Akhanda 2: అఖండ 2పై బిగ్‌బాస్ దివ్య నిఖిత రివ్యూ.. బాలకృష్ణ సినిమాపై దారుణంగా కామెంట్స్..
Akhanda 2 Thaandavam Movie: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన స్పిరిచ్యువల్ యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ' కి సీక్వెల్ గా వచ్చిన మూవీ 'అఖండ : తాండవం'. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కావాల్సింది. కానీ, నిర్మాతల ఆర్థిక సమస్యల వల్ల వాయిదాపడింది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి, డిసెంబర్ 12 (నేడు)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను దక్కించుకుంది. . ఈ నేపథ్యం బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ దివ్య నిఖిత తన రివ్యూ ఇచ్చింది. బాలకృష్ణ సినిమాపై దారుణంగా కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే..?
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2: తాండవం' విడుదలయ్యాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే ఈ సినిమాపై చాలా మంది రివ్యూలు ఇచ్చిన బిగ్‌బాస్ ఫేమ్ దివ్య నిఖిత చేసిన వ్యాఖ్యలు హైలెట్ గా నిలిచాయి. దివ్య.. అఖండ2 మూవీ రివ్యూ చెబుతూ.. 'ఈ సినిమాను ఒక షార్ట్ ఫిలిం లాగా తీస్తే సరిపోయేది కదా?'అంటూ విమర్శలతో ప్రారంభించింది. అఖండ 2 మూవీ 2 గంటల 45 నిమిషాల రన్‌టైమ్ ఉంది. అందులో దాదాపు 2 గంటల 15 నిమిషాలు ఫైట్లు మాత్రమే ఉండడం, అవి కూడా లాజిక్ లేకుండా, గ్రావిటీకి విరుద్ధంగా ఉన్న యాక్షన్ సీన్లుగా కనిపించాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అక్కడితో ఆగకుండా దివ్య 'బోయపాటి శ్రీను స్టైల్ ఇదే'అని చెప్తూ.. ఈసారి ఆ ఒవర్ ది టాప్ యాక్షన్ మరీ హద్దులు దాటిందని అభిప్రాయపడింది. చిన్న విషయం కూడా భారీగా చూపించడం, ప్రతి సీన్‌లో ప్రేక్షకులకు "స్పూన్ ఫీడింగ్" చేసినట్లుగా అనిపించిందని ఆమె పేర్కొంది. "ఒకనే విలన్ పెడితే బాలయ్య కొట్టి బోర్ కొడుతాడని భావించారా? అందుకే ప్రతి 10 నిమిషాలకు విలన్ మార్చేశారా?" అంటూ సెటైరికల్‌గా విమర్శించింది. అంతేకాదు.. సినిమా చూస్తూ 10 నిమిషాలు పడుకున్నా కథ ఏ మాత్రం ముందుకు కదలదని, ప్రేక్షకులు ఏమీ మిస్ అవ్వరని కూడా వ్యాఖ్యానించింది.
అలాగే ప్రతిసారి పాకిస్తాన్ నీ టార్గెట్ చేస్తే బాగోదు కదా.. కాస్త రోటీన్ కు భిన్నంగా ఈసారి చైనాపై టార్గెట్ చేశారు. అయితే, సినిమా మొత్తం నెగిటివ్ కాదు అని కూడా దివ్య నిఖిత స్పష్టం చేసింది. కాన్సెప్ట్ పరంగా సినిమాకు బలం ఉందని, సనాతన ధర్మం, దేశభక్తిపై చెప్పాలన్న ఆలోచన మంచి దేనని చెప్పింది. కానీ, ఆ కాన్సెప్ట్‌ను ప్రజలకు చేరవేసే విధానంలో భారీ లోపాలు ఉండటం వల్ల సినిమా దెబ్బతిందని ఆమె అభిప్రాయపడింది. 'యాక్షన్ సీన్‌లు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చవచ్చు. కానీ సాధారణంగా మంచి సినిమా చూడాలనుకునే వారికి మాత్రం ఇది సరైన మూవీ కాదు'అంటూ క్లారిటీ ఇచ్చింది.
చివరగా, తన రివ్యూకి సంబంధించిన ట్రోలింగ్‌కు ముందుగానే రియాక్ట్ అవుతూ.. 'ఇది పెద్ద హీరో సినిమా రివ్యూ కాబట్టి నాకు తప్పక నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నువ్వు ఈ కాస్ట్-ఆ కాస్ట్ అంటూ ట్రోల్ చేస్తారు, ఎవరి ఫ్యామిలీ నుంచి డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నావ్ అంటారు. కానీ నేను ఎవరినుంచీ డబ్బులు తీసుకోలేదు" అని ఓపెన్ చెప్పేసింది. ఇక ఫ్యాన్ వార్స్, కాస్ట్ కార్డ్ వాడడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఆపాలని ఆమె కోరుతూ.. 'సినిమాను సినిమాగా చూడండి, మీ ఈగోలు పక్కన పెట్టండి' అని సూచించింది.
ప్రస్తుతం దివ్య రివ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, ఒక్క పక్క బాలయ్య అభిమానులు ఆమెపై మండిపడుతుండగా, మరో పక్క చాలామంది ఆమె చెప్పింది నిజమేనని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద అఖండ 2 కంటే కూడా దివ్య నిఖిత రివ్యూ హాట్ టాపిక్ గా మారింది. మీరు కూడా ఓ లూక్కేయండి.


Click it and Unblock the Notifications











