‘చెత్త అమ్ముకునేది అంటూ నాపై దారుణంగా... బిగ్‌బాస్‌లో అలా దెబ్బకొడతారు’

దేశంలో టాప్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్‌ తొలి నుంచి వివాదాస్పదమే. కంటెస్టెంట్ల ఎంపిక, ఎలిమినేషన్, విజేత అనేది ప్రతిసారి కాంట్రవర్సీయే. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఉండొచ్చిన ఎంతోమంది ఈ ప్రాసెస్‌పై పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బిగ్‌బాస్ లాంటి మెగా షో చేయాలంటే ఎన్నో లెక్కలు, ఎన్నో వ్యూహాలు ఉంటాయి. నామినేషన్స్‌లో ఉన్న వారిని ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ చేస్తున్నామని చెబుతున్నా.. దీని వెనుక మరేదో ఎత్తుగడ ఉంటుందని విమర్శకులు అంటూ ఉంటారు.

శ్రీజ ఎలిమినేషన్‌పై వివాదం
కొందరి ఎలిమినేషన్ వివాదాస్పదం అవుతుంది. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 9లో కామన్‌మెన్‌గా ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ ఎలిమినేషన్‌ చర్చనీయాంశమైంది. స్వయంగా శ్రీజ సైతం తనను బలవంతంగా గెంటేసినట్లుగా బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్ షో కార్యక్రమానికి హాజరైన దమ్ము శ్రీజ.. బిగ్‌బాస్ జర్నీ, పీఆర్‌ టీమ్‌ల దారుణాలు, నెగిటివ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu 9 fame Dammu Srija sensational comments on PR Teams in Kissik Talks With Jabardasth Varsha

బీటెక్ తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా
విశాఖపట్నానికి చెందిన దమ్ము శ్రీజ.. భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ ఉమెన్‌లో బీటెక్ చేశారు. అనంతరం ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి బడా ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో పాటు బిగ్‌బాస్‌కు వీరాభిమాని. ఈ క్రమంలోనే గతేడాది బిగ్‌బాస్ తెలుగు 9లో కామెన్‌మెన్ కేటగిరీలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాలని అనుకుని దరఖాస్తు చేసుకుంది.

రెండుసార్లు ఎలిమినేషన్
అన్ని అడ్డంకులను దాటుకుని బిగ్‌బాస్ అగ్నిపరీక్ష‌లో చోటు దక్కించుకున్న దమ్ము శ్రీజ... ఆ తర్వాత ఫైనలిస్ట్‌గా నిలిచి బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి తన కల నెరవేర్చుకుంది. గేమ్స్, టాస్క్‌లు ఏదైనా సరే దుమ్ముదులిపేసిన శ్రీజ అనూహ్యంగా 5వ వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరోసారి హౌస్‌లోకి పంపగా .. మళ్లీ ఎలిమినేట్ అయి ఇంటికొచ్చేసింది. దాంతో బిగ్‌బాస్‌పై శ్రీజ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా కిస్సిక్ టాక్‌ షోలోనూ మరోసారి తన అనుభవాలను పంచుకున్నారు దమ్ము శ్రీజ. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిమిషంలో వదిలిపారేస్తా
నీకు ఇంత దమ్ముంది? బిగ్‌బాస్ టైటిల్ ఎందుకు కొట్టలేకపోయావని వర్ష అడగ్గా.. కొట్టలేక కాదు.. పంపించేశారు. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌కి పీఆర్స్ ఉంటారు. మన ఆటతీరుపై కామెంట్స్ పెడతారు. 24/7 లైవ్ ఫాలో అవుతారు. ఏదైనా చిన్నది దొరికితే నెగిటివ్‌ చేయడానికి చూస్తారని శ్రీజ తెలిపింది. ఎప్పుడైనా దమ్ము కొట్టడం, డ్రింక్ చేయడం కానీ చేశావా అని వర్ష అడగ్గా.. నాకు ఆల్కహాల్ నుంచి ఒక ట్రామా ఉంది. పెళ్లి చేసుకున్నాక భర్తకు అలవాటుంటే ఎప్పుడైనా తీసుకుంటే ఓకే. కానీ తాగి రచ్చచేసి చిరాకు పెడితే నిమిషం కూడా ఆలోచించను వదిలిపారేస్తానని దమ్ము శ్రీజ తేల్చేసింది.

కాబోయే భర్త ఎలా ఉండాలంటే?
కాబోయే భర్త ఆరడుగులు ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, జుట్టు ఎక్కువగా ఉండాలి. వాడికి నేనే అప్సరసలా కనిపించాలి. పక్కన సన్నీలియోన్ వెళ్తున్నాసరే కళ్లు తిప్పారంటే నువ్వు అక్కడికే వెళ్లిపో అంటా. ఇక ఈ జనరేషన్‌లో బ్రేకప్స్ గురించి శ్రీజ స్పందిస్తూ.. ఇప్పుడు ఎవరూ కూడా అడ్జెస్ట్ కావడం లేదు. ఓపెన్ రిలేషన్‌షిప్ అంటారు, ఫిచ్చింగ్ అంటారు, సిట్టింగ్ అంటారు. ఏవేవో కొత్త పదాలు తీసుకుని వస్తున్నారు. నిజంగా లవ్ చేయడం వేస్ట్. మాది లోయర్ మిడిల్ క్లాస్.. ఇంట్లో పరిస్ధితులు కూడా అంత బాగుండవు. మాది అద్దె ఇల్లే. శారీలు, డ్రెస్‌లు కాకుండా నాకు నైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టం, సుఖం. బిగ్‌బాస్‌లో చీరకట్టుకుని ఓ టాస్క్ చేస్తుండగా దానిని దారుణంగా ట్రోల్ చేశారు అని శ్రీజ తెలిపింది.

తడి చెత్త అమ్ముకునేదాన్ని అంటూ
ఇది తడిచెత్త అమ్ముకునేలా ఉంది.. అలాగే సెట్ అయ్యింది అంటూ మాట్లాడారు. మా డాడీ చేసే జాబే అదన్నమాట. ఆ రోజు ఏడ్చింది కూడా అందుకే. నాకే ఎందుకిలా అవుతుంది.. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని బెటర్‌గా చూడాలని అనుకుంటారు కదా? మా ఇంట్లో వాళ్లు ఆ మాటలకు బాగా ఫీల్ అయ్యారు అని దమ్ము శ్రీజ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ దమ్ము శ్రీజ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి శ్రీజ బిగ్‌బాస్‌లో ఎన్ని కష్టాలు పడింది? పెళ్లి ఎప్పుడు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ? అనేది తెలియాలంటే ఈ శనివారం రాత్రి 8 గంటలకు కిస్సిక్ టాక్ షో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X