లైఫ్‌లో ఎప్పుడూ బాధే మిగిలింది... బిగ్‌బాస్ జర్నీపై దమ్ము శ్రీజ ఎమోషనల్

ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్‌బాస్‌లో ప్రతి సీజన్‌లోనూ చాలామంది కంటెస్టెంట్స్‌ వస్తారు, వెళ్తారు.. కానీ కొందరు మాత్రమే తమ వ్యక్తిత్వం, ఆటతీరుతో ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. ఎన్ని రోజులు హౌస్‌‌లో ఉన్నామని కాదు.. ఎలాంటి ముద్ర వేశామన్నది ముఖ్యం. కొందరు కంటెస్టెంట్స్ అయితే.. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్స్‌కి మించి పాపులర్ అయ్యారు. ఇలాంటి వారిని జనం కూడా బాగా ఆదరిస్తున్నారు. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ మొదలైనా వారిని తిరిగి హౌస్‌లోకి పంపించాలని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9లో ఇలాంటి గుర్తింపునే సంపాదించారు దమ్ము శ్రీజ.

కామెన్‌మెన్ కోటాలో ఎంట్రీ
బిగ్‌బాస్ తెలుగు 9లో ఈసారి కామన్‌మెన్‌కు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు అనౌన్స్ చేయడంతో దమ్ము శ్రీజ దానికి దరఖాస్తు చేసుకున్నారు. రకరకాల వడపోతలు, టాస్క్‌లు దాటుకుని బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు అర్హత సాధించిన 40 మందిలో ఒకరిగా నిలిచారు. అక్కడా తన సత్తా చాటి 13 మంది ఫైనలిస్టుల్లో చోటు దక్కించుకున్నారు. బిగ్‌బాస్ తెలుగు 9 లాంచింగ్ ఎపిసోడ్ రోజున ఆరుగురు సామాన్యుల్లో ఒకరిగా హౌస్‌లో అడుగుపెట్టారు. తొలి రోజు నుంచే టాస్క్‌లు, డిస్కషన్స్ ఇలా ప్రతిదానిలో తన సత్తా చాటారు శ్రీజ.

Bigg Boss Telugu 9 Contestant Dammu Srija Pens emotional note on her elimination from BB House

అవమానకరంగా ఎలిమినేషన్
నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి బయటపడుతూ వచ్చిన శ్రీజ.. ఐదో వారంలో తక్కువ ఓటింగ్‌తో డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున .. ఆ రోజున సుమన్ - శ్రీజలలో ఒకరిని ఎలిమినేట్ చేసే అధికారాన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకి అప్పగించారు. వీరిలో ఎక్కువమంది శ్రీజను ఎలిమినేట్ కావాల్సిందేనని ఓటు వేయడంతో ఆమె ఎలిమినేట్ కాక తప్పలేదు. అయితే అత్యంత దారుణంగా స్టేజ్ మీద తన బిగ్‌బాస్ జర్నీ తాలూకూ ఏవీ కూడా ప్రదర్శించకపోవడం బిగ్‌బాస్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. దీనిపై శ్రీజ సైతం బాధపడ్డారు. దీనిపై కొద్దిరోజులు నెటిజన్ల నుంచి దారుణంగా ట్రోలింగ్ ఎదురైంది.

రెండోసారి అన్యాయం
వీరి ఆవేదనను పట్టించుకున్న బిగ్‌బాస్ టీం.. ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజ దమ్ములను తిరిగి హౌస్‌లోకి పంపించింది. తిరిగి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టానన్న ఆనందం ఆమెకు లేకుండానే శ్రీజకు మరోసారి అన్యాయం జరిగింది. శ్రీజను ఎలిమినేట్ చేసి.. భరణికి పర్మినెంట్‌ హౌస్‌మెట్‌గా అవకాశం కల్పించడంతో మరోసారి ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు శ్రీజ దమ్ము. ఇందులో తనను ఎలిమినేట్ చేయడంపై ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.

నా లైఫ్ అంతేనంటూ పోస్ట్
ఇక తొలి నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు దమ్ము శ్రీజ.. తన బిగ్‌బాస్ జర్నీపై వరుసగా రీల్స్ చేస్తూ వాతావరణం వేడెక్కిస్తున్నారు. ఎంత కష్టపడినా దురదృష్టం తనను వెంటాడుతూనే ఉందని.. ఏది తేలికగా దక్కడం లేదంటూ గతంలో పోస్టులు పెట్టింది శ్రీజ. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోరుకున్నవి చేయి దాటి పోతే వెళ్లి పోనీలే.. బాధపడటం బెంగ పడిపోవడం మనకి మామూలే అంటూ శాడ్ ఎమోజీతో ఓ కొటేషన్ రాసుకొచ్చారు దమ్ము శ్రీజ. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X