‘నాకు దేవుడు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ నువ్వే..' బిగ్‌బాస్ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ పోస్ట్..
తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగిసినప్పటికీ, షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల చుట్టూ చర్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి కళ్యాణ్ పడాల విజేత నిలువగా, తనూజ రన్నరప్‌గా నిలిచింది. అయితే.. వీరిద్దరి పేరు ఎంతగా వినిపిస్తుందో, అంతే స్థాయిలో ఈ సీజన్‌లో ఎక్కువగా మాట్లాడుకున్న పేరు ఇమ్మాన్యుయేల్ (Emmanuel) కూడా.. టైటిల్‌కు ప్రధాన పోటీదారుడిగా భావించిన ఇమ్మూ నాలుగో స్థానంతో నిలిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇమ్మూ చేసిన ఓ ఎమోషనల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ పోస్ట్ ఏంటీ?
నిజానికి బిగ్‌బాస్ 9 ఈ స్థాయిలో హిట్ కావడానికి ఇమ్మూ పోషించిన పాత్ర చాలా కీలకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్క్ ఏదైనా, గొడవల మధ్యైనా, ఎమోషనల్ సిట్యుయేషన్ అయినా తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో షోకు ప్రాణం పోశాడు. హౌస్‌లో టెన్షన్ పెరిగిన ప్రతిసారీ తన హ్యూమర్‌తో వాతావరణాన్ని లైట్ చేసి, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో ఇమ్మూ ప్రత్యేకంగా నిలిచాడు. అందుకే అతడు ఫినాలే వరకు వెళ్లి టైటిల్ గెలుస్తాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి ఇమ్మూ అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

ఇక బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయేల్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ, హౌస్‌లో జరిగిన విషయాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు. ఇదిలా ఉంటే.. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం తన ప్రియురాలిని కలిసిన ఇమ్మాన్యుయేల్, తన ప్రేమను మరింత ఓపెన్‌గా వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్‌లో తన ప్రియురాలిని ప్రేమగా 'వేస్ట్ అమ్మా' అని పిలుస్తూ.. తన జీవితంలోకి వచ్చినందుకు, తనను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో తాను ఆమెను చాలా బాధపెట్టిన విషయాన్ని ఒప్పుకుంటూ, ఇకపై అలా జరగకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు.
ఈ ఏడాది నుంచి తమ బంధం మరింత స్ట్రాంగ్‌గా ఉండాలని, జీవితాంతం సంతోషంగా ఉండాలని దేవుణ్ని కోరుకుంటున్నానని ఇమ్మూ రాశాడు. ఇప్పటి నుంచి ఆమెకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తూ, తాను అడగకుండానే దేవుడు తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి ఆమెనేనని పేర్కొన్నాడు. "నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు" అంటూ ఆమెకు తన జీవితంలో ఉన్న ప్రత్యేక స్థానం స్పష్టంగా చెప్పాడు.
ఈ పోస్ట్‌లో ఇమ్మాన్యుయేల్ తన ప్రియురాలిని తన జీవితానికి అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్‌గా పేర్కొన్నాడు. ఆమె అందిస్తున్న ప్రేమ, నిస్వార్థ సహకారానికి థాంక్స్ చెబుతూ, 'ఐ లవ్ యూ సో మచ్ నా బుజ్జి ఫెల్లో... నువ్వే నా సర్వస్వం... హ్యాపీ న్యూ ఇయర్' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇమ్మూ ప్రియురాలి పేరు రుచి అని తెలిసింది.
అయితే అతడు షేర్ చేసిన ఫోటోలో ఆమె ముఖం కనిపించకుండా దాచడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ఫోటో చూసిన అభిమానులు.. ' అన్నా.. వదినను ఎప్పుడు చూపిస్తావ్?'అంటూ కామెంట్లు చేయగా, దానికి ఇమ్మాన్యుయేల్ సరదాగా స్పందిస్తూ 'త్వరలోనే పరిచయం చేస్తా' అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఇమ్మూ ప్రేమకథపై సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











