నాన్నకి ఆ కోరిక తీర్చలేకపోయా... అంతా నా తలరాత... డిమోన్ పవన్ ఎమోషనల్

బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్ తండ్రి దుర్గాప్రసాద్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. జీవితంలో ఎన్నో కష్టాలుపడి.. తీరా తాను వృద్దిలోకే వచ్చే సమయానికి తండ్రి తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో డిమోన్ పవన్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. అయినప్పటికీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ.. తిరిగి తన రోజు వారీ పనుల్లో నిమగ్నమవుతున్నాడు డిమోన్ పవన్. తాజాగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ పవన్ ఎమోషనల్ అయ్యాడు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
తండ్రి మరణంపై ఫేక్ న్యూస్.. బిగ్‌బాస్ డిమాన్ పవన్ ఆవేదన .
తండ్రి మరణంపై ఫేక్ న్యూస్.. బిగ్‌బాస్ డిమాన్ పవన్ ఆవేదన .

పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఉప్పాల పవన్ కుమార్ అలియాస్ డిమోన్ పవన్ తొలుత బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ చేశాడు. కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ తర్వాత అథ్లెటిక్‌గా స్థిరపడాలని కలలు కన్నాడు. అయితే దానికి సరైన మెరిట్ లేకపోవడంతో పవన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే సోషల్ మీడియాలో పలు రీల్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇతర ప్రోగ్రామ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. సరిగ్గా ఇదే సమయంలో బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభానికి ముందు సామాన్యులకు కూడా కంటెస్టెంట్స్‌గా అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దాంతో కామనర్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసి ... అగ్నిపరీక్ష కాంటెస్ట్‌కు ఎంపికయ్యాడు. అక్కడ టాస్క్‌లు, ఇతర ఈవెంట్స్‌లోనూ సత్తా చాటి తుది జాబితాలో నిలిచాడు.

Bigg Boss Telugu 9 Contestant Demon Pavan Gets Emotional Remembering His Father Durga Prasad

బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ రోజున కంటెస్టెంట్‌గా డిమోన్ పవన్ పేరును నాగార్జున అనౌన్స్ చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తన మంచితనం, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్నాడు. తనూజ పుట్టస్వామి, పడాల పవన్ కళ్యాణ్‌లకు టఫ్ ఫైట్ ఇచ్చాడు. తన కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్‌‌కు ఓకే చెప్పి సెకండ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పవన్ ఆ నిర్ణయం తీసుకోకపోయుంటే.. అదే రౌండ్‌లో ఎలిమినేట్ అయి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. అయితే అదృష్టం అతనిని కాపాడిందని చెప్పొచ్చు.

Recommended For You
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’

బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత బుల్లితెర సెలబ్రిటీ రీతూ చౌదరికి క్లోజ్ అయ్యాడు. దాంతో రీతూకి పవన్‌కి మధ్య ప్రేమాయణం సాగుతోందని ఆడియన్స్ భావించారు. వీరిద్దరి లవ్ ట్రాక్ కూడా ఈసారి బిగ్‌బాస్ సీజన్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రీతూ, పవన్‌లు తమ రిలేషన్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. స్టార్ మాలో ప్రసారమవుతున్న బీబీ జోడీ 2లో వీరిద్దరూ కలిసి పాల్గొంటున్నారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్‌లో పవన్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌లో స్ధిరపడుతూ.. తల్లిదండ్రుల కలలు నెరవేరుస్తున్న దశలో తన తండ్రి దుర్గాప్రసాద్ మరణాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తన తండ్రితో అనుబంధం, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నాడు. అలాగే తన తండ్రి మరణం చుట్టూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలాంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యూస్, హైప్ కోసం తప్పుడు వార్తలు పోస్ట్ చేయొద్దని కోరాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో డిమోన్ పవన్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

You May Also Like
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’

నా లైఫ్‌లో ఫస్ట్ ఫ్లైట్.. నిజానికి నా తల్లిదండ్రులతో కానీ, నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ లేదా ఒక పర్పస్ ఉంటేనే నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కుదామని అనుకున్నా. ఎందుకంటే అదొక మెమొరీ అవ్వాలని. దురదృష్టవశాత్తూ నేను మా ఫాదర్‌తో ఎప్పటికీ ఫ్లైట్ ఎక్కలేను. దేవుడు ఇలా రాసిపెట్టినట్లున్నాడు. మా ఫాదర్ కోసం నేను ఫస్ట్ ఫ్లైట్.. కాశీ వెళ్లబోతున్నాను. ఇది నా జీవితంలో స్పెషల్ మెమొరీ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. డిమోన్ పవన్‌ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X