నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్... తనూజకి కళ్యాణ్ పడాల సర్‌ప్రైజ్

దాదాపు 105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు 9 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలను, బలమైన కంటెస్టెంట్స్‌ను దాటుకుని కళ్యాణ్ పడాల అలియాస్ సోల్జర్ కళ్యాణ్ .. ఈ సీజన్ విజేతగా నిలిచాడు. అతనికి గట్టి పోటీ ఇచ్చిన బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో దాదాపు మూడున్నర నెలల పాటు ఇంటికి, బంధువులకు, ఆత్మీయులకు దూరంగా ఉన్న కంటెస్టెంట్స్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్ పీరియడ్ ముగించుకుని ఇప్పుడిప్పుడే అందరూ వారి వారి పనుల్లో బిజీ అవుతున్నారు.

తనూజతో కళ్యాణ్ లవ్‌ట్రాక్
ఇప్పుడు అందరి చూపు తనూజ పుట్టస్వామి, పడాల పవన్ కళ్యాణ్‌లపైనే ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తనూజతో లవ్‌ట్రాక్ నడిపేందుకు కళ్యాణ్ తెగ ట్రై చేశాడు అయితే ఆమె ఎవ్వరినీ తన దగ్గరికి రానివ్వకుండా, ఎవ్వరితోనూ గ్రూప్‌లు కట్టకుండా తన గేమ్ ఆడింది. వీరిద్దరి ట్రాక్ చాలా వెరైటీగా ఉండేది. కొన్నిసార్లు కళ్యాణ్‌పై కోపంగా, కొన్నిసార్లు ప్రేమగా ఉండేది తనూజ. దాంతో ప్రేక్షకులకు మెంటలెక్కిపోయేది. అయితే బిగ్‌బాస్ చివరి రోజుల్లో మాత్రం తనూజలో కళ్యాణ్ విషయంలో సాఫ్ట్ కార్నర్ కనిపించింది.

Bigg Boss Telugu 9 Did Thanuja Puttaswamy Accept Kalyan Padala s Love Promo Sparks Fresh Buzz

తనూజతో ఫ్రెండ్‌షిప్‌కి మించి
చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం.. అలకలు, బుజ్జగింపులు జరిగాయి. వీటితో కళ్యాణ్‌, తనూజలు ఒకరిపై మరొకరు ఇష్టం చూపించేవారు. ఓ సోమవారం నామినేషన్స్ రోజున తనూజపై తన ప్రేమను ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టాడు కళ్యాణ్. తన జర్నీ గురించి చెబుతూ .. తనూజ వైపు చూస్తూ జీవితాంతం ఆమె ఫ్రెండ్‌షిప్ కావాలి. కాదు.. కాదు ఫ్రెండ్‌షిప్‌కి మించి అని కుండబద్ధలు కొట్టేశాడు. తనూజ మనుషుల్ని చాలా బాగా అర్ధం చేసుకుంటుందని తనూజని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. దీనిపై తనూజ క్లారిటీ ఇవ్వకుండానే బిగ్‌బాస్ ముగిసిపోయింది. అయితే కళ్యాణ్‌తో మీ రిలేషన్ ఏంటనీ పలుమార్లు తనూజని మీడియా ప్రశ్నించడంతో అతను బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. తాజాగా తనూజపై ఇష్టాన్ని మరోసారి బయటపెట్టాడు కళ్యాణ్.

బుల్లితెరపై తనూజ రీ ఎంట్రీ
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్టార్ మా సరికొత్తగా రెడీ అయ్యింది. మా సంక్రాంతి వేడుక పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. జనవరి 14వ తేదీన మధ్యాహ్నం ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో బుల్లితెర స్టార్స్, బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ సందడి చేశారు. బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులతోనే గడుపుతున్న తనూజ తొలిసారిగా ఈ కార్యక్రమం ద్వారా తిరిగి తన వృత్తి జీవితంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా కళ్యాణ్‌తో కలిసి కావడం విశేషం.

తనూజకి మరోసారి కళ్యాణ్ ప్రపోజ్
ప్రోమో స్టార్టింగ్‌లోనే తనూజ పుట్టస్వామి.. క్వీన్‌లాగా, ఓ లేడీ సింగంలా ఎంట్రీ ఇచ్చి వారణాసి చిత్రంలోని సంచారి సంచారి సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్ వేసింది. ఆ వెంటనే కళ్యాణ్‌తో కలిసి తనూజ స్టేజ్ మీదకి రావడంతో కంటెస్టెంట్స్, బుల్లితెర సెలబ్రెటీలు అంతా గోల గోల చేశారు. నాకు తనూజ దొరకడం నిజంగా అదృష్టం.. నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ అని కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అనంతరం ఛాంపియన్ మూవీలోని గిర గిర సాంగ్‌కి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. తర్వాత నిన్ను అభిమానించే వాళ్లలో కొంతమంది మాత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా నీకోసం వచ్చారని శ్రీముఖి.. ప్రేక్షకులను పిలుస్తుంది. దాంతో వారంతో పైకి వచ్చి తనూజకి వాళ్ల నాన్నతో కలుసున్న ఫోటోను గిఫ్ట్‌గా ఇచ్చారు. తనపై చూపిన అభిమానానికి గాను తనూజ ఎమోషనల్ అవుతూ లవ్ సింబల్‌ని చూపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా కళ్యాణ్ ప్రేమను తనూజ యాక్సెప్ట్ చేశారా? లేదా? అభిమానులకు తనూజ ఏమని చెప్పింది? ఇది తెలియాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X