ఇమ్మాన్యుయేల్ లవ్‌స్టోరీ? ప్రియురాలి చేతిలో చెయ్యేసి.. షాకిచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
2025లో పలువురు సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు.. కొత్తగా ప్రేమలో పడినవారు ఉన్నారు, తమ ప్రేమను బహిర్గతం చేసినవారు, సీక్రెట్‌గా ప్రేమాయణాలు నడుతున్న వారు ఉన్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీరిలో బుల్లితెర నటులు, స్టార్స్ కూడా ఉన్నారు. తాజాగా తెలుగులో పాపులర్ షో జబర్దస్ద్ షో నుంచి బిగ్‌బాస్ వంటి టాప్ రియాలిటీ షోలో అడుగుపెట్టిన ఇమ్మాన్యుయేల్ కూడా తన లవ్‌స్టోరీపై అప్పట్లో హింట్ ఇచ్చి ఇప్పుడు తాజాగా ప్రియురాలిని పరిచయం చేసే పనిలో షాకిచ్చాడు ఈ వివరాల్లోకి వెళితే..
పటాస్ నుంచి బిగ్‌బాస్ వరకు
గుంటూరుకు చెందిన ఇమ్మాన్యుయేల్ ఓ పేద కుటుంబంలో పుట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ తనలో టాలెంట్‌ను నెటిజనంతో పంచుకునేవాడు. అలా ఓ రోజున ఇంట్లో ఉద్యోగ ప్రయత్నాల పేరు చెప్పి చేతిలో 500 రూపాయలతో హైదరాబాద్ వచ్చి స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగాడు. పటాస్ షోలో అవకాశం దక్కించుకుని తన పంచ్‌లతో ఇరగదీశాడు. పటాస్‌లో ఇమ్మూ స్కిట్స్‌కి మంచి గుర్తింపు రావడంతో అక్కడి నుంచి జబర్దస్త్‌లో అడుగుపెట్టాడు. అక్కడ లేడీ కమెడియన్ వర్షతో కెమెస్ట్రీతో పాటు లవ్‌ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. ఆ తర్వాత జాతిరత్నాలు, కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సహా తెలుగులో టాప్ షోలలో పాల్గొని మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.

చేజారిన బిగ్‌బాస్ కప్పు
ఈ దశలోనే బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని అందరినీ నవ్వించాడు. హౌస్‌లో స్టార్ కమెడియన్‌గా అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఏకంగా 9 వారాల పాటు అస్సలు నామినేషన్స్‌లో లేడంటే మనోడి ఆటను అర్ధం చేసుకోవచ్చు. బిగ్‌బాస్‌లో టైటిల్ గెలిచిన తొలి కమెడియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాలనుకున్న ఇమ్యాన్యుయేల్ 3rd రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్‌లో పాల్గొన్నందుకు గాను వారానికి 2.6 లక్షల రూపాయల చొప్పున... 15 వారాలకు గాను 40 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు ఇమ్మూ.
లవ్‌స్టోరీ చెప్పిన ఇమ్మాన్యుయేల్
అందరు అనుకున్నట్లు వర్షతో ఇమ్మాన్యుయేల్ లవ్ ట్రాక్ కేవలం స్కిట్స్ వరకే పరిమితం . కానీ ఇమ్మూ అసలు గర్ల్ ఫ్రెండ్ వేరే ఉందట. ఈ విషయాన్ని జబర్దస్త్‌లో ఉన్నప్పుడే బయటపెట్టాడు. కానీ ఆమె ఎవరు? ఏం చేస్తుంది? అనేది మాత్రం చెప్పలేదు. దీంతో ఇమ్మాన్యుయేల్ గర్ల్ ఫ్రెండ్ ఈవిడే అంటూ సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇమ్మాన్యుయేల్ అన్నయ్య వంశీ.. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు సంబంధించిన పలు హింట్స్ ఇచ్చారు. ఇమ్మూ ప్రేమలో ఉన్న మాట వాస్తవమే.. అలాగే ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలుసు. తను ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నారని, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలగకుండా ఉండటానికి ఇలా సీక్రెట్‌గా ఉంచుతున్నామని వంశీ చెప్పారు. తమ్ముడు బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చిన తర్వాత దీనిపై క్లారిటీ ఇస్తారని ఆయన తెలిపారు.
ప్రియురాలిని పరిచయం చేసిన ఇమ్మూ
గత ఆదివారం బిగ్‌బాస్ తెలుగు 9 ముగియగా.. ఇమ్మాన్యుయేల్ తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిసే పనిలో ఉన్నాడు. ఇన్ని రోజులు వారందరికీ దూరంగా ఉండటంతో అందరితోనూ గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తన లవ్‌స్టోరీని బయట పెట్టడంతో పాటు ప్రియురాలిని పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. అందులో హాలో మిస్టర్ లవ్ అంటూ ఓ షాపింగ్ మాల్‌లో ముఖానికి మాస్క్ వేసుకుని నిలబడిన ఇమ్మూ ఫోటోతో పాటు ఒక అమ్మాయి చేతిలో చెయ్యేసి ఉన్న ఫోటోలను ఇమ్మాన్యుయేల్ పంచుకున్నాడు. కానీ అందులో ఎక్కడా ఆమె పేరు కానీ, ముఖం కానీ చూపించలేదు. బహుశా త్వరలోనే ఇమ్మాన్యుయేల్ తన ప్రియురాలిని పరిచయం చేస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











