బిగ్‌బాస్ 10లో ఎంటర్‌టైనర్లు జాగ్రత్త.. ఇమ్మాన్యుయేల్ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో కామన్‌మెన్ పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ సోర్జర్ కళ్యాణ్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. అతనికి గట్టి పోటీ ఇచ్చిన బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌లోనూ ఆడపిల్ల బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోవడం ఒక లోటుగా మారితే.. కమెడియన్‌కు ఒక్కసారి కూడా విజేత అయ్యే అవకాశం రాకపోవడం అభిమానులతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

బిగ్‌బాస్ టాప్ 5లో ఐదుగురు
అనేక మంది కంటెస్టెంట్స్‌ని, టాస్కులను, కష్టాలను దాటుకుని బిగ్‌బాస్ తెలుగు 9 ఫైనల్‌కు ఐదుగురు కంటెస్టెంట్స్ అర్హత సాధించారు. వారే పడాల పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్. వీరిలో తొలి నుంచి కళ్యాణ్ - తనూజల మధ్య వార్ హోరాహోరీగా సాగింది. దాంతో బిగ్‌బాస్‌లో ఈసారి ఖచ్చితంగా తనూజయే గెలుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అటు తొలిసారి కమెడియన్ కప్పు గెలవనున్నాడని ఇమ్మాన్యుయేల్ అభిమానులు.. తోటి కమెడియన్స్ కూడా ఆశించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఓ కామన్‌మెన్.. బిగ్‌బాస్ తెలుగు 9 ట్రోఫీ దక్కించుకున్నాడు.

Bigg Boss Telugu 9 Emmanuel s Shocking Comment on Entertainers Not Winning the Trophy Goes Viral

కమెడియన్లు ఏం పాపం చేశారు
ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ కావడానికి ముందే జబర్దస్త్ రోహిణి.. మరోసారి కమెడియన్‌కు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. హౌస్‌తో పాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే కమెడియన్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదా? అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎట్టకేలకు థర్డ్ రన్నరప్‌గా ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ కావడంతో అతని అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా నిరాశ వ్యక్తం చేశారు.

కమెడియన్స్‌పై ఇమ్మాన్యుయేల్ వ్యాఖ్యలు
బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత తాను కమెడియన్‌ని కాబట్టి ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నించానని, అందరూ నా వాళ్లు అనుకుని నామినేట్ చేయడానికి కూడా ఇబ్బందిపడ్డానని, 10 వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం కూడా దెబ్బ తీసిందని ఇమ్మాన్యుయేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా స్టార్‌ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమానికి బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

అవినాష్‌పై శ్రీజ సెటైర్లు
ఈ ప్రోమోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను బీబీ ప్రెస్‌మీట్ పేరుతో శ్రీముఖి, అవినాష్‌లు విలేకరుల మాదిరిగా ప్రశ్నలు అడిగారు. దమ్ము శ్రీజ గారు.. మీరు ఎందుకు అగ్నిపరీక్షలో పార్టిసిపేట్ చేయలేదని అవినాష్ ప్రశ్నించడంతో అంతా షాక్ అయ్యారు. దాంతో ఈ మీడియా వాళ్లని ఫస్ట్ ఎలిమినేట్ చేసేయమంటూ శ్రీజ సెటైర్లు వేసింది. తర్వాత సంజనా గల్రానీని అండా బుర్జీ ఎలా చేయాలని ప్రశ్నించింది శ్రీముఖి. కోసి కారం పెట్టాలని అని సంజన ఆన్సర్ ఇచ్చింది.

ఇమ్మాన్యుయేల్ గెలుస్తాడని అనుకున్నా
అనంతరం మీరు ఒక మాట అన్నారు కళ్యాణ్ గారు.. బయటికొచ్చిన తర్వాత నేను ఇమ్మాన్యుయేల్‌కి ఎక్స్‌పెక్ట్ చేశానని అన్నారు అని శ్రీముఖి ప్రశ్నించింది. అంటే తనూజ కూడా గెలవాలని కోరుకున్నానని కళ్యాణ్ చెప్పబోతుండగా.. మీరు అనుకున్నది తనూజ గారు థర్డ్ ప్లేస్ అని అవినాష్ సెటైర్లు వేశాడు. నేను ఫస్ట్ ప్లేస్ అనుకున్నానని కళ్యాణ్ చెప్పగా.. అంటే మీరు ఫిఫ్త్ ప్లేస్‌కి వెళ్దామని అనుకున్నారా అని అవినాష్ పంచ్‌లు వేశాడు. ఆపై మీరు బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్ ఎందుకు పెట్టుకోలేదని అడగ్గా.. ఆయనకు రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి అని అవినాష్ సెటైర్లు వేశాడు.

ఎంటర్‌టైనర్ల పరిస్ధితి ఇదే
లవ్ ట్రాక్ పెట్టుకుందామని అనుకున్నాను కానీ.. అప్పటికే శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది, ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది ఇక మిగిలింది మాధురి గారే అనడంతో అంతా నవ్వేశారు. బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్‌కి వెళ్లే మీలాంటి ఎంటర్‌టైనర్స్‌కు మీరు ఇచ్చే సలహా ఏంటనీ అడగ్గా.. ఎంటర్‌టైన్ చేయకండి అని ఇమ్మాన్యుయేల్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎంటర్‌టైన్ చేసినా బిగ్‌బాస్‌లో కమెడియన్స్‌కు ట్రోఫీ గెలిచే అవకాశం రాకపోవడంతోనే ఇమ్మాన్యుయేల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X