మీరంతా ఒక్కటే... తనూజని దూరం పెడుతున్నారా? నెటిజన్ ప్రశ్నకు దిమ్మ తిరిగేలా..
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ముగిసినా ఇంకా దీని తాలుకా వివాదాలు, గొడవలు ఇంకా ప్రేక్షకులను వెంటాడుతూనే ఉన్నాయి. హౌస్‌లో ఉన్నప్పుడు కొట్టుకుని శత్రువుల్లా మెలిగినవారు బయటకొచ్చిన తర్వాత భుజం భుజం రాసుకు తిరుగుతున్నారు. బిగ్‌బాస్ విజేత కాకపోయినప్పటికీ రియల్ విన్నర్ అనిపించుకున్నారు బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా సరే చివరి వరకు విజయం కోసం పోరాడింది తనూజ. ఆమె అభిమానులైతే తనూజాయే విజేత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో ఎంజాయ్ చేసిన కంటెస్టెంట్స్ అంతా తిరిగి తమ రోజువారి కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. వీరిలో ఎక్కువమంది నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ కావడంతో వారి పనుల్లో నిమగ్నమయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ అంతా ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉన్నారు. మరికొందరు ప్రత్యేకంగా కలుసుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తనూజా ఇలాంటి ఈవెంట్స్‌లో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. దాంతో తనూజను దూరం పెడుతున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు భరణి దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఓ ఛానెల్‌కు ఇచ్చిన భరణి శంకర్ మాట్లాడుతూ.. మనిషికి మనిషితో ఏ రకంగా ఎప్పుడు అవసరం ఏర్పడుతుందో తెలియదు. హౌస్‌లో నుంచి ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత నా హెల్ప్ అవసరమైంది. వాళ్లు కాల్ చేసినప్పుడు.. నువ్వు హౌస్‌లో ఉన్నప్పుడు టాస్క్‌లో నువ్వు స్ట్రాటజీ ఉపయోగించావు కాబట్టి ఇప్పుడు హెల్ప్ చేయను అని ఎవరైనా మాట్లాడతారా? రాత్రి 11 గంటలకు ఫోన్ చేసినప్పుడు మన వల్ల పని జరుగుతుందంటే వెంటనే రియాక్ట్ అవుతాం కదా. ఇమ్మాన్యుయేల్ రెగ్యులర్‌గా కాల్ చేస్తూనే ఉంటాడు. సుమన్ శెట్టి అయితే నేను కాల్ చేయకపోతే కొడతాడు. 22 మంది కంటెస్టెంట్స్ బంగారాలు.. అందరూ మంచోళ్లు, ఎవరి కెరీర్ ప్లానింగ్స్ వాళ్లకి ఉన్నాయి. కాకపోతే హౌస్‌లో ఉన్నప్పుడు తప్పదని భరణి తెలిపారు.
డైరెక్టర్స్ ఎవరైనా నాకు సబ్జెక్ట్ చెప్పడానికి వస్తే ఓ కంటెస్టెంట్ పేరు చెప్పి ఈ వ్యక్తికి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమని అడుగుతా. దివ్య, సంజన గారు కాల్ చేస్తుంటారు. ఇమ్మాన్యుయేల్ వారం రోజుల నుంచి నాకు కాల్ చేస్తుండటంతో కలుద్దామని చెప్పా. అక్కడికి ఒక డైరెక్టర్ వస్తున్నారు.. నేరేషన్ అయ్యేలోపు ఇమ్ము, సుమన్ శెట్టి వస్తే వాళ్లిద్దరినీ పరిచయం చేద్దామని అనుకున్నా. మన కథలో వీరిద్దరికీ ఏమైనా సెట్ అవుతుందేమోని ప్లాన్ చేశా. దురదృష్టవశాత్తూ వీళ్లు రావడం లేట్ అయి.. ఆ డైరెక్టర్ వెళ్లిపోయారు. వీరిద్దరు వస్తున్నట్లు దివ్యకు చెప్పడంతో ఆ అమ్మాయి కూడా వచ్చింది. మీరు నలుగురు కలిశారు కాబట్టి ఒక ఫోటో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు మా వాళ్లు అని భరణి చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టింగ్ చేస్తే కామెంట్స్ రావడం సహజం. ముందు నుంచి బిగ్‌బాస్‌లో తనూజాది, నాది బాండింగ్. చాలామంది ఇష్టపడ్డారు. ఈ ఫోటో కింద తనూజాతో దిగిన ఒక ఫోటో పెట్టొచ్చు కదా అని కామెంట్స్ వచ్చాయి. ఇంకొందరైతే తనూజాని మీరంతా దూరం పెడుతున్నారు అని ట్రోల్ చేశారు. తనూజ బెంగళూరులో ఉంటుంది. మొన్న బీబీ ఉత్సవంలో కలిసింది.. చాలారోజుల తర్వాత కలవడంతో ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. మా ఇద్దరికీ ఆడియన్స్ 90 శాతం ఓట్లు కూడా వేశారు. ఇలాంటి షోలలో మాట్లాడగలం కానీ.. కాఫీ తాగుదామని బెంగళూరు నుంచి పిలవలేను కదా. తనూజ మీద వాళ్లకున్న అభిమానాన్ని గౌరవిస్తా. మీకంటే ఆ అమ్మాయిని బాగా చూసుకున్నా. వీళ్లతో దిగినప్పుడు తనూజా ఆ ఫోటోలో లేదంటే నేనేం మాట్లాడగలను అని ట్రోలింగ్‌కు భరణి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











