బిగ్‌బాస్ తెలుగు 9 ఫైనల్‌లో సంచలనం.. రోబోతో సర్‌ప్రైజ్ ఎలిమినేషన్, సెకండ్ వికెట్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే ఉత్కంఠగా జరుగుతోంది. టాప్ 5లో పడాల పవన్ కళ్యాణ్, తనూజ పుట్టస్వామి, డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ నిలిచారు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 9 విజేత కానున్నారు. ఫైనల్‌లో సహజంగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తారు. దీనిలో భాగంగా తాజా ఫైనల్‌లో తొలుత సంజనను హీరో శ్రీకాంత్ హౌస్‌లోకి వెళ్లి బయటకు తీసుకొచ్చారు. దాంతో టాప్ 5 కాస్తా టాప్ 4గా మారింది. వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే ఉత్కంఠ నెలకొంది.
అయితే సెకండ్ ఎలిమినేషన్ కోసం బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతో కూడిన రోబోను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ హవా స్పష్టంగా ఉండటంతో బిగ్‌బాస్‌లోనూ రోబోను ప్రవేశపెట్టారు. తొలుత అనగనగా ఒకరాజు టీమ్ తరపున హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరూ తమ సినిమాను ప్రమోట్ చేసుకున్న అనంతరం బిగ్‌బాస్‌లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకురావాలని నాగార్జున టాస్క్ ఇస్తారు. దాంతో రోబోను తీసుకుని నవీన్, మీనాక్షిలు హౌస్‌లో ఎంట్రీ ఇస్తారు.

రోబోను చూడగానే తనూజ తొలుత భయపడింది. అనంతరం దానితో అందరూ ఆడుకుంటారు. ఆ వెంటనే నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరిలు ఎంట్రీ ఇస్తారు. హౌస్‌లో ఉన్న వారి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను.. దానికి రోబో సమాధానం చెబుతుందని అంటాడు నవీన్.
ఈ ఇంట్లో డేంజరస్ స్ట్రాటజీస్ ఎవరి దగ్గర ఉంటాయి?
కళ్యాణ్
ఈ ఇంట్లో ఫుడ్ దొంగతనంగా ఎక్కువసార్లు తినింది ఎవరు?
తనూజ
ఈ ఇంట్లో నీకు ఎక్కువ పని చెప్పింది ఎవరు
ఇమ్మాన్యుయేల్..
ఈ ఇంట్లో నీ కంటే ఎక్కువ తెలివైనవాళ్లు ఎవరు?
ఎవరు లేరు
ఈ హౌస్‌లో ఎక్కువగా ఎవరు ఏడుస్తారు?
తనూజ..
ఈ హౌస్‌లో ఎక్కువగా కుళ్లు జోకులు వేసిందెవరు?
డిమోన్ పవన్
ఆన్సర్స్ అయిపోయిన తర్వాత హౌస్‌లో ఉన్న నలుగురిలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందిగా నాగార్జున చెబుతారు. దాంతో అందరినీ గార్డెన్ ఏరియాకు తీసుకొచ్చి లైన్‌లో నిల్చోబెట్టారు. అనంతరం ఎవరి జర్నీ ఇక్కడ ఎండ్ అవుతుందో వాళ్ల దగ్గర నిలబడమని రోబోకు నవీన్ పొలిశెట్టి చెప్పగా .. రోబో అటు ఇటు తిరిగి కంటెస్టెంట్స్‌ని, మాజీ హౌస్‌మేట్స్‌ని టెన్షన్ పెట్టింది. చివరికి ఇమ్మాన్యుయేల్ దగ్గర నిలబడటంతో అతను ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ మాట వినగానే తనూజ అతనిని హత్తుకుంది. చాలా బాగా ఆడావని నవీన్ పొలిశెట్టి మెచ్చుకున్నాడు. మరోవైపు.. తన బిడ్డ విజేత అవుతాడని అనుకున్న ఇమ్మాన్యుయేల్ తల్లిదండ్రులు బాగా ఎమోషనల్ కావడంతో వారిని భరణి, దివ్య నిఖిత తదితర కంటెస్టెంట్స్ ఓదార్చారు.
ఇమ్మాన్యుయేల్‌ని తీసుకుని నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరిలు తీసుకుని రాగా వారిద్దరికి నాగ్ వీడ్కోలు పలికారు. అనంతరం సీజన్ మొత్తం మమ్మల్ని నవ్వించి బాగా ఎంటర్‌టైన్ చేశావని ఇమ్మాన్యుయేల్‌ని నాగార్జున మెచ్చుకున్నారు. ఇమ్మూ మాట్లాడుతూ.. ఈ షో కోసం ఎన్నో వదులుకుని వచ్చాను. ఎక్కడైనా, ఎలాగైనా బతకొచ్చని నేర్పించింది బిగ్‌బాస్. నాకు మా అమ్మనాన్నల విలువ తెలిసేలా చేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పారు ఇమ్యాన్యుయేల్.


Click it and Unblock the Notifications











