Bigg Boss Telugu 9 Finale Rating: చరిత్ర సృష్టించిన బిగ్‌బాస్ తెలుగు 9 ఫినాలే.. టాప్ రేటింగ్ ఎంతంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ఘనంగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ షో నిర్విరామంగా 105 రోజులపాటు నాన్ స్టాప్ వినోదాన్ని పంచింది. ఈ సీజన్‌ ఫినాలే డిసెంబర్ 21 తేదీన ఘనంగా ముగిసింది. ఈ సీజన్‌లో మధురమైన అనుభూతులను పంచడమే కాకుండా అరుదైన సంఘటనలను బిగ్‌బాస్ చరిత్రలో నమోదు చేసింది. ఈ సీజన్ సాధించిన రికార్డు గురించి నాగార్జున ఏం చెప్పారంటే..

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ విషయానికి వస్తే.. సెలబ్రిటీలు, కామన్ మ్యాన్ క్యాటగిరిల ద్వారా కంటెస్టెంట్లు ఇంటిలోకి అడుగుపెట్టారు. తెర మీద రాణించిన సెలబ్రిటీలు మాత్రం కామన్ మ్యాన్ చూపించిన ప్రతిభ ముందు తేలిపోయారు. ఆద్యంతం కామన్ మ్యాన్ కేటగిరి ఆటగాళ్లు మాత్రం డామినేషన్ ప్రదర్శించడమే కాకుండా కల్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. టాప్ 5 లో ఇద్దరు కామన్ మ్యాన్స్ ఉండటం విశేషంగా మారింది.

Bigg Boss Telugu 9 Finale Rating

అయితే సెలబ్రిటీలతో కళకళలాడే ఈ షో ఈ సారి మాత్రం ఎక్కువగా కామన్ మ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. వారు ఆట తీరు అనేక మందిని టెలివిజన్, బుల్లితెరకు అతుక్కొని పోయేలా చేసింది. దాంతో ప్రతీ వారం మెరుగైన రేటింగ్‌ను నమోదు చేసింది. ఇక ఫినాలే మాత్రం ఎవరూ ఊహించని విధంగా టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

నాగార్జున అక్కినేని తన బిగ్‌బాస్ తెలుగు రేటింగ్ గురించి ట్వీట్ చేస్తూ ఎవరూ ఢీ కొట్టలేనంతగా, ఎవరూ చేరుకోలేని విధంగా టీఆర్పీ సాధించాం. బిగ్‌బాస్ తెలుగు ఫినాలే అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. 9వ సీజన్ 19.6 టెలివిజన్ రేటింగ్ (TVR) సాధించింది. గత 5 సీజన్లలో బిగ్గెస్ట్ ఫైనల్‌గా ఓ ఘనతను సాధించింది. ఈ సీజన్‌ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను ఎమోషన్స్‌తో, ప్యాషన్, వివాదాలు, ఎన్నటికీ మరిచిపోలేనుటువంటి సంఘటనలు అందించింది అని పేర్కొన్నారు.

ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకోవడానికి కారణమైన ప్రతీ కంటెస్టెంట్, డెడికేటెడ్ స్టార్ మా, జియో హాట్ స్టార్, ఎండెమాల్ షైన్ ఇండియా టీమ్‌కు హృదయపూర్వకమైన థ్యాంక్స్. ఈ జర్నీలో అందరికంటే ముఖ్యమైన వారు ప్రేక్షకులు. వారు చూపించిన ప్రేమ, వెలకట్టలేని సపోర్ట్ వల్లే ఈ సీజన్‌ను చారిత్రాత్మకంగా మార్చింది అని నాగార్జున ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X