రీతూ చౌదరిని అలా బ్లాక్‌మెయిల్.. మాజీ భర్త శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 9లో టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుందని అనుకున్న బుల్లితెర నటి రీతూ చౌదరి 13వ వారంలో ఎలిమినేట్ కావడంతో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆమె అభిమానులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. డిమోన్ పవన్‌తో క్లోజ్‌గా ఉండటం, ఆమె ఆటతీరు, నెగిటివిటీ కారణంగానే రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదే సమయంలో రీతూ చౌదరి పెళ్లి, విడాకులు, ఆమెపై ఉన్న పలు వివాదాలు తెరమీదకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రీతూ చౌదరి మాజీ భర్త శ్రీకాంత్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

700 కోట్ల ల్యాండ్ స్కాంలో రీతూ పేరు
జబర్దస్త్, తదితర కార్యక్రమాలు, సీరియల్స్‌తో తెలుగునాట పాపులరైన రీతూ చౌదరి.. 2022 ప్రాంతంలో తాను శ్రీకాంత్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అతనితో కలిసున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పెళ్లికూతురిగా రెడీ అయిన ఫోటోలు కూడా బయటికొచ్చాయి. కానీ రీతూ మాత్రం తన పెళ్లిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే బెట్టింగ్ యాప్ కేసుతో పాటు ఏపీలో 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో రీతూ చౌదరి పేరు తెరపైకి రావడంతో శ్రీకాంత్‌తో తాను రిలేషన్‌లో ఉన్నానని, కానీ విడిపోయామని చెప్పింది. ఈ సమయంలోనే రీతూ చౌదరి, శ్రీకాంత్ వేరు వేరు ఇంటర్వ్యూలలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓ ఛానెల్‌తో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే..

Bigg Boss Telugu 9 fame Rithu Chowdary s Ex-Husband Srikanth viral interview Resurfaces

అలా రీతూతో విడిపోయా
ఏసీబీ రైడ్ దగ్గరి నుంచి రీతూ చౌదరికి, నాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఏసీబీ వాళ్లు లేనిపోనివి చెప్పారు, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఏ ఆడపిల్లయినా భయపడుతుంది. పెళ్లి చేసుకున్నాక ఒక సంవత్సరానికే ఏసీబీ రైడ్ జరిగే వరకు రీతూ, నేనూ బాగానే ఉన్నాం. ఏసీబీ రైడ్ జరిగిన రోజు నుంచే రీతూకి, నాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. శ్రీకాంత్ జైలుకి వెళ్లిపోతాడు, పర్మినెంట్‌గా రాడు అని బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారు. ఆ రోజు నుంచి రీతూకి నాకు మాటల్లేవు. ఆ తర్వాత ఓ రెండు మూడు నెలలు మాట్లాడుకున్నాం. నాకైనా భయం ఉంటుంది, ఆ అమ్మాయికైనా భయం ఉంటుంది అని శ్రీకాంత్ చెప్పాడు.

రీతూ చౌదరికి స్కాంతో సంబంధం లేదు
రీతూ చౌదరికి ల్యాండ్ స్కాంకు ఎలాంటి సంబంధం లేదు. రీతూ అనే వ్యక్తికి వీళ్లెవరూ కూడా తెలియదు. మహా అయితే ఆఫీసుల్లో ఒకటి రెండు సార్లు కలిసుంటాం. నాకు పూర్వం నుంచి ఉన్న ఆస్తులు, నేను కొనుక్కున్నవి చిన్న చిన్న ఆస్తులే. కొంటాను, అమ్ముతాను.. ఏదైనా లిటిగేషన్ ఉంటే ఎవరితోనైనా చెప్పించి సెటిల్ చేసుకుంటాను. కేసులో భాగంగా నా ఆస్తులన్నీ ఫ్రీజ్ చేసేశారు.. వాటిని విడిపించాలనే నేను కోరుకున్నా. కష్టపడి సంపాదించుకున్నాను.. నాకు ఈ ఇబ్బందులు, కేసులు వద్దు. నన్ను ఇబ్బందులకు గురిచేశారో నాకు తెలుసు అని శ్రీకాంత్ తెలిపాడు.

ఐటీ డిపార్ట్‌మెంట్ దగ్గర డేటా
నా ఆధార్‌కి పాన్‌కార్డ్ లింకై ఉంది. ఆల్రెడీ ఇన్‌కం ట్యాక్స్ పే చేస్తున్నాను, చివరి రెండేళ్ల నుంచి ఏసీబీ ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది కాబట్టి నేను ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేయలేదు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఇన్‌కం ట్యాక్స్ పే చేశాం. కావాలంటే మీరు ఐటీకి లెటర్ రాసి నాకు సంబంధించిన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్, మా నాన్నగారి రిటర్న్స్ తెప్పించుకోండి. పార్టిషన్ డాక్యుమెంట్ జరుగుతున్నప్పుడు నలుగురు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఆ తర్వాత అమ్మినప్పుడో? కొన్నప్పుడో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. 65 లక్షల రూపాయల ప్రాపర్టీ విషయానికి వస్తే చీమకుర్తి కామేశ్వరమ్మ మా బామ్మగారు మా నాన్నగారికి ఇచ్చిన పార్టిషన్. దొంగతనం, ఫ్రాడ్స్ చేస్తే నా కుటుంబ సభ్యుల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాను. మా నాన్నగారి దగ్గరి నుంచి నాకొచ్చిన ఆస్తిని రీతూకి కేవలం పవర్ మాత్రమే ఇచ్చానని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X