కళ్యాణ్ విన్నర్ కావడానికి బ్యాక్ సపోర్ట్ ఉందా? ప్రైజ్‌మనీ షేరింగ్ వెనుక కారణమదేనా? బజ్‌లో షాకింగ్ సీక్రెట్స్
Bigg Boss Telugu Buzzz: బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss Telugu 9)కు ఎండ్ కార్డు పడింది. హోస్ట్ నాగార్జున ( Nagarjuna) కామనర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల ను టైటిల్ విన్నర్ గా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో 'జై జవాన్ కళ్యాణ్' కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్ ట్రోఫీ గెలవడం ద్వారా కళ్యాణ్ పడాల కొత్త చరిత్ర సృష్టించారు. ఈ విజయం ఆయనకు భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది. విన్నర్‌గా బయటకు వచ్చిన తర్వాత ఆయన బిగ్ బాస్ బజ్ (Bigg Boss Buzzz)లో పాల్గొని, హౌస్‌లో జరిగిన పలు విషయాలను వెల్లడించారు.
బిగ్ బాస్ బజ్ వేదికపైకి బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విజేత కళ్యాణ్ పడాలను 'సామాన్యుడిగా అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు' అంటూ హోస్ట్ శివాజీ (Shivaji) గ్రాండ్‌గా పరిచయం చేశారు. స్టేజ్‌పైకి రాగానే కళ్యాణ్ పడాల శివాజీ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అనంతరం ట్రోఫీని ప్రేక్షకులకు చూపిస్తూ మరోసారి విన్నర్‌గా ప్రకటించడంతో స్టూడియో మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ.. 'నువ్వు నీ జీవితాన్ని నువ్వే చెక్కుకున్న శిల్పివి'అంటూ కళ్యాణ్‌కు హైలెట్ ఎలివేషన్ ఇచ్చారు. ఈ మాటలతో కళ్యాణ్ పడాల భావోద్వేగానికి లోనయ్యారు.

ఇక 'నీ లోపల ఉన్న స్పిరిట్‌ని రగిలించింది ఎవరో తెలుసా? నీ గేమ్ చేంజ్ కావడానికి కారణం ఎవరో తెలుసా? అని ప్రశ్నించగా.. కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. 'దివ్య అంటే ఒప్పుకుంటావా?' అని శివాజీ అన్నారు.'నీలో స్పిరిట్ ను రగిలించింది తాను. ఆమె వల్లే ఈరోజు ట్రోఫీ విన్నర్‌గా నిలిచావు" అని శివాజీ కామెంట్ చేయడంతో.. కళ్యాణ్ పడాల ఎమోషనల్ అయ్యారు. 'థాంక్యూ దివ్య' అంటూ ఓపెన్‌గా చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇంటర్వ్యూలో సరదా ప్రశ్నలూ వచ్చాయి. 'నువ్వెక్కడికి వెళ్లినా నీకు చుట్టాలే కనిపిస్తారా? హౌస్‌లో అత్తమ్మ, గర్ల్ ఫ్రెండ్స్, మాజీలు...'అంటూ శివాజీ అడగ్గా, కళ్యాణ్ "ఊరుకోండి సార్" అంటూ దండం పెట్టి నవ్వులు పూయించారు. అలాగే తనూజ కోసం నామినేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడన్న ప్రశ్నకు, తమ మధ్య ఉన్న బాండింగ్‌ను స్పష్టంగా వివరించారు.
ప్రైజ్ మనీ విషయమై కూడా ఆసక్తికర చర్చ జరిగింది. 'నీ ఫ్రెండ్ 15 లక్షలు తీసుకెళ్లాడు, నీకు ఏమనిపించలేదా?' అని శివాజీ అడగ్గా, "లేదు సార్" అని కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. దానికి శివాజీ 'అగ్నిపరీక్ష నుంచే మీ బాండింగ్ స్ట్రాంగ్‌గా ఉంది, అందుకే ప్రైజ్ మనీ పంచుకున్నారా?' అని చమత్కరించగా, 'వాడు కూడా మిడిల్ క్లాస్ కదా' అంటూ కళ్యాణ్ ఎమోషనల్ సోర్టీ చెప్పారు.
ఇక భవిష్యత్‌పై మాట్లాడుతూ.. 'స్టార్, హీరో గా నటించడం కంటే.. ఒక గ్రేట్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల' అని కళ్యాణ్ చెప్పారు. 'నాలుగు నెలల క్రితం నేను ఎవడిని సార్? నా ఊర్లో కూడా నన్ను ఎవరూ గుర్తించేవాళ్లు కాదు. అలాంటి నాకు ఈ అవకాశం ఇచ్చిన అగ్నిపరీక్ష టీమ్‌కి, బిగ్ బాస్ టీమ్ కి, నాకు అండగా నిలిచిన ప్రేక్షకులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను' అన్నారు.
కళ్యాణ్ ఇచ్చిన ఎమోషనల్ స్టేట్మెంట్స్ అభిమానుల హృదయాలను తాకాయి. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల ప్రయాణం.. సామాన్యుడి నుంచి విజేత వరకు .. ఎందరికో స్ఫూర్తిగా మారింది. గ్రాండ్ ఫినాలే ముగిసినా, ఆయన కథ మాత్రం ఇంకా ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











