Bigg Boss 9 Telugu Finale Voting: నరాలు తెగే ఉత్కంఠ.. ఫినాలే ఓటింగ్‌లో భారీ మార్పులు.. టైటిల్ విన్నర్ ఫిక్స్ ?

Bigg Boss 9 Telugu: అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9. ఈ రియాలిటీ షో ఇప్పుడు క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. దాదాపు మూడు నెలలుగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. భావోద్వేగాలు, గొడవలు, టాస్క్‌లతో రసవత్తరంగా సాగిన ఈ సీజన్‌కు ఈ ఆదివారంతో (డిసెంబర్ 21) ఎండ్ కార్డు పడుతోంది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కాగా, టైటిల్ విన్నర్ ఎవరు అన్న ప్రశ్నే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..

టాప్-5 కంటెస్టెంట్స్... చివరి పోరు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టారు. వారు తమదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఈ క్రమంలో ఎన్నో ట్విస్టులు, టర్న్‌స్ తో ముందుకు సాగారు. ఈ క్రమంలో వరుసగా ఎలిమినేట్ అయ్యారు. చివరకు తనూజ, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, సంజన టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచారు. వీరంతా బిగ్‌బాస్ కప్ కోసం హోరాహోరీగా పోటీపడుతున్నారు. ఫినాలేకు ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉండటంతో, ఓటింగ్ ట్రెండ్స్‌పై ప్రేక్షకుల ఫోకస్ పడింది.

Bigg Boss Telugu 9 Finale Voting Shocking Twist in Kalyan Thanuja Votes Is the Title Winner Almost Fixed

ఓటింగ్ ట్రెండ్స్ లో ఎవరు ముందున్నారు?
సోషల్ మీడియా ట్రెండ్స్, అన్-ఆఫీషియల్ పోల్స్‌ను పరిశీలిస్తే ప్రస్తుతం కళ్యాణ్ పడాల భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట తనూజ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినా, ఫైనల్ వీక్‌లో పరిస్థితి పూర్తిగా మారినట్లు సమాచారం. అంచనాల ప్రకారం కళ్యాణ్‌కు సుమారు 42 శాతం ఓట్లు, తనూజకు 30 శాతం ఓట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డిమోన్ పవన్‌కు 14 శాతం, ఇమ్మానుయేల్ కు 10 శాతం, సంజనకు 4 శాతం ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. డిమోన్ పవన్ అనూహ్యంగా మూడో స్థానానికి ఎగబాకగా, ఒకప్పుడు విజేతగా చెప్పుకున్న ఇమ్మానుయేల్ ప్రస్తుతం నాలుగో స్థానానికి పరిమితమైనట్లు తెలుస్తోంది.ఇక సంజన ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఈ లెక్కన చూస్తే, బిగ్‌బాస్ 9 టైటిల్ పోరు ప్రధానంగా కళ్యాణ్ పడాల- తనూజ మధ్యే నెక్ టు నెక్ ఫైట్‌గా మారిందని చెప్పవచ్చు.

ఫైనల్ వీక్ టాస్క్‌లు.. ఎమోషనల్ గేమ్స్..
ఫినాలే వీక్‌లో బిగ్‌బాస్ 'వన్స్ మోర్' కాన్సెప్ట్‌తో పాత టాస్క్‌లను తిరిగి ఇచ్చి, హౌస్‌మేట్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. బెలూన్ టాస్క్, 'పిక్ ది బోన్' వంటి టాస్క్‌ల్లో పోటీ తారాస్థాయికి చేరింది. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది డే' అవార్డు, కుటుంబ సభ్యుల వీడియో సందేశాలు, కంటెస్టెంట్ల బిగ్‌బాస్ జర్నీ వీడియోలు వంటి హౌస్‌లో భావోద్వేగ వాతావరణాన్ని నెలకొల్పాయి. చాలామంది కంటెస్టెంట్లు తమ ప్రయాణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.

ఫ్యాన్స్ క్యాంపెయిన్లు... చివరి ప్రయత్నం
తనూజ అభిమానులు ఆమెను బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలి మహిళా విజేతగా నిలబెట్టాలనే లక్ష్యంతో సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ క్యాంపెయిన్ మాత్రం సైలెంట్‌గా కనిపించినా, ఓటింగ్‌లో అతడికి వస్తున్న ఆధిక్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చివరి క్షణంలో ఏ చిన్న మార్పు జరిగినా ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉండటంతో, అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

గ్రాండ్ ఫినాలే హైలైట్స్
డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటల నుంచి బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరగనుంది. ఈ ఫినాలే ఎపిసోడ్‌లో సినీ తారల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్‌లు, స్పెషల్ యాక్ట్స్, ఫైనలిస్టుల జర్నీ వీడియోలు ప్రేక్షకులను మరోసారి భావోద్వేగానికి గురిచేయనున్నాయి. అంతేకాదు, గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి లేదా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ రాబోతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఎవరు వచ్చిన బిగ్ బాస్ షో టీఆర్పీ రేటింగ్స్ బ్రేక్ అవ్వాల్సిందే. ఈ సారి కంటెంట్, ఎమోషన్స్, టాస్క్‌లు, ట్విస్టులతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక టైటిల్ ఎవరి చేతికి చేరుతుందో తెలుసుకోవాలంటే ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే. నరాలు తెగే ఉత్కంఠ మధ్య, ఈసారి బిగ్‌బాస్ కప్ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X