Bigg Boss Telugu 9: మరో షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో విజేత ఎవరనేది తేలనుంది. వచ్చే ఆదివారంతో ఈ సీజన్‌కు అధికారికంగా ఎండ్ కార్డ్ పడనుంది. 15 వారాల పాటు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచిన ఈ రియాలిటీ షో ఇప్పుడు చివరి వారంలోకి అడుగుపెట్టడంతో హౌస్‌లో పోటీ మరింత హీట్ ఎక్కింది. ఇప్పటివరకు టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు? టైటిల్ రేస్‌లో ఎవరు ముందున్నారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో ఊహించిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుమన్ శెట్టితో పాటు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. ఇంతకీ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోనున్నదెవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివర దశకు చేరుకుంది. మొన్నటివరకు కళ్యాణ్ పడాల, తనూజ మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతుందని అంచనాలు వినిపించాయి. అయితే ఈ వారం ఆట తీరుతో ఇమ్మాన్యుయేల్ ఊహించని రీతిలో టైటిల్ రేస్‌లోకి దూసుకొచ్చాడు. ముఖ్యంగా సంజనతో ఉన్న బాండింగ్ ను దూరం పెట్టి, ఇమ్మూ తన గేమ్‌పై ఫోకస్ చేశారు. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ డ్రామాకు తెర తీశారు. నిన్నటి ఎపిసోడ్ (శనివారం)లోనే సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడంతో డబుల్ ఎలిమినేషన్ డ్రామాకు తెర లేసింది.

Bigg Boss Telugu 9 Double Elimination Bharani Eliminated Bigg Boss Final Top 5 Locked

ప్రస్తుతం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా ఈ వారం కళ్యాణ్ నామినేషన్లలో లేకపోవడంతో ఓటింగ్ ట్రెండ్స్ ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లెక్కల ప్రకారం, తనూజ అత్యధికంగా సుమారు 26 శాతం ఓటింగ్‌తో టాప్‌లో నిలిచినట్టు తెలుస్తోంది. ఆమె తరువాతి స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. ఆ తర్వాత డీమాన్ పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి వరుసగా ఉన్నట్టు సోషల్ మీడియా, అన్ అఫిషియల్ పోల్స్ ద్వారా అర్థమవుతుంది. ఈ లెక్క ప్రకారం.. మొదటి నుంచే డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యారు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందనే టాక్ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. 14వ వారం నామినేషన్లలో సుమన్ శెట్టి, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, భరణి ఉన్నారు. వీరిలో ఓట్లు తక్కువ పడ్డ సుమన్ శెట్టితో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ అయిన భరణి కూడా ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. నిజానికి భరణికి సంజన కంటే ఎక్కువ ఓటింగ్ ఉన్నప్పటికీ, ఊహించని విధంగా ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు భరణికీ సిన్సియారిటీ, బాండింగ్ ఫ్యాక్టర్‌తో గేమ్‌లో నిలిచినట్టు అభిప్రాయం ఉన్నా... క్లైమాక్స్ దశకు వచ్చేసరికి అవన్నీ పనిచేయలేదనే తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే అధికారిక ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

టాప్ 5 కంటెస్టెంట్లు వీరేనా?
14వ వారం టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కళ్యాణ్ పడాల విజయం సాధించి తొలి ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఈ వారం జరిగిన రెండో ఫినాలే టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ విన్నర్‌గా నిలిచి రెండో ఫైనలిస్ట్ అయ్యారని సమాచారం. ఇక డబుల్ ఎలిమినేషన్ నిజమైతే.. సుమన్ శెట్టి,భరణి హౌస్‌ను వీడినట్టే. ఈ లెక్కన చూసుకుంటే.. కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, తనూజ, డీమాన్ పవన్, సంజన టాప్ 5 కంటెస్టెంట్లుగా ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్. వీరి మధ్యే టైటిల్ పోరు సాగనుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక విజేత విషయానికి వస్తే.. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఇమ్మాన్యుయేల్‌ లేదా కళ్యాణ్ పడాల టైటిల్ గెలిచే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏది నిజమో, ఏది ఊహో అన్నది మరో వారంలో తేలిపోనుంది.

More from Filmibeat

Read more about: Bigg Boss Telugu 9 bharani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X