డిమోన్ పవన్‌తో రెచ్చిపోయిన రీతూ చౌదరి... చెత్త పనులు వద్దంటూ నటి వార్నింగ్
Photo Courtesy: Star Maa
దాదాపు 105 రోజుల పాటు హోరాహోరీగా జరిగిన బిగ్‌బాస్ తెలుగు 9 ఇటీవలే ముగిసిందే. సెలబ్రిటీలను, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను దాటుకుని పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ సోల్జర్ కళ్యాణ్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా నిలిచారు. ఆయనకు గట్టిపోటీ ఇచ్చిన బుల్లితెర నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. అన్ని బిగ్‌బాస్ సీజన్‌లలోనూ లవ్‌ట్రాక్స్ గ్రాండ్ సక్సెస్ అవుతుంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఒక జోడీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. వారే రీతూ చౌదరి - డిమోన్ పవన్. వీరిలో ఒకరు సెలబ్రిటీ కాగా.. మరొకరు కామన్‌మెన్. వీరిద్దరూ బిగ్‌బాస్‌లో ఒకరికోసం మరొకరు అన్నట్లుగా అండగా నిలిచారు. బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కూడా వీరి గురించి మాట్లాడుకుంటున్నారంటే పవన్- రీతూలు ఎలాంటి ముద్ర వేశారో అర్ధం చేసుకోవచ్చు.
బిగ్‌బాస్‌లో హౌస్‌లో ఉన్నన్ని రోజులు పవన్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యింది రీతూ చౌదరి. రీతూ ట్రాప్‌లో పడి పవన్ సరిగా ఆడటం లేదన్న ట్రోలింగ్ కూడా నడిచింది. ఒకానొక దశలో రీతూ కుటుంబం కూడా ఆమె ఆట పట్ల అసంతృప్తిగా ఉందని గాసిప్స్ వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని రీతూ తల్లి క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక పవన్‌తో రిలేషన్‌పై రీతూ చౌదరి స్పందించారు. అతను చాలా స్వీట్, జెన్యూన్ అని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. స్కూల్, కాలేజీలో మనకు బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉంటారని.. అలాగే బిగ్‌బాస్ హౌస్‌లో నాకు పవన్ బెస్ట్ ఫ్రెండ్‌గా అనిపించాడని క్లారిటీ ఇచ్చింది. బిగ్‌బాస్‌లో ఉన్న పవన్ కోసం రీతూ చౌదరి ఎంతో సపోర్ట్ చేసింది.

Photo Courtesy: Star Maa
ఇక పవన్ విషయానికి వస్తే... కామన్‌మెన్ కేటగిరీలో బిగ్‌బాస్‌లో అవకాశం దక్కించుకుని టాస్క్‌లు, గేమ్స్‌తో సత్తా చాటి టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. ఒకటైంలో కళ్యాణ్ పడాల, తనూజలకు సైతం గట్టిపోటీ ఇచ్చాడు. రీతూ కారణంగా ఇతను తన ఆటపై సరిగా కాన్సన్‌ట్రేట్ చేయలేదని.. లేదంటే ఖచ్చితంగా బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా నిలిచేవాడని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. టాప్ 3లో ఉండగా.. తన కుటుంబ ఆర్ధిక పరిస్ధితి, తండ్రి అనారోగ్యం కారణంగా బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్ తీసుకుని బయటకు వచ్చేశాడు.
ఆ సమయంలో అతని నిర్ణయం చాలా మేలు చేసింది, లేదంటే పవన్ ఎలిమినేట్ అయి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. అతనికి అదృష్టం కలిసొచ్చిందని పలువురు మెచ్చుకున్నారు. బిగ్‌బాస్ తర్వాత పవన్ - రీతూలు కలిసి పనిచేస్తారని ప్రచారం జరిగింది. దీనిని నిజం చేస్తూ స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ జోడీ డ్యాన్స్ షోలో వీరిద్దరూ కలిసి అడుగుపెట్టారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాలు పరిశీలిస్తే...
ప్రోమో స్టార్టింగ్‌లోనే జడ్జిలు శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్, సదాలు డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. సంక్రాంతి, భోగీ, కనుమ మూడు ఒకేసారి చూసినట్లుగా ఉందని యాంకర్ ప్రదీప్ అన్నాడు. సంక్రాంతికి బాగా బిజీగా ఉంటారా అని శేఖర్‌ను అడగ్గా.. తినడంలో బిజీగా అంటానని ఆన్సర్ ఇచ్చాడు. మరాఠీలో సంక్రాంతి రోజున స్వీట్‌గా మాట్లాడాలని సదా చెప్పింది. ఈ వెంటనే ఈ బ్లాక్‌బస్టర్ టీమ్‌లో ఓ బ్లాక్‌బస్టర్ జోడీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రదీప్ చెప్పగానే రీతూ చౌదరి, పవన్ డిమోన్‌లు వచ్చారు.
వచ్చి రావడంతోనే గురువులకు నమస్కారం అని రీతూ అనగా.. జడ్జిలు ముగ్గురు నవ్వేశారు. తర్వాత పవన్ డిమోన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అయిపోతుందని కొంచెం భయపడ్డా.. కానీ బీబీ జోడీకి వచ్చాను కాబట్టి కుదిరితే టైటిల్ లేదంటే అని చెప్పబోతుండగా.. ఇందులో సూట్‌కేస్‌లు, షేరింగ్‌లు ఉండవని ప్రదీప్ పంచ్ విసిరాడు. ఆ వెంటనే ఓ రొమాంటిక్ సాంగ్‌కి పవన్, రీతూలు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య రొమాన్స్, కెమెస్ట్రీ అదిరిపోయింది.
మీ ఇద్దరి మధ్య చాలా కెమెస్ట్రీ ఉంది.. నేనైతే పవన్‌నే చూస్తున్నా అంత బాగా చేశారని శ్రీదేవి మెచ్చుకుంది. మీ ఇద్దరి మధ్యా కెమెస్ట్రీ బాగా ఉంటుందని అనుకున్నాం కానీ వాళ్లు చెప్పింది ఇంకా చాలా తక్కువేనని శేఖర్ మాస్టర్ ప్రశంసించగా.. సదా అయితే స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ నుంచి వీరి డ్యాన్స్‌పై అభిప్రాయాలు తీసుకున్నారు. నాకైతే కొంచెం డ్యాన్స్ తగ్గినట్లుగా ఉందని అనిపించింది, ఓ కెమెస్ట్రీతో లాక్కుని వెళ్లారు. ఇది డ్యాన్స్ షో అని చురకలు వేసింది. దీనికి రీతూ కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఇది మాస్ సాంగ్ కదా దబాదబా చేయడానికి అని ప్రశ్నించింది. దబాదబా అని కొట్టేయమనలేదు.. బట్ స్టెప్పులు వేయాలని చెప్పాను అంతేనని ఆ నటి పేర్కొంది. ప్రస్తుతం ప్రోమో వైరల్ అవుతుండగా.. ఆ నటి వ్యాఖ్యలకు రీతూ, డిమోన్ పవన్‌లు ఎలా కౌంటర్ ఇచ్చారు. జడ్జిల నుంచి స్పందన ఎలా ఉంది అనేది తెలియాలంటే శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











