‘బిగ్‌బాస్‌కు వెళ్తే శాశ్వతంగా బయటే!' - భర్తపై సంజన షాకింగ్ కామెంట్స్
బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో హై వోల్టేజ్ ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్ సంజన ( Sanjana Galrani) మరోసారి వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ లో తొలి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, తన దూకుడు, వ్యూహాలు, మాటల యుద్ధాలతో గేమ్‌కు పేస్ ఇచ్చింది సంజన.. టైటిల్ దక్కకపోయినా టాప్ 5 వరకు చేరి గేమ్ ఛేంజర్‌గా గుర్తుండిపోయింది. చంటి బిడ్డను ఇంట్లో వదిలేసి హౌస్‌లోకి అడుగుపెట్టినా, ఎక్కడా సింపతి కార్డు ఆడకుండా పూర్తిగా గేమ్‌పై ఫోకస్ పెట్టిన తీరు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. 'గుడ్డు దొంగతనం' టాస్క్ నుంచి చివరి దశ వరకు ఆమె ప్రయాణం ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకుంది.
ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజన తన బిగ్‌బాస్ జర్నీతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.'బిగ్‌బాస్ అనేది ఒక గొప్ప అవకాశం. మన నిజమైన క్యారెక్టర్ ఏంటో ప్రపంచానికి తెలిసే వేదిక అది. సినిమా లేదా సీరియల్ చేస్తే ఒక పాత్ర వరకే మనల్ని చూస్తారు. కానీ బిగ్‌బాస్‌లో దాదాపు 100 రోజులు మన జీవితం, ఆలోచనలు, ప్రవర్తన అన్నీ బయటపడతాయి' అని సంజన చెప్పింది.

అయితే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లో వచ్చిన రియాక్షన్ ఏంటీ అని ప్రశ్నించగా.. 'మొదట ఆఫర్ విషయం నా భర్తకు చెప్పాను. ఆయన నవ్వుతూ 'అవునా... అయితే ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి వెళ్లిపో' అని కామెంట్ చేశాడు' అంటూ ఫన్నీగా వెల్లడించింది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, వారిని విడిచిపెట్టి వెళ్లడం చాలా పెద్ద ఛాలెంజ్‌గా మారిందని సంజన భావోద్వేగంగా చెప్పింది. 'బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు పిల్లలను చాలా మిస్ అయ్యాను. టెన్షన్ వల్ల దాదాపు 10 కిలోల వరకు బరువు తగ్గాను. భర్తకు దూరంగా ఉండగలుగుతాం కానీ పిల్లలకు దూరంగా ఉండడం చాలా కష్టం. అది నాకు అగ్ని పరీక్షలా అనిపించింది' అంటూ ఎమోషనల్ అయ్యింది.
షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పిల్లల కోసం ఎంత ఆత్రుతగా ఉంటున్నానో చెబుతూ సంజన ఫన్నీ కామెంట్స్ చేసింది. 'ఇప్పటికీ పిల్లలకు అబద్ధమే చెబుతున్నా. 'బేస్మెంట్‌లో ఉన్నా.. బయటకు వచ్చా.. అరగంటలో వస్తా' అని చెప్పి... బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్నా.. హైదరాబాద్-బెంగళూరు నాకు జూబ్లీహిల్స్-బంజారాహిల్స్‌లా మారిపోయాయి' అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ జర్నీ తన జీవితానికి వరంలా మారిందని సంజన తెలిపింది. 'జీవితంలో ఏది వచ్చినా నేను ఛాలెంజ్‌లాగానే తీసుకుంటా. ఎవరు ఇబ్బంది పెట్టినా 'రేపు సిచువేషన్ మారిపోతుంది' అని లైట్‌గా తీసుకుంటా. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకునే వ్యక్తిని కాదు' అంటూ తన పాజిటివ్ మైండ్‌సెట్‌ను వివరించింది.
భవిష్యత్తులో పాన్ ఇండియా లెవెల్ బిగ్‌బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? అని అడగ్గా... 'తప్పకుండా... మా ఆయన పర్మిషన్ ఇస్తే!' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. వెంటనే'అయితే ఆయన ఇక 'ఇంటికి రాకు' అని వార్నింగ్ కూడా ఇస్తారు" అంటూ ఫన్నీగా చెప్పింది. బిగ్‌బాస్ తర్వాత మళ్లీ కెరీర్‌లో బిజీగా మారిపోయానని సంజన తెలిపింది. ప్రస్తుతం సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నానని చెప్పింది. అలాగే స్కూల్ బిజినెస్‌ను ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నానని వెల్లడించింది. సోషల్ మీడియాలో యాడ్స్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ వరుసగా వస్తున్నప్పటికీ... తన మనసుకు నచ్చిన ఆఫర్లనే ఎంపిక చేసుకుంటానని స్పష్టం చేసింది.
ఇక తన చెల్లెలు నిక్కీ గల్రానీ గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడింది. 'బిగ్‌బాస్‌కు సైన్ చేసినప్పుడు ఆమె చాలా కోపంగా ఉంది. 'చిన్న పిల్లలు ఉన్నారు, ఎందుకు వెళ్తావు?' అంటూ ఘోరంగా తిట్టింది. మా అమ్మ కూడా అంత తిట్టలేదు. కానీ నా పర్ఫామెన్స్ చూసాక ఆమె చాలా ఇంప్రెస్ అయింది. 'కప్పు గెలిచిరా' అంటూ బిగ్‌బాస్ టీంకు వీడియో కూడా పంపించింది' అని వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. బాగ్‌బాస్ 9 సంజనకు కేవలం ఒక రియాలిటీ షో కాదు.. ఆమె జీవితాన్ని కొత్త దిశగా మలిచిన టర్నింగ్ పాయింట్. భర్త వార్నింగ్‌ల నుంచి కుటుంబ సపోర్ట్ వరకు, పిల్లల కోసం పడిన తపన నుంచి కెరీర్ రీ స్టార్ట్ వరకు.. ఏదిఏమైనా..బిగ్ బాస్ హౌస్ లో సంజన జర్నీ ప్రేక్షకులకు ఓ ఇన్‌స్పిరేషన్ అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











