‘అందుకే బిగ్‌బాస్‌‌ నుంచి వెళ్లిపోయా... వాడికెంత బలుపు అంటే’

గతేడాది జరిగిన బిగ్‌బాస్ తెలుగు 9 కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులకు మరుపురాని అనుభూతుల్ని మిగిల్చింది. సెలబ్రిటీలు vs సామాన్యులు అన్నట్లుగా జరిగిన ఈ సీజన్‌లో సామాన్యుడు విజేతగా నిలిచాడు. అయితే సెలబ్రిటీలు కూడా టఫ్ ఫైట్ ఇవ్వడంతో ఈ సీజన్ పోటాపోటీగా జరిగింది. అయితే ఈ షో మధ్యలో కొందరు మధ్యలోనే సెల్ఫ్ ఎలిమినేట్ కావడం అప్పట్లో సంచలనం కలిగించింది. ముఖ్యంగా ఫోక్ సింగర్ రాము రాథోడ్ అర్ధాంతరంగా మధ్యలోనే వెళ్లిపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి దారి తీసిన కారణాలపై ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రాము. ఈ వివరాల్లోకి వెళితే..

మహబూబ్‌‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోపాలపూర్ తండాకు చెందిన రాము రాథోడ్‌కు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, రాయడం, డ్యాన్స్ చేయడం ఎంతో ఇష్టం. పాఠశాలలో నిర్వహించే సాంస్కృతి కార్యక్రమాలలో డ్యాన్స్ చేస్తూ అందరినీ మెప్పించేవాడు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటు పాటలు పాడటం, నృత్యాలతో ఎన్నో వేదికలను పంచుకున్నాడు. అనంతరం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి పాటలు రాస్తూ, పాడుతూ.. యూట్యూబర్‌గానూ సత్తా చాటాడు.

Bigg Boss Telugu 9 Fame Ramu Rathod Reveals Why He Quit the Show Midway

ఈ దశలో రాము రాథోడ్ ఆధ్వర్యంలో వచ్చిన రాను ముంబైకి రాను అనే ఫోక్ సాంగ్‌ తెలుగు ప్రజలను ఊపేసింది. ఏ పండగైనా, ఇంట్లో శుభకార్యమైనా ఖచ్చితంగా ఆ పాట ఉండాల్సిందే, డీజేలు బద్ధలవ్వాల్సిందే. ఈ పాటను రాము రాథోడ్ రాయగా.. కళ్యాణ్ కీస్ స్వరకల్పన చేశారు. ప్రభ, రాము కలిసి ఆలపించారు. కేవలం 3 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన రాను ముంబైకి రాను సాంగ్ ఇప్పటి వరకు దాదాపు 850 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని సంచలనం సృష్టించింది. ప్రేక్షకుల ఆదరణతో పాటు కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. ఈ ఒక్క సాంగ్‌తో రాము రాథోడ్‌కి బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం కల్పించింది.

బిగ్‌బాస్ తెలుగు 9లో సత్తా చాటుతూ.. ప్రేక్షకులను అలరించిన రాము రాథోడ్ దాదాపు 60 రోజులకు పైగా హౌస్‌లో ఉన్నాడు. అయితే అనూహ్యంగా తాను ఇక కొనసాగలేనంటూ హోస్ట్ నాగార్జున ముందే కన్నీటి పర్యంతం కావడంతో రాముని ఇంటికి పంపారు నాగ్. అయితే బిగ్‌బాస్‌ను వీడొద్దని నాగార్జునతో పాటు ప్రేక్షకులు, అభిమానులు కూడా రాముకి చెప్పి చూశారు... కానీ ఫలితం మాత్రం దక్కలేదు. బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చిన రాము రాథోడ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరిగి హల్‌చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో తేజస్వి మదివాడ హోస్ట్‌గా ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోకు లిఖితతో కలిసి హాజరయ్యారు రాము రాథోడ్. దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవల విడుదల చేశారు.

మీరిద్దరూ ఏం చదువుకున్నారు? చూడటానికి చాలా చిన్న పిల్లల్లా ఉన్నారని తేజస్వి అడగ్గా.. లిఖిత, రాములు సిగ్గుతో తలదించుకుంటారు. వయసు అడిగితే సిగ్గుపడే అబ్బాయిని నిన్నే చూశానని సెటైర్లు వేస్తుంది తేజస్వి. అసలు బిగ్‌బాస్ షో ఎందుకు వదిలేసి వెళ్లారు అని తేజస్వి అడగ్గా.. పేరెంట్స్ కోసమే. వాళ్లని చాలా మిస్ అయ్యాను, మైండ్‌లో వాళ్లు ఎలా ఉన్నారో కూడా గుర్తుకురావడం లేదు. మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న 250 రోజు కూలీకి వెళ్లేవాడు. మా అమ్మ కూడా 100 రూపాయల కూలీ కోసం మా నాన్నతో పాటు వెళ్లేది. తినడానికి కూడా సరిగా లేని సిట్యూయేషన్ అది అని రాము తెలిపారు.

ఇంత సక్సెస్ ఇచ్చిన సొసైటీయే ఈరోజు ఏం మాట్లాడుకుంటోంది అంటే అంటూ రాము ఎమోషనల్ అయ్యాడు. నేను ఇప్పుడు కనీసం సరిగా ఇక్కడ కూర్చోలేకపోతున్నాను. వాడిని చూడరా వాడికెంత బలుపు అనే మాటలు మాట్లాడేవారు. గేటు ముందు నిలబడాలి.. అంత టైం లేదు నాకు కొడితే ఈరోజు ఇక్కడ కూర్చోవాలి. మా నాన్న నన్ను చూసి నువ్వు మా దేవుడివి రా అన్నారని రాము గుర్తుచేసుకుని బాధపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. రాము, లిఖితలు చెప్పిన సంగతులు తెలుసుకోవాలంటే ఈ నెల 18వ తేదీన ప్రసారమయ్యే కాకమ్మ కథలు ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more about: bigg boss telugu ramu rathod
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X