బిగ్‌బాస్ ఓటమి తర్వాత ... కళ్యాణ్ పడాలతో తనూజ, ఎవరూ దిష్టి పెట్టొద్దంటూ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా పవన్ కళ్యాణ్ పడాల.. రన్నరప్‌గా తనూజ పుట్టస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ తాజా సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వ్యవహరించిన వారంతా ఏదో ఒక ప్రోగ్రామ్‌లో సందడి చేస్తూనే ఉన్నారు. అలాగే కళ్యాణ్ పడాల కూడా ఆదివారం విత్ స్టార్ మా ప్రోగ్రామ్‌లో అలరించాడు. అయితే తనూజ మాత్రం ఇంత వరకు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఓ షోలో తనూజ పుట్టస్వామి సందడి చేసింది. అది కూడా కళ్యాణ్‌తో కలిసి కావడంతో అంతా సంతోషిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్టార్ మా సరికొత్తగా రెడీ అయ్యింది. మా సంక్రాంతి వేడుక పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. జనవరి 14వ తేదీన మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో బుల్లితెర స్టార్స్ సందడి చేశారు. ఈటీవీ ప్రభాకర్, నిరూపమ్ పరిటాల, రోహిణి రెడ్డి, శోభాశెట్టి, సుహాసిని, నిఖిల్ మలియాక్కల్, అమర్‌దీప్ చౌదరి, తేజస్వినీ గౌడ, యాదమ్మ రాజుతో పాటు బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ దివ్వెల మాధురి, రమ్య మోక్ష, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, రీతూ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు.

Bigg Boss Telugu 9 Fame Thanuja Puttaswamy Returns to Screen with Kalyan Padala in Star Maa Sankranti Special

ప్రోమో స్టార్టింగ్‌లోనే తనూజ పుట్టస్వామి.. క్వీన్‌లాగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ ప్రభాకర్, నిరూపమ్‌లు స్టైలీష్‌గా కళ్లజోళ్లు పెట్టుకుని వచ్చారు. ముక్కు అవినాష్ .. భీమవరం రాజులాగా, హరి అతనికి గన్‌మెన్‌లా ఎంట్రీ ఇచ్చారు. మాధురి గారు మీరు నేను అని అవినాష్ పంచ్ విసురుతుండగా... పక్కన డమ్మీ గన్ ఉందేమో, మా పక్కన ఒరిజినల్ గన్స్ ఉన్నాయని దువ్వాడ మాధురి పంచ్ విసిరింది. హౌస్‌లో ఉన్నట్లు మా రాజుగారి ముందు ఉండొద్దని హరి చెబుతుండగా.. గన్ పనిచేస్తుందా అని మాధురి సెటైర్లు వేసింది. ఈటీవీ ప్రభాకర్- నిరుపమ్‌లని పెట్టి నెక్ట్స్ సంక్రాంతి సినిమా తీస్తే 100 కోట్లు, వెయ్యి కోట్లు వస్తాయని హరి చెప్పగా... వీరిద్దరికీ హీరో తండ్రి క్యారెక్టర్ ఓకే, మరి హీరోలు ఎవరు అని అవినాష్ నవ్వించాడు.

ఆ తర్వాత నిఖిల్‌ని పిలిచి ఈ అబ్బాయిని పెట్టుకుని ఒక మంచి బ్రేకప్ స్టోరీ తీస్తే అదిరిపోతుందని శ్రీముఖి పంచ్ విసిరింది. ఇక పడాల పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్‌లను హీరోగా పెడితే మన దగ్గర మంచి టైటిల్ ఉంది. అన్నయ్యకి ఆశీస్సులు- తమ్ముళ్లకి సూట్‌కేసులు అని హరి చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఆ వెంటనే తన భార్యని పరిచయం చేశారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. అసలు ఈ కలయిక ఎప్పుడు మొదలైందని శ్రీముఖి ప్రశ్నించగా... నిన్ను, నన్ను నాగ్ సార్ రెండు చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు కదా. నీ చేయి ఒకరి చేతిలో, నా చేయి ఈమె చేతిలో పెట్టారు అని రాహుల్ ఆన్సర్ ఇచ్చాడు.

ఆ తర్వాత ఛాంపియన్ మూవీలోని గిర గిర సాంగ్‌కి పడాల పవన్ కళ్యాణ్ - తనూజ పుట్టస్వామిలు స్టెప్స్ వేస్తూ ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అంతా అరుపులు, ఈలలతో గోల గోల చేశారు. మీ ఇద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదని ఇమ్మాన్యుయేల్ దిష్టి తీస్తాడు. వాళ్లకి ఫస్ట్ నీ దిష్టే తగిలేలా ఉందని హరి పంచ్ విసురుతాడు. ఆ కాసేపటికే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వేదిక మీదకి వచ్చారు. అనిల్ ఏంటీ సంగతి అంటూ ఆయనపై అవినాష్ చేయి వేయడంతో అంతా షాకయ్యారు. ఆ తర్వాత అన్నా.. ఇదేమీ మనసులో పెట్టుకోవద్దంటూ అనిల్ రావిపూడి కాళ్లకు దండం పెట్టాడు అవినాష్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... కళ్యాణ్ గురించి తనూజ ఏం చెప్పింది? అనిల్ రావిపూడి ఎలా సందడి చేశారు? భీమవరం రాజుగారు ఎవరితో సినిమా తీస్తున్నారు? తెలియాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X