Bigg Boss Telugu 9: రోజురోజుకు మారుతున్న లెక్కలు.. బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు చేరువవుతుంది. మరో రెండువారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనున్నది. దీంతో బీబీ హౌస్‌లో వాతావరణం తార స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ రియాలిటీ షో 13వ వారం చివరిదశలోకి ప్రవేశించగా, టికెట్ టు ఫినాలే టాస్క్‌లు కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో విజేత ఎవరు కానున్నారు? రన్నర్ ఎవరు? అన్న దానిపై ప్రేక్షకుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అలాగే.. గ్రాండ్ ఫినాలే డేట్ ఏంటి? మరోవైపు ఈసారి గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించబోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ చీఫ్ గెస్ట్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది.ఎన్నాడూ ఊహించని ట్విస్టులు, టర్న్స్ ఉత్కంఠభరితంగా మార్చేసింది. ఇక ఫైనల్స్ కు ఇంకా రెండు వారాలు మాత్రమే టైమ్ ఉంది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 21 న జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కప్ ఇవ్వడానికి వచ్చే గెస్ట్ ఎవరు అన్న విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. గత సీజన్ లో గ్రాండ్ ఫినాలేకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. నిఖిల్ విన్నర్ అవ్వగా.. చరణ్ చేతుల మీదుగా కప్పు అందుకున్నాడు. ఇక ఈసారి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారనేది ? ఉత్కంఠంగా మారింది.

గత సీజన్‌లో గ్రాండ్ ఫినాలేకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హాజరై కప్ అందించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తారన్న టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి బిగ్‌బాస్ సీజన్‌లతో ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. సీజన్ 3, సీజన్ 4 ఫినాలేలకు కూడా అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో కూడా మెగాస్టార్ రాబోతున్నారని సమాచారం.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. మెగాస్ఠార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'.ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది. ప్రమోషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ ఫినాలేలో పాల్గొని ప్రమోషన్‌కు ఉపయోపడే అవకాశం ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే.. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
సీజన్ 9 విన్నర్ ఎవరు?
ఇదిలాఉంటే.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో పోటీ రసవత్తర దశకు చేరుకుంది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన, తనూజా, కళ్యాణ్, భరణి వంటి స్టాంగ్ కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. ఆడియన్స్ అంచనా ప్రకారం ఈసారి టైటిల్ రేస్‌లో పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్,తనుజా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇంకా రెండు వారాల్లో ఈ అంచనాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం కూడా ఉందని బిగ్ బాస్ విశ్లేక్షకులు భావిస్తున్నారు.
అదే సమయంలో ఈ సారి బిగ్ బాస్ ఫినాలేకు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? అనే చర్చనీయంగా మారింది. అయితే.. బిగ్ బాస్ 13 ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే ఉత్కంఠగా మారింది. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారన్న అంచనాలున్నాయి. డబుల్ ఎలిమినేషన్ జరిగితే సంజన కూడా బయటకు వెళ్లే అవకాశం ఉందని టాక్. ఫైనల్‌గా... బిగ్ బాస్ ఫినాలేకు చేరువవుతున్న కొద్దీ మరింత ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. విజేత ఎవరు? టాప్ 5లో ఎవరు నిలుస్తారు? ఫినాలేలో చీఫ్ గెస్టుగా చిరంజీవి పాల్గొంటారా? అనే ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.


Click it and Unblock the Notifications











