Bigg Boss Telugu 9: బిగ్ బాస్ నుంచి దివ్య ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Divya Nikhita Elimination: బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు చివరి దశకు చేరుకుంది. మరో రెండువారాల్లో ఈ రియాలిటీ గేమ్ షోకు ఎండ్ కార్డు పడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. హౌస్‌లో సాధారణ వాదోపవాదాలు కాదు, వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో 12వ వారం ఎలిమినేషన్ ఎవరిది? అన్నది ఉత్కంఠ నెలకొంది. అయితే.. అందరూ ఊహించనట్టుగానే దివ్య నిఖిత హౌస్ నుండి బయటకు వెళ్లిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లో అడుగుపెట్టిన దివ్య ఎలిమినేషన్ కు కారణాలేంటీ? ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది? అనే వివరాల్లోకెళ్తే..
దివ్య నిఖిత సెప్టెంబర్ 25న నాల్గవ వారంలో వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టింది. అప్పుడే ఆమె ఎంట్రీతో హౌస్ ఎనర్జీ మారింది. మొదటి వారాలు గేమ్ విశ్లేషణ, స్ట్రాటజీస్, సంబంధాలు ఇవన్నీ ఆమెకి హైలైట్‌గా పని చేశాయి. కానీ, క్రమంగా ఆమె బిహేవియర్ మార్చుకుంది. భరణితో ఉన్న బాండింగ్... ఆ బంధం ద్వారా ఆమె రూలింగ్ నేచర్ చూపడం ప్రేక్షకులలో కొందరికి నచ్చలేదు. ప్రధానంగా భరణిపై పెత్తనం, అతని గేమ్ పై ప్రభావం చూపించిందనే కామెంట్లు సోషల్ మీడియాలో పెరిగాయి. అదే సమయంలో తనూజతో జరిగిన ఓ టాస్క్ లో ఘాటు వ్యాఖ్యలు దివ్యని హాట్ టాపిక్‌గా మార్చాయి. ఒకరకంగా ఆమెను సేవ్ చేసిన ఎపిసోడ్ అదే.

వాస్తవానికి గతవారమే దివ్య ఎలిమినేట్ అవుతుందనే వార్తలు వచ్చాయి. కానీ, ఆ వారం తనూజ-దివ్య గొడవ వల్ల బిగ్ బాస్ టీఆర్పీ దూసుకెళ్లింది. బీబీ ప్రేక్షకుల దృష్టి మొత్తం వీరిద్దరిపైనే. దాంతో ఆమెను ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ టీం ప్రణాళికలు రచించింది. దివ్యను సేఫ్ చేయడానికి పవరాస్త్రం ఉపయోగించారన్న ఆరోపణలు సోషల మీడియాలో వెల్లువెత్తాయి. కానీ ఈ వారం కథ మారింది. ఈ వారం ఎలిమినేషన్ లో సంజన, రీతూల మధ్య జరిగిన డైలాగ్ వార్..హైలెట్ గా మారింది. దీంతో దివ్య స్క్రీన్ స్పేస్ కూడా తగ్గిపోయింది. దివ్య ఏం చేసినా ఫేడ్ అయిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన దివ్య ఆట మారుతుందేమో అనుకున్నారు. కానీ చివరికి వివాదాలు, ఒత్తిళ్లు, తక్కువ ఓటింగ్ తో ఆమె బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది.
అన్‌అఫీషియల్ పోల్స్ ప్రకారం, తనూజ, కళ్యాణ్ పడాల 70% ఓట్లు పంచుకున్నారు. వారిని ఫాలో అయిన ఇమ్మానుయేల్ 15% ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మిగిలిన 15% ఓట్లను భరణి, సంజనా, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య పంచుకున్నారు. ఈ ఓటింగ్ లో లీస్ట్ ఓటింగ్ దివ్యకే రావడం ఆమె ఎలిమినేషన్‌ను ఫిక్స్ అయింది. గత వారం బిగ్ బాస్ టీమ్ రిస్క్ తీసుకున్నా... ఈసారి కాపాడే ప్రయత్నం చేయలేని పరిస్థితి. ప్రేక్షకులను నమ్మలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఎపిసోడ్ కంటెంట్ బట్టి తీసుకున్న నిర్ణయం ఇదేనని అనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో దివ్య నిఖిత బిగ్ బాస్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఎంత రెమ్యూనరేషన్ సంపాదించుకుంటే? వైల్డ్ కార్డ్‌గా 9 వారాల స్టే... ఈ సమయంలో వచ్చే రెమ్యూనరేషన్ కూడా గమనార్హం. బిగ్ బాస్ సర్కిల్స్ మాట్లాడుకునే సమాచారం ప్రకారం, వారానికి దాదాపు రూ. 1.5 లక్షలు ఆమెకు చెల్లించబడిందని తెలుస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే, 9 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది కాబట్టి..దాదాపు రూ. 13.5 లక్షలు నుంచి రూ. 14 లక్షల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే.. రెమ్యూనరేషన్ విషయంలో దివ్యకు అన్యాయమే జరిగినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











