రీతూ చౌదరి కోసం డిమాన్ పవన్ త్యాగం.. బిగ్‌బాస్ హౌస్ లోనే..
బిగ్‌బాస్ అంటేనే ప్రేమకథలు, లవ్ ట్రాక్స్‌కి పెట్టింది పేరు. ఏ భాషల్లో బిగ్‌బాస్ ప్రసారమైనప్పటికీ ఇలాంటివి కామన్ అన్నట్లుగా పరిస్ధితి తయారైంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ బిగ్‌బాస్ నిర్వాహకులు ఖాతరు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఈ ఏడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లోనూ లవ్ ట్రాక్స్ కనిపించాయి. కానీ ఎక్కువగా హైలైట్ అయ్యింది మాత్రం డిమోన్ పవన్ - రీతూ చౌదరి. బుల్లితెర సెలబ్రిటీగా ఉన్న రీతూ.. కామన్ మ్యాన్ అయిన పవన్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. అలాగే రీతూ కారణంగా పవన్ గేమ్ సరిగా ఆడటం లేదనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ వీరిద్దరూ అవేవీ పట్టించుకోలేదు. హౌస్‌లో ఒకరికొకరు సహకరించుకుంటూ గేమ్ ఆడారు.
వాడు నా బెస్ట్ ఫ్రెండ్
గత వారం రీతూ చౌదరి బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. దాంతో హౌస్‌లో పవన్ ఒంటరివాడు అయిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు రీతూ. అతను చాలా మంచోడు.. మన కాలేజ్, స్కూల్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అతను కూడా ఇంతే. బిగ్‌బాస్ లాంటి గేమ్స్‌లో కొందరే మనకి కనెక్ట్ అవుతారు. అలాంటి వారిలో పవన్ కూడా ఒకడు. ఖచ్చితంగా బిగ్‌బాస్ విజేత అవుతాడని రీతూ చౌదరి స్పష్టం చేశారు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. బిగ్‌బాస్‌లో నాకు వాడు, వాడికి నేను సాయం చేసుకున్నాం. కాకపోతే కొందరు దానిని ఎక్కువ చేసి చూపించారని రీతూ చౌదరి మండిపడింది.

హౌస్‌లో ఎంతమంది మిగిలారంటే?
ఇదిలాఉండగా.. మరో వారంలో బిగ్‌బాస్ తెలుగు 9కి ఎండ్ కార్డ్ పడనుంది. దాంతో ప్రస్తుతం హౌస్‌లో సంజన గల్రానీ, తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, పడాల పవన్ కళ్యాణ్‌తో కలిపి ఏడుగురు ఉన్నారు. వీరిలో శనివారం నాటి ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? ఈ సీజన్‌లో బిగ్‌బాస్ ప్రైజ్ మనీ ఎంత? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి కింగ్ అక్కినేని నాగార్జున తెరదించారు. దీనికి సంబంధించి విడుదలైన ప్రోమోలో ఈ సీజన్ ప్రైజ్ మనీ గురించి నాగార్జున రివీల్ చేశారు. అలాగే కంటెస్టెంట్స్‌కి కూడా ప్రైజ్‌మనీతో ఏం చేస్తారు అని ఓ టాస్క్ ఇచ్చారు ఈ వివరాల్లోకి వెళితే...
బిగ్‌బాస్ 9 ప్రైజ్‌మనీ ఎంత?
బిగ్‌బాస్ సీజన్ 9లో విజేతకు 50 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ ఇస్తున్నట్లు నాగ్ తెలిపారు. ఆ వెంటనే భరణిని పిలిచి ఆ ప్రైజ్‌మనీ నీ సొంతమైతే ఈ ఐదుగురిలో ఎవరిని పంపిస్తావు? ఎంత ఇచ్చి పంపిస్తావు? అని నాగార్జున ప్రశ్నించారు. మనీ ఇవ్వాలనుకుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇద్దరు సార్.. డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్. డిమోన్ కంటే ఇమ్మాన్యుయేల్‌కే 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు భరణి. ఆ వెంటనే ఇమ్మూని పిలిచి సేమ్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. నేను భరణి అన్నని తప్పిస్తానని ఇమ్మూ చెప్పడంతో భరణి చూశావా.. పవర్ అస్త్ర వాడకుండా అప్పుడు తప్పించావు అంటూ నాగ్ సెటైర్లు వేస్తారు. దాంతో ఉలిక్కిపడ్డ ఇమ్మూ.. అది నిజం అనుకుంటారని అంటాడు. పెళ్లికొచ్చిన గెస్ట్‌లా ఉన్నావని అతనికి నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చారు.
రీతూపై పవన్ అభిమానం
ఇప్పుడు పెళ్లి కొడుకుని పిలుస్తానని డిమోన్ పవన్‌ని పిలిచారు నాగార్జున. ఈ ప్రైజ్‌మనీ మొత్తం నీదైతే రీతూకి గిఫ్ట్ కొనడం కోసం ఎంత ఖర్చు పెడతావు అని ప్రశ్నించారు. దానికి పవన్ స్పందిస్తూ.. ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పాడు. దాంతో 5 లక్షలా అంటూ కంటెస్టెంట్స్ షాక్ అవుతారు. ఆ తర్వాత సంజనాను పిలిచి ఈ హౌస్‌లో ఇప్పుడున్న ఆరుగురిలో విన్నర్ ఎవరు? అని నాగార్జున ప్రశ్నించారు. ఇమ్మాన్యుయేల్‌కి, తనూజాకి టఫ్ ఫైట్ అనిపిస్తోంది, మధ్యలో కళ్యాణ్ కూడా ఉన్నాడు అని సంజన అంటుంది. దాంతో పవన్, భరణి పేర్లు కూడా చెప్పేయ్ అంటూ నాగ్ సెటైర్లు వేశాడు. మధ్యలో మేమేం పాపం చేశామంటూ భరణి కూడా అందుకుంటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. రీతూపై పవన్ తన అభిమానాన్ని చాటుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











