రీతూ చౌదరితో డిమోన్ పవన్‌.. బిగ్‌బాస్ లవ్‌బర్డ్స్‌కు లక్కీ ఛాన్స్!

105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్‌బాస్ తెలుగు 9 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న హోరాహోరీగా జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ సోల్జర్ కళ్యాణ్ విజేతగా నిలిచారు. అతనికి గట్టి పోటీ ఇచ్చిన కన్నడ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. ఈ బిగ్‌బాస్‌లో పలువురు తమ సత్తా చాటి ప్రేక్షకుల అభిమానాలను సంపాదించారు. వారిలో డిమోన్ పవన్ కూడా ఒకడు. బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకోవడంతో పాటు రెండు సార్లు కెప్టెన్‌గా నిలిచాడు. టాస్క్‌లలో ఇతనితో పోటీపడటం అసాధ్యమని విశ్లేషకులు సైతం అంగీకరించారు.

కళ్యాణ్ మాదిరిగానే కామన్‌మెన్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు పవన్. తనూజ - సోల్జర్ కళ్యాణ్‌లకు గట్టి పోటీ ఇచ్చిన పవన్.. చివరికి బిగ్‌బాస్ ఆఫర్‌కి అంగీకరించి రేసులో నుంచి తప్పుకున్నాడు. ఫైనల్‌లో సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్‌లు ఎలిమినేట్ అయ్యాక.. పవన్ కళ్యాణ్, తనూజ, డిమోన్ పవన్‌లు టాప్ 3లో నిలిచారు. వారిలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు మాస్ మహారాజా రవితేజ 10 లక్షల రూపాయల సూట్‌కేస్‌తో వచ్చాడు. దానికి ముగ్గురు అంగీకరించలేదు.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని నాగార్జున 15 లక్షల రూపాయలకు పెంచడంతో పవన్ ఆలోచనలో పడ్డాడు. దానిని పసిగట్టిన నాగ్.. అతని తల్లిదండ్రులతో మాట్లాడించగా పవన్‌ నిర్ణయానికే వారు వదిలేశారు.

Bigg Boss Telugu 9 Demon Pavan s Emotional Exit Suitcase Decision and Future Plans After the Show

తన తండ్రి అనారోగ్యం, కుటుంబ ఆర్ధిక పరిస్ధితులతో తనకు డబ్బు అవసరం చాలా ఉందని గ్రహించిన డిమోన్ పవన్.. గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బిగ్‌బాస్ ఆఫర్‌ను అంగీకరించి పోటీలో నుంచి తప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత రవితేజ బాక్స్ ఓపెన్ చేసి చూపించగా.. ఎలిమినేట్ అయ్యేది డిమోన్ పవన్ అని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. చివరి నిమిషంలో మంచి నిర్ణయం తీసుకున్నాడని, అదృష్టం కలిసొచ్చిందని అంతా ఆ అబ్బాయిని మెచ్చుకున్నారు. బిగ్‌‌బాస్ నుంచి బయటికొచ్చాక పవన్ ఏం చేయబోతున్నాడు? సినిమాలలో ఆఫర్లు వచ్చాయా? లేక మరేదైనా షోలో పాల్గొంటున్నాడా? అన్న గాసిప్స్ వస్తున్నాయి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ డిమోన్ ఈ సస్పెన్స్‌కు తెరదించారు. ఈ వివరాల్లోకి వెళితే..

సెలబ్రిటీలను, ఇతర కామనర్స్‌ను దాటుకుని నేను థర్డ్ పోజిషన్‌లో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులే. చాలా హ్యాపీగా ఉంది.. మా పేరెంట్స్ ఫేస్ చూస్తుంటే మాటలు రావడం లేదు. అమ్మానాన్నలు గర్వపడేలా చూసుకోవాలన్నదే నా తపన.. నేను అన్నయ్య మీద డిపెండ్ అయ్యాను, డాడీ మీద డిపెండ్ అయ్యాను, కానీ వాళ్లు గర్వపడేలా ఏం సాధించలేదు. అలాంటిది బిగ్‌బాస్ ద్వారా వాళ్లు గర్వపడేలా చేయడంతో పాటు డబ్బు కూడా సంపాదించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని పవన్ తెలిపారు.

ఫైనల్‌కు ముందు రోజు వరకు టైటిల్ నాకు వస్తుందనే అనుకున్నాను, కానీ లాస్ట్ డే ఎక్కడో తేడా కొట్టింది, ఇంట్లో వాళ్లకి మనీ చాలా అవసరం. డాడీ ట్రీట్‌మెంట్‌కి ఇంకేదైనా అవసరాల కోసం డబ్బు కావాలి. ఆ టైంలో జనానికి ఎక్కానో లేదో? అనిపించింది రాంగ్ స్టెప్ వేయకూడదు. ఆ సమయంలో నా సిక్త్స్ సెన్స్ చాలా బాగా పనిచేసింది. రీతూతో నా బాండింగ్‌పై సంజన గారు, దివ్వెల మాధురి గారు నానామాటలు అన్నా.. వాళ్లిద్దరి వ్యక్తిత్వం అది కాదని నాకు తెలుసు. అయినా రీతూ మాటపడే రకం కాదు, మిగిలిన హౌస్‌మేట్స్ కూడా బాగా మాట్లాడారు. కెప్టెన్సీ టాస్క్‌లో దీనిపై సంజనను నిలదీశా అని డిమోన్ పవన్ చెప్పారు.

రీతూ చౌదరితో నాది జెన్యూన్, ఆర్గానిక్‌గా జరిగిన ఫ్రెండ్‌షిప్. మనింట్లో మన పేరెంట్స్ ఉంటారు.. మనం ఎక్కడ తిరిగొచ్చినా, బాధ అయినా హ్యాపీ అయినా ఇంట్లో వాళ్లతో ఎలా షేర్ చేసుకుంటామో అలాగే ఆ హౌస్‌లో కూడా ఒక పర్సన్ ఉంటారు. నాకు రీతూని చూడగానే అలా అనిపించింది. ఫ్యామిలీ మెంబర్‌గా ఒక కంఫర్టబుల్, నేను తనతో ఏమైనా షేర్ చేసుకోవచ్చు. నా గురించి తను స్టాండ్ తీసుకుంటది, నా గురించి కేర్ తీసుకుంటది. అందువల్ల ఆ ఎఫెక్షన్, ఫ్రెండ్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. టాస్క్‌లో బ్యాక్‌పెయిన్ వచ్చినప్పుడు తను వెనక్కి వెళ్లి నాకు ఏం కాకూడదని దేవుడికి దండం పెట్టుకుంది. నా గురించి ఆడే ఛాన్స్ తనకు రాలేదు.. వచ్చుంటే తను కూడా ఆడేది అని పవన్ తెలిపారు. త్వరలో స్టార్ మాలో బీబీ జోడీ ప్రసారం కానుంది. అందులో రీతూతో ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. డ్యాన్స్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అది కాకుండా ఏమైనా అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను. ఎక్కడికి వెళ్లినా జీరో టూ హీరో అనిపించుకోవాలి. యాక్షన్ అడ్వెంచర్స్, సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. అలాంటివి వస్తే ఖచ్చితంగా చేస్తానని డిమోన్ పవన్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X