స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్న బిగ్‌బాస్ నిర్వాహకులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు.

కంటెస్టెంట్స్ వీరేనా?
ఈసారి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ జాబితా కూడా వైరల్ అవుతోంది. తేజస్విని గౌడ, కల్పికా గణేష్, కావ్యశ్రీ, నవ్యస్వామి, ఛత్రపతి శేఖర్, ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్, సాయికిరణ్, శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, బమ్ చిక్ బబ్లూ, ఇమ్మాన్యుయేల్, దేబ్‌జనీ మోదక్, రీతూ చౌదరి, అలేఖ్య పికెల్స్ రమ్య మోక్ష తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తులు, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు చెందినవారితో జాబితా సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చాయి.
మరోసారి హోస్ట్‌గా నాగార్జునే
బిగ్‌బాస్ తెలుగు 9కు హోస్ట్‌గా నాగార్జున తప్పుకుని ఆయన ప్లేస్‌లో కొత్తగా మరో స్టార్ ఈ బాధ్యతలు స్వీకరిస్తారని గాసిప్స్ వినిపించాయి. ఈ ఊహాగానాలకు చెక్ పెట్టింది స్టార్ మా. బిగ్‌బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కాబోతోందని తెలిపేలా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో కింగ్ నాగార్జున కనిపించి ఈసారి హోస్ట్‌గా తానే వ్యవహరించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు.. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ స్టైలీష్‌గా నాగ్ చెప్పిన డైలాగ్ బాగుంది.
బిగ్‌బాస్‌లో భారీ మార్పులు
బిగ్‌బాస్ సీజన్ 8 అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచకపోవడంతో కొత్త సీజన్‌లో భారీ ప్రక్షాళన చేపట్టారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. జనానికి బాగా తెలిసిన సెలబ్రెటీలనే కంటెస్టెంట్స్‌గా తీసుకురావాలని భావిస్తున్నారు. నామినేషన్స్ విధానం, టాస్క్‌లు, థీమ్ అన్నింటిని మార్చేస్తున్నారని టాక్. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ జాబితాను సిద్ధం చేసి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనివార్య కారణాలతో ఎవరైనా కంటెస్టెంట్స్ తప్పుకుంటే వారి ప్లేస్‌లో రిజర్వ్ బెంచ్ కూడా సిద్ధం చేస్తున్నారు.
కంటెస్టెంట్స్‌గా సామాన్యులు
బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనాలని, తమ ప్రతిభ చూపించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. తమకు హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించాలని పలువురు సామాన్యులు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇటీవల మినిమమ్ డిగ్రీ మన్మథ రాజా అనే వ్యక్తి తనకు బిగ్‌బాస్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్షకు దిగడం కలకలం రేపింది. ఇలాంటి కామన్‌మెన్‌కు బిగ్‌బాస్ గేట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాల్ ఫర్ ఎంట్రీస్ అనే పేరుతో స్టార్ మా ఓ ప్రోమో రిలీజ్ చేసింది.
దరఖాస్తు ఇలా
'ఇప్పటి వరకు మీరు బిగ్‌బాస్ షోను ఎంతో ప్రేమించారు. ఇంత ప్రేమను ఇచ్చిన మీకు రిటర్న్ గిఫ్ట్‌గా ఏం ఇవ్వాలి? మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి సెలబ్రెటీలకే కాదు. మీకూ అవకాశం ఇస్తున్నాం' అంటూ నాగార్జున పంచ్ డైలాగ్ పేల్చారు. బిగ్‌బాస్ 9లో పార్టిసిపేట్ చేయాలంటే www.bb9.jiostar.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి.. బిగ్‌బాస్ 9లో పార్టిసిపేట్ చేయడానికి రీజన్ చెబుతూ వీడియో అప్లోడ్ చేయొచ్చని స్టార్ మా తెలిపింది. సో.. కమాన్ బిగ్‌బాస్ సీజన్ 9 హౌజ్ డోర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్‌తో ప్రోమో ముగిసింది. మరి ఇంకేందుకు ఆలస్యం బిగ్‌బాస్ చెప్పిన వివరాలు నింపేసి కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకోండి.


Click it and Unblock the Notifications











