అందుకే నా భర్తతో విడిపోయా.. మొదటి భర్తపై బిగ్‌బాస్ ఫైర్ బ్రాండ్ షాకింగ్ కామెంట్స్..

Divvela Madhuri: తెలుగు బుల్లితెరపై సంచలనంగా మారిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో ఎక్కువగా చర్చకు వచ్చిన పేరు దివ్వెల మాధురి. కేవలం మూడు వారాల పాటు మాత్రమే హౌస్‌లో ఉన్నప్పటికీ, ఆమె ఆటతీరు, మాటల దూకుడు, స్పష్టమైన అభిప్రాయాలతో ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే మాధురి 'ఫైర్ బ్రాండ్'గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి ఓ ఇంటర్య్వూలో తన మొదటి భర్తపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ మాధురి. అప్పటికే కంటెస్టెంట్ల మధ్య ఉన్న ఆమె తన టాస్క్‌లలోనూ, మాటల యుద్ధాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అదే దూకుడు కొన్నిసార్లు ఆమెకు ప్రతికూలంగా మారింది. సహ కంటెస్టెంట్లతో జరిగిన వాగ్వాదాలు, కఠినమైన మాటలు నెగెటివిటీకి దారి తీశాయి. సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో షో హోస్ట్ నాగార్జున కూడా ఒక ఎపిసోడ్‌లో మాధురిని హెచ్చరించాల్సి వచ్చింది. ఆ తర్వాత మాధురి తన అటిట్యూడ్ మార్చుకునేందుకు ప్రయత్నించినా, అప్పటికే ప్రేక్షకుల అభిప్రాయం ఓటింగ్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా తక్కువ ఓట్లతో ఆమె మూడు వారాలకే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

Bigg Boss Telugu 9 Divvela Madhuri Makes Shocking Revelations About Her First Husband

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మాధురి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా బిగ్‌బాస్ రెమ్యునరేషన్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'బిగ్‌బాస్‌కు వెళ్లేటప్పుడు డబ్బు గురించి పెద్దగా ఆలోచించలేదు. వచ్చిన రెమ్యునరేషన్‌ను సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ముందే నిర్ణయించుకున్నాను'అని ఆమె చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. అయితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్వెల మాధురి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తొలిసారి ఇంత స్పష్టంగా వెల్లడించారు.

ముఖ్యంగా తన మొదటి భర్త గురించి చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా మారాయి. "నా మొదటి భర్తతో పెద్ద గొడవలు ఏమీ లేవు. కానీ కుటుంబ సమస్యలు మాత్రం ఎక్కువగా ఉండేవి. అతను ఎప్పుడూ విదేశాల్లోనే ఉండేవాడు. ఇండియాకు రమ్మంటే అసలు వచ్చేవాడు కాదు" అని మాధురి తెలిపారు. తనకు ఫారెన్ వెళ్లడం ఇష్టం లేదని, కుటుంబంతో కలిసి ఉండాలనే కోరిక తనకు ఎక్కువగా ఉండేదని చెప్పారు. 'డబ్బుకి కంటే ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాను. ఒంటరిగా ఉండడం ఇష్టం లేదని చెప్పాను. కానీ అతడు ఒప్పుకోలేదు. ఇలా క్రమంగా మా మధ్య విభేదాలు పెరిగాయి. చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని ఆమె భావోద్వేగంగా చెప్పారు.

దువ్వాడ శ్రీనివాస్‌తో పరిచయం ఎలా ఏర్పడిందని ప్రశ్నించగా.. మాధురి మాట్లాడుతూ.. 'పరిస్థితులు, అవసరాలు, జీవితంలో ఎదురైన ఒత్తిళ్లు.. ఇవన్నీ కలిసి మమ్మల్ని దగ్గర చేశాయి. నా మొదటి భర్తతో ప్రేమ కరువైంది. అదే సమయంలో శ్రీనివాస్ గారు కూడా కుటుంబ సమస్యలతో ఒంటరిగా ఉన్నారు. అలా మా మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది' అని చెప్పారు. 'మాధురి అంటే శ్రీనివాస్, శ్రీనివాస్ అంటే మాధురి అన్నట్టు నాలుగేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. మా ప్రయాణం అక్కడినుంచే మొదలైంది' అని ఆమె చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆమె నిజాయితీని ప్రశంసిస్తే, మరికొందరు విమర్శలు కూడా చేశారు. దివ్వెల మాధురి బిగ్‌బాస్‌ ప్రమాణం మూడు వారాలే అయినా.. ఆమె పేరు మాత్రం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో గుర్తుండిపోయేలా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X