వివాదంలో బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. పుట్టిన రోజు నాడే పోలీసుల అదుపులోకి?
Divvela Madhuri: నిత్యం ఏదొక విషయంలో వార్తల్లో నిలిచే జంట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్- బిగ్ బాగ్ బాస్ ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి. తాజాగా గురువారం రాత్రి దివ్వెల మాధురి పుట్టినరోజు సందర్భంగా మొయినాబాద్‌లోని ది పెండెంట్ ఫామ్‌హౌస్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. పార్టీకి ఎలాంటి అనుమతులు లేకపోవడం, అలాగే విదేశీ మద్యం, హుక్కా పరికరాలు ఉపయోగిస్తున్నారనే స్పష్టమైన సమాచారంతో ఎస్ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ రైడ్ నిర్వహించినట్టు తెలుస్తోంది.
పోలీసుల తనిఖీలో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా సెట్లు స్వాధీనం చేసినట్లు ఆధికారిక సమాచారం వెలువడింది. పార్టీ నిర్వహణకు అవసరమైన అనుమతులు లేకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడంపై పోలీసులు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు కొందరు బంధువులు కూడా అక్కడే ఉన్నారని సమాచారం. తద్వారా వీరిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జంట గత కొంతకాలంగా పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. 2024లో శ్రీనివాస్ తన కుటుంబం నుంచి దూరమై మాధురితో సహాజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటపడటానికి ప్రధాన కారణం టెక్కలిలో శ్రీనివాస్ నివాసం ముందు ఆయన భార్యాపిల్లలు చేసిన ధర్నా చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ ఘటన తర్వాత మాధురి-శ్రీనివాస్ జంట పబ్లిక్‌గా తమ బంధాన్ని అంగీకరించి, కార్యక్రమాలకు కలిసి హాజరవుతూ ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నారు.
ఇక బిగ్‌బాస్ 9 షోలో దివ్వెల మాధురి వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ లో ఆమె తన మాట తీరుతో అందర్నీ షాక్ చేసింది. బిగ్ బాస్ హౌస్ ను ఆమెనే రూలింగ్ చేసింది. ఈ విషయం బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో కేవలం మూడు వారాల్లోనే బయటకు రావాల్సి వచ్చింది. షో తరువాత ఇచ్చిన రియాక్షన్ ఇంటర్వ్యూలు, యూట్యూబ్ టాక్ షోల్లో పాల్గొని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే పుట్టినరోజు వేడుకగా ఏర్పాటు చేసిన ఈ పార్టీ అక్రమంగా మారడంతో ఇప్పుడు ఈ జంట మరోసారి కాంట్రవర్సీలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.
బర్త్ డే వేడుకలను అనుమతులు లేకుండా నిర్వహించడం, మత్తు పదార్థాలు ఉపయోగించడం వంటి ఆరోపణలు బయటకు రావడంతో ఘటనపై పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉండగా, ఈ జంటపై ఏవైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.


Click it and Unblock the Notifications











