ఆ షోలో ఎదురుపడ్డ దివ్వెల మాధురి- రీతూ చౌదరి.. నా రాజా అంటూ శ్రీముఖి పంచ్‌లు
Photo Courtesy: Star Maa
ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్‌బాస్ షోలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఎంటర్‌టైనర్స్‌తో పాటు ఫైర్‌బ్రాండ్స్ కూడా ఉంటారు. ఇండియాలో బిగ్‌బాస్ టెలికాస్ట్ అవుతున్న ఏ భాషలోని ఏ సీజన్ తీసుకున్నా ఖచ్చితంగా ఫైర్‌బ్రాండ్ అనే వారు ఉంటారు. వీరి తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా అందరితో గొడవ పడుతుంటారు. ఎవరైనా ఎదురు తిరిగితే నోరేసుకుని విరుచుకుపడిపోతారు. అయితే ఇద్దరు ఫైర్‌బ్రాండ్స్ అనదగ్గవారు పోట్లాడుకుంటే.. హౌస్ హీటెక్కిపోతుంది.
ఫైర్‌బ్రాండ్స్‌గా మాధురి - రీతూ
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో ఫైర్‌బ్రాండ్స్ అనిపించుకున్నారు దివ్వెల మాధురి, రీతూ చౌదరి. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి హౌస్‌లో ఉన్నారు రీతూ.. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మధ్యలో హౌస్‌లో అడుగుపెట్టారు దివ్వెల మాధురి. మామూలుగానే మాధురి బయట ఫైర్‌బ్రాండ్ అని పేరు తెచ్చుకున్నారు. ఎవరినైనా కడిగి పారేస్తారని ఆవిడకు పేరు. అలాంటి వ్యక్తి బిగ్‌బాస్‌లో అడుగుపెడితే వాతావరణం ఎలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Photo Courtesy: Star Maa
బిగ్‌బాస్‌లో మాధురి vs రీతూ చౌదరి
రావడం రావడంతోనే దివ్య నిఖితతో ఫుడ్ విషయంలో గొడవ పడ్డారు మాధురి. ఆ వెంటనే సంజనా, రాము రాథోడ్‌లపై విరుచుకుపడి తన పంతం నెగ్గించుకుంది. దాంతో మిగిలిన వారు ఈమెతో మనకెందుకులే అని సైలెంట్ అయ్యారు. అయితే రీతూ దగ్గరికి వచ్చేసరికి నువ్వా నేనా అన్నట్లు మాధురితో గొడవపడింది. ఈ విషయంలో రీతూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మాటకు మాట బదులిస్తూ మాధురిని కంట్రోల్ చేసింది. దాంతో రీతూ చౌదరికి కూడా కాస్త క్రేజ్ పెరిగింది.
రీతూ - పవన్ బాండింగ్‌పై మాధురి వ్యాఖ్యలు
అయితే ఆ తర్వాత మాధురి ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక డిమోన్ పవన్ - రీతూ చౌదరిలు క్లోజ్‌గా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాధురి. రీతూ తల్లి.. నాకు ఫోన్ చేసి పవన్‌తో దూరంగా ఉండమని నా కూతురికి చెప్పమని అన్నారని బాంబు పేల్చింది మాధురి. అయితే రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యాక.. మీడియా ఇదే ప్రశ్న అడగ్గా నేను ఇంత వరకు దివ్వెల మాధురితో మాట్లాడలేదని కౌంటర్ ఇచ్చారు రీతూ తల్లి. దాంతో మాధురి- రీతూల మధ్య ఎలిమినేషన్ అయ్యాక కూడా వివాదం నడుస్తోందని ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు.
పవన్- రీతూలను ఇమిటేట్ చేసిన శ్రీముఖి
అలాంటి రీతూ చౌదరి - దివ్వెల మాధురిలు ఇప్పుడు ఓ టీవీ ప్రోగ్రామ్‌లో ఎదురుపడ్డారు. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో దివ్వెల మాధురి, రీతూలు అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రోమో స్టార్టింగ్‌లో రీతూ చౌదరిలా శ్రీముఖి .. డిమోన్ పవన్‌లా ముక్కు అవినాష్‌లు ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్ చేశారు. అలాగే బిగ్‌బాస్‌లో పవన్, రీతూలు చేసినట్లుగా వీరిద్దరూ ఇమిటేట్ చేసి నవ్వించారు. శ్రీముఖి కోప్పడగా.. అవినాష్ హిప్స్ తీసి డిమోన్ పవన్‌ను దించేశాడు.
నా రాజా అంటూ శ్రీముఖి పంచ్‌లు
ఆ తర్వాత రాజా నీకోసం ఒక పాట.. కరిగిపోయాను కర్పూర వీణలా అంటూ దివ్వెల మాధురి - దువ్వాడ శ్రీనివాస్‌లను ఇమిటేట్ చేశారు శ్రీముఖి - అవినాష్. నా రాజాను చూస్తుంటే ఒక మాట గుర్తొస్తోంది మాధురి గారు.. ముసలొడే కానీ మహానుభావుడు అంటూ మరో పంచ్ వేసింది శ్రీముఖి. ప్రియాని విన్నర్ అంటూ యాదమ్మరాజు అనగా.. రాజా ఆ యాంకర్‌ని నువ్వు చంపేస్తావా? నేను చంపేయనా? అని శ్రీముఖి మళ్లీ పంచ్ వేసి అందరినీ నవ్వించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా ... ఒకే షోలో కనిపించినప్పటికీ దివ్వెల మాధురి, రీతూ చౌదరిలు మాట్లాడుకున్నారో లేదో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











