కనుసైగకే ముచ్చెమటలు... దివ్వెల మాధురి దెబ్బకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ గప్‌చుప్
Photo Courtesy: Star Maa
మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు దివ్వెల మాధురి. అంతకుముందే సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ వచ్చిన మాధురికి శ్రీనివాస్‌తో పరిచయం తర్వాత సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఈ దశలో దువ్వాడ ఫ్యామిలీలో గొడవలు, ఆయనపై భార్యాపిల్లలు విమర్శలు చేయడం, ధర్నాలు, ప్రెస్‌మీట్‌లతో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురిల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తర్వాత దివ్వెల మాధురి- శ్రీనివాస్‌లు పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు కలిసే జీవించడం జరుగుతోంది. అప్పట్లోనే వీరి బంధంపై ట్రోలింగ్ జరగ్గా.. నెటిజన్లకు, యూట్యూబర్లకు కౌంటర్ ఇచ్చేవారు మాధురి. ఇక టీవీలలో చర్చా కార్యక్రమాల్లో ఎవరైనా నోరుజారితే అక్కడే క్లాస్ పీకి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. ఇలాంటి క్యారెక్టర్స్‌కు బిగ్‌బాస్ లాంటి చోట చాలా అవసరమని భావించిన బిగ్‌బాస్ టీమ్ మాధురికి పలుమార్లు తమ షోలలో పాల్గొనాల్సిందిగా ఆఫర్ ఇచ్చింది. అయితే అన్ని రోజులు హౌస్‌లో తన భర్తను వదిలి ఉండలేనంటూ పలుమార్లు ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు మాధురి.

Photo Courtesy: Star Maa
ప్రతిసారి బిగ్‌బాస్ సీజన్ మొదలైన సమయంలో మాధురి గురించి రకరకాలుగా వార్తలు రావడం.. కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఆమె పేరు కనిపించడం మామూలుగా అయిపోతోంది. ఈ ఏడాది బిగ్‌బాస్ తెలుగు 9లోనూ దివ్వెల మాధురి పేరు తెరపైకి వచ్చింది. అయితే దీనికి మాధురి అంతే ఘాటుగా నో అని చెప్పేశారు. కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్ టీమ్ గట్టిగా ట్రై చేయడంతో మాధురి కూడా మనసు మార్చుకున్నారు. బిగ్‌బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మాధురి రెండు వారాల పాటు హౌస్‌లో ఉన్నారు.
వచ్చి రావడంతోనే అందరితోనూ గొడవలు పెట్టుకుని.. తనతో మాట్లాడాలి అంటేనే వణికిపోయేలా చేశారు. బిగ్‌బాస్ రూల్స్ కాదని తన సొంత రూల్స్ అమలు చేసి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. రెండు వారాలు కాగానే తన ఇష్ట ప్రకారం ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్‌తో మాధురి మరింత పాపులర్ అయ్యారు. కుటుంబ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యారు. దీంతో మాధురిని నెమ్మదిగా బుల్లితెర వైపు లాగుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆమెతో కొన్ని షోలు చేయించే ప్లాన్‌లో ఉన్నారు కొందరు. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో దివ్వెల మాధురి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ శోభా శెట్టి, రీతూ చౌదరి, యష్మి గౌడ, ప్రేరణ కంభం, నిఖిల్ మలియాక్కల్, నిఖిల్ నాయర్, ముక్కు అవినాష్, ప్రియాశెట్టి తదితరులతో కలిసి ఈ వారం షోలో అల్లరి చేశారు మాధురి. అలాగే తనపై పంచ్ వేయబోయిన ముక్కు అవినాష్‌ను భయపెట్టింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
తొలుత మీ జీవితమే ఓ పుస్తకమే మారిస్తే ఆ పుస్తకానికి మీరు పెట్టే పేరు ఏంటీ? అని శ్రీముఖి ఓ టాస్క్ ఇచ్చింది. ముందుగా యష్మి గౌడ రాగా.. ఆమెకు ఊర్వశివో రాక్షసివో మాత్రమే సెట్ అవుతుందని పంచ్ విసిరింది. దీని గురించి మీరు ఏమంటారు అని మాధురిని అడగ్గా.. ఆవిడ బుక్ ఆవిడ ఇష్టం అని చెప్పింది. తర్వాత శోభాశెట్టి నాకు కొంచెం తిక్కుంది, దానికొక లెక్కుంది అని తన పుస్తకానికి పేరు పెట్టింది. తర్వాత ఆ పుస్తకాన్ని అమ్మాల్సిందిగా శ్రీముఖి టాస్క ఇవ్వగా.. నా బుక్ ఎవరూ కొనడం లేదని యష్మి పంచ్ విసిరింది.
తర్వాత దివ్వెల మాధురి తన పుస్తకానికి.. ఓపెన్ హార్ట్ విత్ మాధురి అని పేరు పెట్టుకుంది. ఆ వెంటనే అవినాష్‌ని పిలిచి నువ్వయితే ఈ బుక్‌ని ఎంతపెట్టి కొనుక్కుంటావని శ్రీముఖి అడిగింది. అసలు నేను దీనిని అమ్మడం లేదు.. ఇంతలో అవినాష్ ఏదో పంచ్ వేయబోగా లెట్ మీ ఫినిష్ అంటూ మాధురి సీరియస్‌గా చూడటంతో అవినాష్ వణికిపోతాడు. అతని ముఖం చూసి మాధురి ఫక్కున నవ్వుకుంటుంది. రాజా ఈ బుక్ నీ కోసం అని చెబుతూ.. తనను శ్రీముఖి- అవినాష్‌లు ఇమిటేట్ చేసిన సంగతి గుర్తొచ్చి నవ్వుకుంటుంది. దాంతో అందరూ నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి కంటి చూపుతోనే మాధురి జనాన్ని కంట్రోల్ చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











